వివాదాస్పదంగా మారిన ‘కమిట్మెంట్’ ట్రైలర్
తాజాగా విడుదలైన ‘కమిట్మెంట్’ ట్రైలర్ వివాదాస్పదంగా మారింది. ఈ ట్రైలర్లో బోల్డ్ కంటెంట్ ఉండడంతో పాటు, బోల్డ్ సీన్స్‌కు భగవద్గీత శ్లోకం వినిపించడంపై విమర్శలు వస్తున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శ్లోకం వినిపించారని, వెంటనే ఆ శ్లోకాన్ని తీసేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు నెటిజన్లు సైతం.. ‘భగవద్గీతను గౌరవించడం రాకపోతే.. కించపరిచే అధికారం ఎవరిచ్చారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.