ఓటీటీలోకి విజయ్ ‘వారసుడు’; ఎప్పుడంటే?
తమిళ్ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా జంటగా నటించిన ‘వారసుడు’ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. ఈ నెల 22న ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించనుందని సమాచారం. కాగా ‘వారసుడు’ మూవీ జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.