ఓటీటీ విడుదలకు సిద్దమైన చంద్రముఖి-2
రాఘవ లారెన్స్ హీరోగా నటించిన హారర్ చిత్రం చంద్రముఖి-2 ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో కంగనా రనౌత్ కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం అక్టోబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ నెట్ఫ్లిక్స్ ఓ పోస్టర్ను విడుదల చేసింది. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చంద్రముఖి-2 స్ట్రీమింగ్ కానుంది.