గాల్లో తేలుతూ రైలు ప్రయాణం
చైనాలో త్వరలో స్కై ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవి భూమికి 33 అడుగుల ఎత్తున ఉండే ట్రాక్‌పై ఆనుకొని తలకిందులుగా వేలాడుతూ నడుస్తాయి. దీనికి రెండు బోగీలు ఉంటాయి. గంటకు 50 ఏళ్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తాయి. అయస్కాంత క్షేత్రం సాయంతో ఈ రైళ్లు నడుస్తాయి. ఇవి పర్యావరణసహితం. ట్రాక్ నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. స్కై ట్రైన్లో ఒకేసారి 88 మంది ప్రయాణించవచ్చు. ఇప్పటికే రెడ్ రైల్ పేరుతో చైనాలో చేసిన ఈ ప్రయోగం విజయవంతం అయింది.