• TFIDB EN
  • భరతనాట్యం (2024)
    U/ATelugu

    రాజు సుందరం అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ డైరెక్టర్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆర్థిక సమస్యల వల్ల డబ్బు దొంగతనం చేసి ఇండస్ట్రీలో సెటిల్‌ అవ్వాలని భావిస్తాడు. ఓ ముఠా నుంచి పొరపాటున డ్రగ్స్‌ ఉన్న భరతనాట్యం బ్యాగ్‌ను దొంగిలిస్తాడు. దీంతో ఆ ముఠా నుంచి రాజుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతడు డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.

    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    సిబ్బంది
    కెవిఆర్ మహేంద్రదర్శకుడు
    పాయల్ సరాఫ్నిర్మాత
    వివేక్ సాగర్సంగీతకారుడు
    కథనాలు
    <strong>Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?</strong>
    Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : సూర్య తేజ, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్‌ వంశీ, నాగ మహేష్‌, సత్తన్న తదితరులు దర్శకత్వం : కేవీఆర్‌ మహేంద్ర సంగీతం : &nbsp;వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్‌. శాఖమూరి ఎడిటింగ్‌ : రవితేజ గిరజాల నిర్మాత : పాయల్‌ సరాఫ్‌ నిర్మాణ సంస్థ : పీఆర్‌ ఫిల్మ్స్‌ విడుదల తేదీ: ఏప్రిల్‌ 5, 2024 కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే (Actor Surya Teja Aelay) హీరోగా మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా చేసిన చిత్రం ‘భరతనాట్యం’ (Bharatanatyam Review In Telugu). ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఏప్రిల్‌ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? కథేంటి రాజు సుందరం (సూర్య తేజ ఏలే) అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ డైరెక్టర్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. పేద కుటుంబం నుండి రావడంతో అతడ్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి. దీంతో డబ్బు దొంగతనం చేసి ఇండస్ట్రీలో సెటిల్‌ అవ్వాలని రాజు భావిస్తాడు. ఇందుకోసం ఓ రౌడీ గ్యాంగ్‌ నుంచి డబ్బు అనుకొని పొరపాటున డ్రగ్స్‌ ఉన్న భరతనాట్యం బ్యాగ్‌ను దొంగిలిస్తాడు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్‌ శకునికి దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రౌడీ గ్యాంగ్‌ నుంచి రాజుకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఈ సమస్య నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? డైరెక్టర్ కావాలన్న అతడి కల నెరవేరిందా? లేదా? హీరోయిన్‌ మీనాక్షి గోస్వామితో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? హీరోగా సూర్య తేజ ఏలే పర్వాలేదనిపించాడు. అయితే నటన పరంగా ఇంకాస్త పరిణితి చెందాల్సి ఉంది. అతడి పాత్రకు చెప్పిన డబ్బింగ్‌ కూడా పెద్ద సింక్‌ కాలేదు. హీరోయిన్‌ మీనాక్షి గోస్వామి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. హీరోయిన్‌లా కాకుండా అక్కడక్కడా ఓ గెస్ట్‌గా మెరిసింది. కనిపించినంత సేపు తన అందం, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హర్ష తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వులు పూయించాడు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ‘దొరసాని’ (Dorasaani) తో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra) కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో అతడి మార్క్‌ ఎక్కడా కనిపించదు. ‘స్వామిరారా’ (Swamy Ra Ra) స్టైల్లో ఓ క్రైమ్ కామెడీ కథగా తెరకెక్కించాలని భావించి ఇందులో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ‘స్వామిరారా’ రేంజ్లో ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఇందులో ఒక్కటి కూడా లేదు. ఏ దశలోనూ సినిమా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇంటర్వెల్‌ వరకూ అసలు కథ ఏంటో తెలియక ప్రేక్షకులు సతమతమవుతుంటారు. దర్శకుడు మహేంద్ర ఒక్క సన్నివేశాన్ని కూడా సందర్భానుసారంగా తెరకెక్కించినట్లు అనిపించదు. సెకండాఫ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. వెంకట్ ఆర్‌ శాఖమూరి అందించిన సినిమాటోగ్రాఫీ బాగుంది. వివేక్‌ సాగర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం కాస్త బెటర్ అనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వైవా హర్ష కామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసందర్భానుసారంగా లేని సీన్లుసంగీతం Telugu.yousay.tv Rating : 1.5/5 
    ఏప్రిల్ 05 , 2024
    <strong>శ్రీలీల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    శ్రీలీల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తెలుగులో చాలా తక్కవ కాలంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శ్రీలీల. తన క్యూట్ లుక్, యాక్టింగ్‌తో విరివిగా అవకాశాలను అందిపుచ్చుకుంది. పెళ్లిసందD చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ కుర్ర హీరోయిన్‌ స్కంద, ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. ఈక్రమంలో శ్రీలీల గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Sreeleela) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. &nbsp;శ్రీలీల దేనికి ఫేమస్? శ్రీలీల కన్నడ, తెలుగు భాషాల్లో స్టార్ హీరోయిన్‌గా ఉంది. ధమాకా, పెళ్లిసందD, గుంటూరు కారం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.&nbsp; &nbsp;శ్రీలీల వయస్సు ఎంత? 2001, జూన్ 14న జన్మించింది. ఆమె వయస్సు 23 సంవత్సరాలు&nbsp; శ్రీలీల ముద్దు పేరు? లీల &nbsp;శ్రీలీల ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు&nbsp; &nbsp;శ్రీలీల ఎక్కడ పుట్టింది? డెట్రాయిట్, అమెరికా &nbsp;శ్రీలీల అభిరుచులు? సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం, డ్యాన్స్ చేయడం &nbsp;శ్రీలీలకు ఇష్టమైన ఆహారం? వెజిటేరియన్ &nbsp;శ్రీలీల తల్లిదండ్రుల పేర్లు? తల్లిపేరు స్వర్ణలత( బెంగుళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్) &nbsp;శ్రీలీల ఫెవరెట్ హీరో? పవన్ కళ్యాణ్ శ్రీలీలకు ఇష్టమైన కలర్ ? రెడ్ శ్రీలీలకు ఇష్టమైన హీరోయిన్స్ శ్రీదేవి, రేఖ &nbsp;శ్రీలీల తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? పెళ్లిసందD &nbsp;శ్రీలీల ఏం చదివింది? MBBS &nbsp;శ్రీలీల పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.2కోట్ల నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. శ్రీలీల సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? శ్రీలీల సినిమాల్లోకి రాకముందు భరత నాట్యం ప్రదర్శనలు ఇచ్చింది. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసింది &nbsp;శ్రీలీల ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/sreeleela14/?hl=en శ్రీలీలకు ఎన్ని అవార్డులు వచ్చాయి? ధమాకా చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది శ్రీలీలకు ఎంత మంది పిల్లలు? శ్రీలీల దివ్యాంగులైన ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతోంది. అబ్బాయి పేరు గురు, అమ్మాయి పేరు శోభిత https://www.youtube.com/watch?v=N4Zdl7slKZc శ్రీలీల గురించి మరికొన్ని విషయాలు శ్రీలీల కన్నడలో కిస్ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది.శ్రీలీల తన మూడేళ్ల వయస్సు నుంచే భరతనాట్యం నేర్చుకుందిసినిమాలకు విరామం ప్రకటించిన తర్వాత డాక్టర్‌గా పనిచేస్తానని శ్రీలీల చెప్పింది.శ్రీలీలకు పెంపుడు జంతువులంటే ఇష్టంశ్రీలీల తండ్రి పారిశ్రామిక వేత్త సూరపనేని శుభాకర్‌రావు అని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అతను కొట్టి పారేశాడు. శ్రీలీల తల్లితో తాను విడాకులు తీసుకున్న తర్వాత ఆమె జన్మించినట్లు పేర్కొన్నాడు.
