• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Pedda Kapu 1 Review: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!

  నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్‌, నాగ బాబు, రాజీవ్‌ కనకాల, ఈశ్వరి రావు, ఆడుకలం నరేన్‌

  డైరెక్టర్‌: శ్రీకాంత్ అడ్దాల

  సంగీతం: మిక్కీ జే. మేయర్‌

  సినిమాటోగ్రఫీ: ఛోటా కే. నాయుడు

  నిర్మాత: మిర్యాల రమేష్‌, మిర్యాల సత్యనారాయణ

  క్లాస్‌ దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పెదకాపు 1’ (Peda Kapu 1). టైటిల్‌ని బట్టి చాలామంది ఈ సినిమా ఓ సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందిందని అనుకుంటున్నారు. కానీ, ఇది క్యాస్ట్‌కు సంబంధించి కాదు ఓ సామాన్యుడి సంతకం అని దర్శకుడు స్పష్టం చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్‌ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ సినిమాతో శ్రీకాంత్‌ అడ్డాల తన పంథా మార్చడం ఓ విశేషమైతే ఇందులో నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలో ఆయన నటించడం మరో విశేషం. అయితే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్‌ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి రివ్యూ మీకోసం.

  కథ:

  1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం అది. లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్), బయన్న (నరేన్) అనే ఇద్దరు వ్యక్తులు శాసిస్తుంటారు. హింసని ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం మిగతా జనాల్ని బలిపశువులుగా మారుస్తుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అలా జైలుకి వెళ్ళిన పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే 1983 సంవత్సరంలో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్య రంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెదకాపు.. వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామాల్లో అల్లర్లు చేలరగడానికి కారణం ఏమిటి? ఈ కథలో కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ (అనసూయ), పార్టీ ఇంచార్జ్ (నాగబాబు) పాత్రల స్వభావం ఏమిటి?  తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

  ఎలా సాగిందంటే?

  ఫస్టాఫ్‌లోని ప్రథమ భాగమంతా గోదావరి జిల్లాలో కులాల కొట్లాటల చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల తరపున హీరో టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఆ సీన్‌ కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ఇక సత్య రంగయ్య, బయన్న అరాచకాలు, వాటి మధ్య నలిగే గ్రామీణ ప్రజలు, పెద్దకాపు నేతగా ఎదిగే తీరును ఫస్టాఫ్‌లో డైరెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతల అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. సత్య రంగయ్య హఠాన్మరణం, పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ దట్టించిన విధానం సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసేందుకు దోహదపడ్డాయి. అనసూయ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.

  ఎవరేలా చేశారంటే

  పెదకాపు పాత్ర చేసిన విరాట్‌ కర్ణకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ నటుడిగా తనకు మంచి భవిష్యత్‌ ఉందని ‌అతడు నిరూపించుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌లో బాగా నటించాడు. చాలా సహజంగా కనిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఎమోషన్ సీన్స్‌, భారీ డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం కాస్త తడబడినట్లు కనిపించింది. హీరోయిన్‌ ప్రగతి పాత్రకు యాక్టింగ్‌ స్కోప్‌ లేకపోవడంతో తెరపై ఆమె కంట్రీబ్యూషన్‌ తక్కువే. ఇక సినిమాకు అనసూయ నటనే హైలెట్‌ అని చెప్పవచ్చు. అక్కమ్మ పాత్రలో ఆమె ఇరగదీసింది. అయితే రంగమ్మత్తలా ఓన్ చేసుకునే పాత్ర ఐతే కాదు. సత్యరంగయ్య పాత్రలో రావు రమేష్‌ అదరగొట్టాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా మంచి నటన కనబరిచారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్దాల నిజంగానే సర్ప్రైజ్ చేశారు. తనికెళ్ల భరణి, నాగబాబు, రాజీవ్‌ కనకాల ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు. 

  టెక్నికల్‌గా..

  సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సి ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం. ఆయన తన నైపుణ్యంతో సినిమాకు కలర్‌ఫుల్‌ రంగులు అద్దారు. నిజంగా కొత్త గోదావరిని చూపించారు. జెండాపాతే సన్నివేశం, గౌరీ ఉరి సన్నివేశం, జాతర పాటని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. మిక్కీ జె. మేయర్‌ పాటలు సినిమాకి కలిసిరాలేదు. నేపథ్య సంగీతం మాత్రం బావుంది. మాటలు, పాటలతో కథ చెప్పే శ్రీకాంత్‌ అడ్డాల ఆ విషయంలో కాస్త గతి తప్పినట్లు కనిపించింది. ఒకట్రెండు మినహా సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు పెద్దగా కనిపించవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాణ్యత విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించదు. 

  ప్లస్‌ పాయింట్స్‌

  • స్క్రీన్‌ ప్లే
  • విరాట్‌, అనసూయ నటన
  • నేపథ్య సంగీతం
  • సినిమాటోగ్రఫీ

  మైనస్‌ పాయింట్స్‌

  • సాగదీత సీన్స్
  • పాటలు

  రేటింగ్‌ : 3/5

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv