‘బ్రాండ్ అయినా మార్చుకో.. తీరు అయినా మార్చుకో’
అక్కినేనిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణపై ANR ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణకు గర్వం తలకెక్కిందని మండిపడుతున్నారు. ఏపీలోని నెల్లూరులో ఏఎన్నార్ ఫ్యాన్స్ బాలయ్య ప్లెక్సీని దగ్ధం చేశారు. ‘‘తాగే బ్రాండ్ అయినా మార్చుకో.. లేదా మాట తీరు అయినా మార్చుకో’’ అంటూ ఫ్యాన్స్ హెచ్చరించారు. ఈ వివాదంపై బాలయ్య ఇంకా స్పందించలేదు.