    ఏప్రిల్ 08 , 2024
    <strong>Summer Heroines 2024: వేసవి హీట్‌ మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న అందాలు భామలు వీరే!&nbsp;</strong>
    Summer Heroines 2024: వేసవి హీట్‌ మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న అందాలు భామలు వీరే!&nbsp;
    సమ్మర్‌ అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండగ లాంటిది. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవుల నేపథ్యంలో చిన్న, పెద్ద సినిమాలు సమ్మర్‌లో విడుదలయ్యేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో వినోదాలు పంచడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా అందులోని కథానాయకులు వేసవి హీట్‌ను తమ అందచందాలతో మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏంటి? అవి ఎప్పుడు విడుదలవుతాయి? వంటి అంశాలు ఈ కథనంలో చూద్దాం.&nbsp; మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ‘సీతా రామం’, ‘హాయ్‌ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మృణాల్‌ ఠాకూర్‌.. ఈ సమ్మర్‌లో సరికొత్త మూవీతో వస్తోంది. యంగ్‌ హీరో విజయ్‌ నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లో మరోమారు సందడి చేయబోతోంది. ఈ మూవీ ఏప్రిల్‌ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.&nbsp; దివ్యాంశ కౌషిక్‌ (Divyansha Kaushik) ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ద్వారా అలరించనున్న మరో నటి దివ్యాంశ కౌషిక్‌. ఇందులో ఈ భామ సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తోంది. 2019లో వచ్చిన మజిలీ సినిమా ద్వారా దివ్యాంశ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రామారావు ఆన్‌ డ్యూటీ, పోలీసు వారి హెచ్చరిక, మైఖేల్‌ తదితర చిత్రాల్లో నటించింది.&nbsp; అంజలి (Anjali) ప్రముఖ హీరోయిన్‌ అంజలి కూడా ఈ వేసవిని మరింత హీటెక్కించేందుకు రెడీ అవుతోంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించనుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌, షకలక శంకర్ ముఖ్యపాత్రలు పోషించారు.&nbsp; స్వర్ణిమా సింగ్‌ (Swarnima Singh) హర్షివ్‌ కార్తీక్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బహుముఖం' (Bahumukham). 'గుడ్‌, బ్యాడ్ యాక్టర్‌' అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమాలో స్వర్ణిమా సింగ్‌ కథానాయికగా చేసింది. తన అందం, అభినయంతో ఆకట్టుకునేందుకు ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.&nbsp; మీనాక్షి గోస్వామి (Meenakshi Goswami) మీనాక్షి గోస్వామి కథానాయికగా చేసిన లేటెస్ట్‌ చిత్రం 'భరతనాట్యం'. ఈ మూవీ ద్వారానే మీనాక్షి తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా సూర్యతేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమా ఓ యువకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందన్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రనీకాన్వికా (Praneekaanvikaa) ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న మరో చిన్న చిత్రం 'మార్కెట్‌ మహాలక్ష్మీ'. కేరింత ఫేమ్‌ పార్వతీశం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రణీకాన్వికా నటించింది. ఇదే ఆమెకు మెుదటి సినిమా. ఈ మూవీ విజయం ద్వారా తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోంది. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.&nbsp; కోమలి ప్రసాద్‌ (Komali Prasad)&nbsp; యంగ్‌ హీరోయిన్‌ కోమలి ప్రసాద్‌ కూడా.. ఈ వేసవిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘శశివదనే’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ‘నేను సీతాదేవి’ (2016) చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన కోమలి.. ‘హిట్‌ 2’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. శశివదనే సినిమా విజయంపై ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ సినిమా సెక్సెస్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన హీరోయిన్‌ వైష్ణవి చైతన్య. ఈ భామ నటించిన రెండో చిత్రం 'లవ్‌ మి ఇఫ్‌ యు డేర్‌' కూడా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ నెల 25 నుంచి తెలుగు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయనుంది.&nbsp;
