జిన్నా మూవీ నుంచి ఫ్రెండ్ షిప్ వీడియో సాంగ్ రిలీజ్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు జిన్నా మూవీ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఫ్రెండ్ షిప్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇదే స్నేహం అంటూ కొనసాగుతున్న సాంగ్ చూడముచ్చటగా ఉంది. ఈ పాటను మంచువిష్ణు కవల కుమార్తెలు అరియానా, వివియానా పాడి, వారే యాక్ట్ చేయడం విశేషం. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈషాన్ సూర్య డైరెక్షన్ చేస్తున్నారు.