• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆకట్టుకుంటున్న ‘క్రేజీ ఫెలో’ ట్రైలర్

  టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘క్రేజీ ఫెలో’ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే ఈసారి ఆది ఖచ్చితంగా హిట్ కొట్టేలా కనిపిస్తోంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌ట్రైనర్‌గా ఈ చిత్రాన్నిరూపొందించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఫణిక్రిష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆదికి జోడీగా సూర్యవంశీ, మర్నామీనన్‌లు నటించారు. కాగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 14న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

  ‘గాడ్‌ఫాదర్’ హిందీ ట్రైలర్ రిలీజ్

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ ట్రైలర్‌ను హిందీలో కూడా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. శనివారం ముంబైలో ఈ ట్రైలర్ విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్నిదసరా సందర్భంగా అక్టోబర్ 5న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

  ‘నో మోర్ మెర్సీ’ అంటున్న నాగ్

  కింగ్ నాగార్జున హీరోగా, సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించిన ‘ది ఘోస్ట్’ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో నాగార్జున మాస్ యాక్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. యాక్షన్ సీన్స్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉండడంతో ప్రేక్షకులకు ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ‘నో మోర్ మెర్సీ’ అంటూ నాగార్జున విలన్లను ఊచకోత కోయడం ట్రైలర్‌కే హైలెట్‌గా మారింది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం చేపట్టారు. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

  ‘నజభజ’ సాంగ్ అదుర్స్

  మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ నుంచి మరో పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ’నటభజ జజరా’ అనే సాంగ్‌‌లో చిరు నట విశ్వరూపం ప్రదర్శించారు. ఈ మాస్ సాంగ్‌ చూసి చిరు అభిమానులు ఫిదా అవుతున్నారు. కాగా గాడ్ ఫాదర్ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో కండలవీరుడు సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, నయనతార, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు.

  ‘ప్రిన్స్’ నుంచి మరో సాంగ్ రిలీజ్

  తమిళ నటుడు శివ కార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘జెస్సికా’ పాటను ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో వదిలారు. ఇంతకుముందు ‘బింబిలక్కి పిలపి’ సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ సినిమాలో కార్తికేయన్‌కు జోడీగా ఉక్రెయిన్ నటి మరియా నటించింది. జాతిరత్నాలు ఫేం అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వచ్చే దీపావళికి ఈ చిత్రాన్నిథియేటర్లలో విడుదల చేస్తున్నారు.

  ’సీతారామం‘ నుంచి డిలీటెడ్ సీన్

  క్లాసికల్ హిట్ మూవీ ‘సీతారామం’ నుంచి డిలీటెడ్ సీన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. పాకిస్తాన్ జైలులో రామ్-విష్ణుశర్మ మధ్య జరిగే సన్నివేశాన్నిరిలీజ్ చేశారు. ఇద్దరి మధ్య జరిగే ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సీన్ సినిమాలో ఉంచి ఉంటే ఇంకా బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా సీతారామం మూవీ ఇటీవల విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

  ‘అల్లూరి’ మేకింగ్ స్టిల్స్ అదుర్స్

  శ్రీవిష్ణు హీరోగా, కయదు లోహర్ హీరోయిన్‌గా తెరకెక్కిన అల్లూరి చిత్రం నుంచి మేకింగ్ స్టిల్స్ విడుదల చేశారు మూవీ మేకర్స్. సినిమాలో ‘నీ చూపులకు’ అనే వెడ్డింగ్ సాంగ్‌కు సంబంధించిన స్టిల్స్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ చిత్రాన్నిసెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

  Surya’s ET (Evariki Talavanchadu) has a mind-blowing trailer

  Vijay Devarakonda has released the Telugu trailer for Surya’s film ET (Evariki Talavanchadu). The film was marketed as a mass action thriller. “My favourite hero is Surya, and His Acting is topnotch,” says Vijay Devarakonda. Sun Pictures produces the film, which is directed by Pandiraj. Fights and mass action Surya appears to be playing an action-oriented character in this film, … Read more

  MS Dhoni Rocks It as Atharva First Look Poster on YouTube Release Causes a Flutter

  The two-minute YouTube video introducing cricket megastar MS Dhoni’s look as Atharva purportedly the main character in what we are told is a new age graphic novel authored by Ramesh Thamiani, produced by  Adaikalarai and Asok Manor. Dhoni appears as a scruffy best chested warrior battling it out with an assortment of demonic characters armed to the teeth against an … Read more