    ఏప్రిల్ 03 , 2024
    This Week OTT Movies: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
    This Week OTT Movies: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
    కాలేజీ విద్యార్థుల పరీక్షలు ముగిశాయి. ఎండకాలం స్టార్ట్‌ అయిపోయింది. ఈ ఎండల వేడిని తగ్గించి చల్లని వినోదం అందించి ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTTలో సైతం పలు ఆసక్తికర చిత్రాలు ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీ స్టార్(Family Star) రౌడ్ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), గ్లామర్ డాల్ మృణాల్ ఠాకూర్ జంటగా... పరుశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లోకి రానుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబోలో వచ్చిన 'గీతా గోవిందం' బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్‌గా నిలచింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌పై పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి.&nbsp; ఈ సినిమా ప్రమోషన్లను సైతం మూవీ మేకర్స్ భారీగా చేస్తున్నారు.&nbsp; భరత నాట్యం కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే(Actor Surya Teja Aelay) హీరోగా పరిచయం అవుతున్న సినిమా భరతనాట్యం. ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. సూర్య తేజకు జంటగా మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా స్క్రీన్ షేర్ చేసుకొనుంది. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన మంజుమ్మల్‌ బాయ్ తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్‌ను దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న తెలుగురాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేయనున్నారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మాణమైన ఈ చిత్రం ఏకంగా రూ.200 కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. ప్రొజెక్ట్ లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్ కాంబోలో వచ్చిన తమిళ్ చిత్రం 'మాయవన్'... తెలుగులో ప్రొజెక్ట్‌గా రానుంది.&nbsp; సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జనర్‌లో ఈ చిత్రం&nbsp; తెరకెక్కింది.&nbsp; ఈ సినిమా ఏప్రిల్‌ 6న విడుదల కానుంది. ఈ సినిమాలో డేనియల్ బాలాజీ,&nbsp; జయప్రకాశ్, మైమ్ గోపి వంటి వారు నటించారు.&nbsp; బహుముఖం హర్షివ్ కార్తిక్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బహుముఖం. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో హర్షివ్ కార్తిక్ స్వీయ దర్శకత్వం వహించాడు. గుడ్ బ్యాడ్&nbsp; అండ్ యాక్టర్ ట్యాగ్‌లైన్‌ను ఈ చిత్రానికి అందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌లుగా స్వర్ణిమా సింగ్,&nbsp; మార్టినోవా కథానాయికలుగా చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTogetherSeriesEnglishNetflixApril 2Files Of The UnexplainedSeriesEnglishNetflixApril 3RipleySeriesEnglishNetflixApril 4ScoopSeriesEnglishNetflixApril 5MusicaMovieEnglishAmazon primeApril 5Yeh Meri FamilySeriesHindiAmazon primeApril 4How to Date Billy WalshSeriesEnglishAmazon primeApril 5FarreyMovieHindiZee5April 5LambasingiMovieTelugu&nbsp;Disney+ HotstarApril 2
    ఏప్రిల్ 01 , 2024
    Preity Mukhundhan: ‘ఓం భీమ్‌ బుష్‌’ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?
    Preity Mukhundhan: ‘ఓం భీమ్‌ బుష్‌’ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ ప్రీతి ముకుందన్‌ (Preity Mukhundhan).. ‘ఓం భీమ్‌ బుష్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హీరో శ్రీవిష్ణు (Sri Vishnu)కు జోడీగా కనిపించి అందర్ని మెప్పించింది. మంచు విష్ణు (Manchu Vishnu) ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa)లోనూ ఈ బ్యూటీ ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. దీంతో ప్రీతి ముకుందన్‌ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తెచ్చింది.&nbsp; ప్రీతి ముకుందన్‌ ఎవరు? టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్‌ హీరోయిన్‌ ప్రీతి ముకుందన్‌ ఎక్కడ పుట్టింది? తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతం ఆమె జన్మ స్థలం ప్రీతి ముకుందన్‌ పుట్టిన తేదీ? జులై 30, 2001లో ప్రీతి ముకుందన్ జన్మించింది.&nbsp; ప్రీతి ముకుందన్‌ తల్లిదండ్రులు ఎవరు? తన పేరెంట్స్‌ సంబంధించిన సమాచారాన్ని ప్రీతి ఎక్కడా బహిరంగ పరచలేదు. దీనిపై ఆమె గోప్యత పాటిస్తోంది.&nbsp; ప్రీతి ముకుందన్‌ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు అని తెలుస్తోంది.&nbsp; ప్రీతి ముకుందన్‌ ఏం చదివారు? ఈ బ్యూటీ బిటెక్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ చేసింది. ప్రీతి ముకుందన్‌ ఎక్కడ చదివారు? నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తిరుచ్చి (NIT-T) ప్రీతి ముకుందన్‌కు భరతనాట్యం వచ్చా? ఈ భామకు డ్యాన్స్‌ అంటే మహా ఇష్టం. తన ఐదో ఏట నుంచి భరతనాట్యానికి శిక్షణ తీసుకుంది. ‘కన్నప్ప’ చిత్రంలో అవకాశం రావడానికి ఈ నైపుణ్యం కూడా ఓ కారణమని ఇండస్ట్రీలో టాక్‌.&nbsp; &nbsp;ప్రీతి ముకుందన్‌ ఎలాంటి డ్యాన్స్‌లు చేయగలదు? ప్రీతి తొలుత క్లాసికల్‌ డ్యాన్సర్‌. ఆ తర్వాత హిప్‌హాప్‌, సినీ ఫోక్‌, వెస్టర్న్‌ తదితర వాటిలో కూడా పట్టు సాధించిది. కళాశాల సమయంలో పలు డ్యాన్స్‌ ఈవెంట్స్‌లో పాల్గొని ప్రీతి బహుమతులు కూడా అందుకుంది.&nbsp; &nbsp;ప్రీతి ముకుందన్‌ కెరీర్‌ ఎలా మెుదలైంది? సినిమాల్లోకి రాకముందు ప్రీతి కొంతకాలం పాటు మోడల్‌గా పనిచేసింది. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను ప్రమోట్‌ చేసింది.&nbsp; ప్రీతి ముకుందన్‌ చేసిన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ ఏవి? మోడలింగ్ తర్వాత ప్రీతి యూట్యూబ్‌ కేంద్రంగా పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌ చేసింది. ' Muttu Mu2' ఆల్బమ్‌తో ఆమె పేరు ఒక్కసారిగా తమిళనాడులో మార్మోగింది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ప్రీతి ముకుందన్‌ తొలి చిత్రం ఏది? ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమా ద్వారానే ప్రీతి తొలిసారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వాస్తవానికి ‘కన్నప్ప’.. తెలుగులో ఆమె ఓకె చెప్పిన మెుదటి చిత్రం. అది ఇంకా షూటింగ్‌ దశలోనే ఉంది.&nbsp; ప్రీతి ముకుందన్‌ ఫ్యూజర్‌ ప్రాజెక్ట్స్‌? ప్రస్తుతం తమిళంలో స్టార్‌ అనే సినిమా చేస్తోంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కెవిన్‌ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఎలాన్‌ దర్శకత్వం వహిస్తుండగా బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.&nbsp; ప్రీతి ముకుందన్‌కు ఇష్టమైన హీరో, హీరోయిన్‌, ఫుడ్‌ ఏవి? తన ఫేవరేట్‌ హీరో, హీరోయిన్లు, ఫుడ్‌ గురించి ప్రీతి ముకుందన్‌ ఏ వేదికపైన పంచుకోలేదు. ఇందుకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం అందుబాటులో ఉంది.&nbsp; ప్రీతి ముకుందన్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ? https://www.instagram.com/preity_mukhundhan
