• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బేబీ’ కాంబో మళ్లీ రిపీట్‌

    ‘బేబీ’ సినిమా కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతుంది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య. వీరిద్దరు కలిసి మరో సినిమాలో కనిపింబోతున్నారు. ఈ మేరకు చిత్రీకరణ ప్రారంభమైందని తెలుపుతూ మేకర్స్ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.. అందులో ఏడుస్తూ ఉన్న వైష్ణవిని ఆనంద్‌ ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు. ఇది కూడా ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

    బేబి సినిమా డైరెక్టర్‌కు ‘ఐకానిక్’ అవార్డు

    బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్‌ ఇనోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ట్రెండింగ్ ఐకానిక్ దర్శకునిగా అవార్డు గెలిచాడు. యంగ్ హీరో దేవరకొండ ఆనంద్, కుర్ర హీరోయిన్ వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో బేబీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఓటీటీలోనూ ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఇనోవేటివ్ అవార్డు రావడంతో మరిన్నీ అవార్డులు బేబీ మూవీ సొంతం చేసుకునేందుకు మార్గం సుగమం అయింది.

    పుష్ప2 డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్

    పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలోని డైలాగును ఐకాన్ స్టార్ లీక్ చేశాడు. బేబీ సినిమా అప్రిషియేషన్ మీట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప2 నుంచి డైలాగును లీక్ చేశాడు. ‘ఒక్కడ ఒక్కటే రూల్ ఉంటుంది. అదే పుష్ప గాడి రూలూ’ అంటూ చెప్పాడు. ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. కాగా, బేబి మూవీ విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. యూత్‌ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది. Icon StAAr #AlluArjun LEAKS #Pushpa 2 dialogue on the … Read more

    ఆసక్తిగా ‘బేబీ’ ట్రైలర్

    ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన బేబీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ మరింత ఆసక్తికరంగా ఉంది. వెరైటీ ప్రేమ కథాచిత్రంగా ‘బేబీ’ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. సాయిరాజేశ్ దర్శకత్వం వహించారు. ఎస్కేఎన్, డైరెక్టర్ మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై 14న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    తొలిప్రేమ ఎన్నటికీ సజీవమే; ‘బేబీ’ టీజర్ అవుట్

    ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ చిత్ర టీజర్‌ను మూవీమేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఎంతో హృద్యంగా సాగింది. టీజర్ చూస్తుంటూ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. తొలి ప్రేమ జ్ణాపకాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ‘‘మొదటిప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’’ అనే అక్షరాలతో ట్రైలర్ మొదలవుతుంది. ఈ చిత్రంలో ఆనంద్ సరసన వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఈ చిత్రానికి సాయిరాజేష్ నీలం దర్శకత్వం చేపట్టారు.