న్యూజిలాండ్‌కు కీలక ప్లేయర్ దూరం
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు జట్లుకు బిగ్‌షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ చేతి వేలి గాయం అయింది. దీంతో అతడు కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. నిన్న జరగిన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఫీల్డర్ విసిరిన త్రో విలియమ్సన్ ఎడమ చేతి వేలికి తాకింది. నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో ఫిజియో చేసి స్కానింగ్‌కు తరలించారు. అయితే స్కాన్ రిపోర్ట్‌లో అతడి ఎడమచేతి బొటనవేలు విరిగినట్లు తేలింది. అతడి ప్రత్యామ్నయంగా టామ్ బ్లండల్‌కు న్యూజిలాండ్ జట్టు మేనెజ్‌మెంట్ పిలుపునిచ్చింది.