• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Summer Heroines 2024: వేసవి హీట్‌ మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న అందాలు భామలు వీరే! 

    సమ్మర్‌ అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండగ లాంటిది. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవుల నేపథ్యంలో చిన్న, పెద్ద సినిమాలు సమ్మర్‌లో విడుదలయ్యేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో వినోదాలు పంచడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా అందులోని కథానాయకులు వేసవి హీట్‌ను తమ అందచందాలతో మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏంటి? అవి ఎప్పుడు విడుదలవుతాయి? వంటి అంశాలు ఈ కథనంలో చూద్దాం. 

    మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)

    సీతా రామం’, ‘హాయ్‌ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మృణాల్‌ ఠాకూర్‌.. ఈ సమ్మర్‌లో సరికొత్త మూవీతో వస్తోంది. యంగ్‌ హీరో విజయ్‌ నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లో మరోమారు సందడి చేయబోతోంది. ఈ మూవీ ఏప్రిల్‌ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. 

    దివ్యాంశ కౌషిక్‌ (Divyansha Kaushik)

    ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ద్వారా అలరించనున్న మరో నటి దివ్యాంశ కౌషిక్‌. ఇందులో ఈ భామ సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తోంది. 2019లో వచ్చిన మజిలీ సినిమా ద్వారా దివ్యాంశ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రామారావు ఆన్‌ డ్యూటీ, పోలీసు వారి హెచ్చరిక, మైఖేల్‌ తదితర చిత్రాల్లో నటించింది. 

    అంజలి (Anjali)

    ప్రముఖ హీరోయిన్‌ అంజలి కూడా ఈ వేసవిని మరింత హీటెక్కించేందుకు రెడీ అవుతోంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించనుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌, షకలక శంకర్ ముఖ్యపాత్రలు పోషించారు. 

    స్వర్ణిమా సింగ్‌ (Swarnima Singh)

    హర్షివ్‌ కార్తీక్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బహుముఖం’ (Bahumukham). ‘గుడ్‌, బ్యాడ్ యాక్టర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమాలో స్వర్ణిమా సింగ్‌ కథానాయికగా చేసింది. తన అందం, అభినయంతో ఆకట్టుకునేందుకు ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

    మీనాక్షి గోస్వామి (Meenakshi Goswami)

    మీనాక్షి గోస్వామి కథానాయికగా చేసిన లేటెస్ట్‌ చిత్రం ‘భరతనాట్యం’. ఈ మూవీ ద్వారానే మీనాక్షి తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా సూర్యతేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమా ఓ యువకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందన్న కాన్సెప్ట్‌తో రూపొందింది.

    ప్రనీకాన్వికా (Praneekaanvikaa)

    ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న మరో చిన్న చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’. కేరింత ఫేమ్‌ పార్వతీశం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రణీకాన్వికా నటించింది. ఇదే ఆమెకు మెుదటి సినిమా. ఈ మూవీ విజయం ద్వారా తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోంది. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. 

    కోమలి ప్రసాద్‌ (Komali Prasad) 

    యంగ్‌ హీరోయిన్‌ కోమలి ప్రసాద్‌ కూడా.. ఈ వేసవిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘శశివదనే’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ‘నేను సీతాదేవి’ (2016) చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన కోమలి.. ‘హిట్‌ 2’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. శశివదనే సినిమా విజయంపై ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 

    వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)

    బేబీ’ సినిమా సెక్సెస్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన హీరోయిన్‌ వైష్ణవి చైతన్య. ఈ భామ నటించిన రెండో చిత్రం ‘లవ్‌ మి ఇఫ్‌ యు డేర్‌’ కూడా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ నెల 25 నుంచి తెలుగు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయనుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv