గతవారం రోజుల నుంచి సరైన హిట్ లేక థియేటర్లు చిన్నబోతున్నాయి. చిన్న చిన్న సినిమాలు సందడి చేసినప్పటికీ.. వాటికి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. గతవారం విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన నిఖిల్ నటించిన ‘స్పై’ డిజాస్టర్‌గా నిలిచింది. సామజవరగమణ సినిమా ఒక్కటే కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ వారం ఏయే సినిమాలు థియేటర్‌లో సందడి చేయనున్నాయి. ఏయే వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానున్నాయో ఓసారి చూద్దాం.
బేబీ
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘బేబీ’. ఈ చిత్రం జులై 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం సినిమాపై చాలా కన్ఫడెంట్‌గా ఉంది. ఇప్పటిటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చిత్రం తెరకెక్కినట్లు తెలిసింది. ఇద్దరి యువకుల ప్రేమ మధ్య నగిలే అమ్మాయిలా వైష్ణవి, చిన్నతనం గాఢంగా ఆమెను లవ్ చేసే పాత్రలో ఆనంద్ దేవరకొండ అద్భుతంగా నటించినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.
నాయకుడు
ఉదయనిధి స్టాలిన్, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తమిళ్ హిట్ చిత్రం ‘మామన్నన్’. ఈ సినిమా తెలుగులో నాయకుడుగా జులై 14న రిలీజ్ కానుంది. జూన్ 29న తమిళ్‌లో రిలీజైన ఈ మూవీ రూ.40కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రూలింగ్ పార్టీ లీడర్‌తో ఓ తండ్రీకొడుకులు సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని సెల్వరాజ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. తొలిసారి కమెడియన్ వడివేలు ఎమ్మెల్యే పాత్రలో సీరియస్ రోల్ చేశాడు.
మహావీరుడు
శివ కార్తికేయన్ లీడ్ రోల్‌లో మడోన్ అశ్విన్ డైరెక్ట్ చేసిన యాక్షన్ చిత్రం మహావీరుడు (Mahaveerudu). ఈ మూవీ జులై 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. అదితి శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రచారాన్ని మూవీ యూనిట్ ప్రారంభించింది. శివ కార్తికేయన్‌ను మునుపెన్నడు చూడని పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు.
భారతీయన్స్: ది న్యూ బ్లడ్
ప్రముఖ రచయిత ధీన్ రాజ్ డైరెక్టర్‌గా మారి తీసిన చిత్రం ‘భారతీయన్స్’. ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత్- చైనా సరిహద్దుల్లో గల్వాన్ లోయ ఘర్షణల్లో చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలిచిన భారతీయ సైనికుల పోరాట పటిమ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్కాస్ హీరోలు. సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాంరా, ఈశ్వర్, కలిసుందాంరా వంటి హిట్ చిత్రాలకు ధీన్ రాజ్ కథ అందించిన సంగతి తెలిసిందే.
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రికరింగ్ పార్ట్ 1
మిషన్ ఇంపాసిబుల్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కీలక పాత్రలో వస్తున్న చిత్రం మిషన్ ఇంపాసిబుల్: డెడ్ రెకనింగ్ (Mission Impossible Dead Reckoning) క్రిస్టోఫర్, మెక్ క్యూరీ ఈ చిత్రాన్ని యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. పార్ట్-1 జులై 12న రిలీజ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో సినిమా సందడి చేయనుంది.
ఈ వారంలో OTTల్లో రిలీజ్ కానున్న మరికొన్ని చిత్రాలు
Title | Category | Language | Platform | Release Date |
Bird Box Barcelona | Movie | English | Netflix | July 14 |
Kohara | Web Series | Hindi | Netflix | July 15 |
Transformers: Rise of the Beasts | movie | English | Prime | July 11 |
Mayabazaar For Sale | Web Series | telugu | ZEE5 | July 14 |
Janaki Johnny | Web Series | Malayalam | Disney + Hotstar | July 11 |
The Trial | Web series | Hindi | Disney + Hotstar | July 14 |
Crime Patrol – 48 Hours | Movie | Hindi | Sony Liv | July 10 |
College Romance July 25 | Web series | Hindi | Sony Liv | July 25 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!