    మార్చి 22 , 2024
    Mansi Taxak: యానిమల్‌లో బాబీ డియోల్ భార్యగా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
    Mansi Taxak: యానిమల్‌లో బాబీ డియోల్ భార్యగా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
    యానిమల్ సినిమాలో బాబీ డియోల్ మూడో భార్యగా నటించిన మాన్సి టాక్సాక్( Mansi Taxak ) ఇప్పుడో సోషల్ మీడియాలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువైనా ప్రేక్షకులపై చాలా ఇంపాక్ట్ కలిగించింది.&nbsp; యానిమల్ సినిమాలో కొత్త పెళ్లి కూతురుగా అబ్రంను (బాబీ డియోల్‌) పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత వెంటనే అబ్రం.. అందరూ చూస్తుండగా ఆమెపై బలత్కారం చేసి తన క్రూరత్వాన్ని చూపిస్తాడు. ప్రస్తుతం ఆమె గ్లామర్‌పై సినిమా చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మాన్సి టాక్సక్ గురించి నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.&nbsp; ఆమె బ్యాక్‌గ్రౌండ్, ఏజ్, బాయ్‌ ఫ్రెండ్ వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. మాన్సి టాక్సక్‌ 1998 జులై 23న ముంబైలో కుల్దీప్ సింగ్ టాక్సాక్, కౌనిక టాక్సాక్ దంపతులకు&nbsp; జన్మించింది. ఆమె విద్యభ్యాసం అంతా గుజరాత్, ముంబైలో జరిగింది. సినిమాల్లోకి రాకముందు మాన్సి టాక్సక్ మోడలింగ్ చేసేది. ఆమె 2019లో&nbsp; 'ఫెమినా మిస్‌ఇండియా' పోటీల్లో పాల్గొని 'మిస్‌ ఇండియా గుజరాత్‌' కిరిటం సాధించింది.&nbsp; ఆ తర్వాత 2022లో ఐ ప్రామిస్‌ అనే షార్ట్ ఫిల్మ్‌ ద్వారా వెండి తెరకు పరిచయమైమంది.&nbsp; ఈ చిత్రం యూట్యూ ఛానెల్‌ క్యూనెట్‌లో రిలీజైంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ బాద్‌షా నటించిన పఠాన్‌ మూవీలో నటించే అవకాశం దక్కింది.&nbsp; ఆ తర్వాత ది కేరళ స్టోరీ,&nbsp; గదర్ 2 సినిమాల్లోనూ కనిపించింది.&nbsp; మాన్సి నటించిన సినిమాలు బ్లాక్‌బాస్టర్ హిట్లు సాధించడం విశేషం. https://twitter.com/TBSTwizzle/status/1733476252290302005 ఇక మాన్సి టాక్సాక్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు 2 లక్షల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడూ గ్లామర్ ఫోటో షూట్ చేస్తూ కనువిందు చేస్తుంటుంది మాన్సి టాక్సాక్ కాలేజీ డేస్‌లో స్టేట్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్. అంతేకాదు జిల్లా స్థాయిలో అనేక బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని గెలిచింది. మాన్సి టాక్సాక్‌కు భరత నాట్యం, బెల్లీ డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. మాన్సికి సామాజిక స్పృహా కూడా ఎక్కువే.&nbsp; దిలే సే ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతుంటుంది. అంతేకాదు ఈ కుర్ర హీరోయిన్‌కు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్పానీష్ భాషలో మంచి ప్రావీణ్యం ఉంది. యానిమల్ సినిమాలో ఈ అమ్మడి గ్లామర్‌కు ఫిదా అయిన బాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చేందుకు క్యూ కట్టారంట. మరోవైపు యానిమల్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియా వైడ్‌గా రూ.438 కోట్ల వసూళ్లను రాబట్టింది. &nbsp;ఇప్పటివరకు బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్రహీరోల సినిమాలు మాత్రమే రూ.500 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో రణ్‌బీర్ కపూర్ సినిమా యానిమల్ యాడ్ అయింది.
    డిసెంబర్ 11 , 2023

    @2021 KTree