హీరో నితిన్‌పై అమ్మ రాజశేఖర్ ఘాటు వ్యాఖ్యలు
దర్శకుడు, ప్రముఖ డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ హీరో నితిన్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘HiFive’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నితిన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. అతను రాలేదు. దీంతో కోపంతో అసలు నితిన్‌కు డ్యాన్సే రాదని, అతనికి డ్యాన్స్ నేర్పించింది తానని పేర్కొన్నాడు. నితిన్‌కు తాను గురువులాంటోడని, కానీ తనను తననే మర్చిపోయాడని విమర్శించాడు. ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.