అందుకే ముద్దు సీన్స్‌కు ఓకే చెప్పా: తమన్నా
తాను పెట్టుకున్న ‘నో కిస్సింగ్ రూల్’ను హీరోయిన్ తమన్నా 18 ఏళ్ల తర్వాత బ్రేక్ చేసింది. దీనిపై మిల్కీ బ్యూటీ తాజాగా స్పందించింది. ‘‘కాలానికి తగ్గట్లు మార్పులు అంగీకరించాలి. కాలానుకనుగుణంగా మారే వ్యక్తుల్లో నేనూ ఒకదాన్ని. దేశంలో అనేక రకాల ప్రేక్షకులు ఉన్నారు. సృజనాత్మకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్ల తర్వాత ఫేమస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కొత్తదనం కోసమే ముద్దుసీన్లలో నటించాను.’’ అంటూ ఈ మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది.