‘సెక్స్ అడిగే అమ్మాయిలు’ వేశ్యలతో సమానం: ముఖేష్ ఖన్నా
ప్రముఖ బాలీవుడు నటుడు ముఖేష్ ఖన్నా(64) మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయి అబ్బాయిని సెక్స్ గురించి అడిగితే, ఆమె అమ్మాయి కాదు, సెక్స్ వర్కర్ అన్నారు. నాగరిక సమాజానికి చెందిన అమ్మాయిలు అలా మాట్లాడరని వ్యాఖ్యానించారు. తన యూట్యూబ్ ఛానెల్ భీష్మ్ ఇంటర్నేషనల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ముఖేష్ పేర్కొన్నాడు. ఖన్నా చేసిన వ్యాఖ్యలకు అతనిపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ పోలీస్ సైబర్ సెల్‌కు నోటీసు జారీ చేసింది.