• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Baby Movie Review: యూత్‌ని కట్టిపడేసిన బేబీ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకుడు ఫిదా అయ్యాడా?

    నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, తదితరులు

    డైరెక్టర్: సాయి రాజేశ్

    నిర్మాత: శ్రీనివాస కుమార్(ఎస్కేఎన్)

    మ్యూజిక్: విజయ్ బుల్గానిన్

    సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి

    కలర్ ఫొటో వంటి సినిమాకు కథ అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ సినిమా తర్వాత స్వయంగా కథ రాసుకుని డైరెక్షన్ వహించిన సినిమా ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్, మ్యూజిక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. చిత్రబృందం కూడా పూర్తి నమ్మకంతో ఉంది. మరి, ఈ మూవీ ప్రేక్షకుడిని మెప్పించిందా? ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యాడా? అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం. 

    కథేంటంటే?

    ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైషూ(వైష్ణవి చైతన్య) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో ఆనంద్‌ని వైషూ ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైషూ ప్రేమను అంగీకరిస్తాడు. అయితే, ఆనంద్ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా మారతాడు. అదే సమయంలో వైషూ ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చదువులకు వెళ్తుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో అక్కడి కల్చర్‌కు వైషూ అలవాటు పడి క్రమంగా ఆనంద్‌ని దూరం పెడుతుంది. మరోవైపు, విరాజ్‌కి దగ్గరవుతుంది. శారీరకంగానూ ఒకటవ్వాల్సి వస్తుంది. మరి, వైష్ణవి ఎవరిని ప్రేమించింది? ఆనంద్ ఏమయ్యాడు? అనేది తెరపై చూడాల్సిందే. 

    ఎలా ఉంది?

    ప్రచార చిత్రాలను బట్టే సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థమైపోయింది. సినిమా చివరికి విషాదాంతమవుతుందని సూచిస్తూ డైరెక్టర్ సినిమాని మొదలు పెట్టాడు.  తొలుత ఆనంద్, వైషూల మధ్య వచ్చే స్కూల్ డేస్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పెద్దగా డైలాగులు లేకుండా కేవలం హావభావాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సాగే ఈ సీక్వెన్స్ ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు చప్పట్లు కొట్టిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. ఆనంద్‌కి తెలియకుండా విరాజ్‌తో వైష్ణవి బంధాన్ని కొనసాగించడం, విరాజ్ అసలు వ్యక్తిత్వాన్ని ఆలస్యంగా తెలుసుకోవడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతుంది. యూత్ ఆలోచనకు తగ్గట్టు సన్నివేశాలు సాగడంతో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 

    ఎవరెలా చేశారంటే?

    సినిమాకు ఆనంద్, వైష్ణవి ప్రాణం పోశారు. ఇద్దరూ తమ తమ పాత్రల్లో పోటీ పడి మరీ నటించారు. ఆటోడ్రైవర్‌గా ఆనంద్ చక్కటి అభినయం ప్రదర్శించాడు. ఎమోషనల్ సన్నివేశాలు బాగా చేసినా చివర్లో కాస్త తడబడినట్లు అనిపించింది. ఇక బస్తీ అమ్మాయిగా, గ్లామర్ గర్ల్‌గా వైష్ణవి చక్కగా చేసింది.  లుక్స్ పరంగా, నటన పరంగా ఆకట్టుకుంది. ఒక రకంగా వైష్ణవి పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణ. బోల్డ్ సన్నివేశాల్లో అందాలు ఒలికించి.. భావోద్వేగ భరిత సీన్లకు న్యాయం చేసింది. ఇక విరాజ్ అశ్విన్, నాగబాబు, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. 

    టెక్నికల్‌గా..

    తెలిసిన కథే అయినప్పటికీ సినిమాను చక్కగా, ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్ సాయిరాజేశ్. డైలాగ్స్‌తో ప్రేక్షకుడ‌్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. నేటి యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లేను ప్రజెంట్‌ చేశాడు. ఎమోషనల్ సీన్లను చక్కగా తీశాడు. అయితే, క్లైమాక్స్‌లో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. క్యారెక్టర్లను పేలవంగా ముగించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా సీన్లను సాగదీసినట్లు ఉంటుంది. ఇక, విజయ్ బుల్గానిని మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బాల్ రెడ్డి అందించిన విజువల్స్ సహజంగా ఉన్నాయి. 

    ప్లస్ పాయింట్స్

    కథనం, డైలాగ్స్

    నిర్మాణ విలువలు

    యూత్ ఎలిమెంట్స్

    సంగీతం

    మైనస్ పాయింట్స్

    సాగతీత సన్నివేశాలు

    క్లైమాక్స్

    చివరగా.. యూత్‌ మనసును కట్టిపడేసే చిత్రమే ‘బేబీ’

    రేటింగ్: 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv