MI బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా మాజీ క్రికెటర్లు
ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్-2024 సీజన్‌కు బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా ఇద్దరు మాజీ క్రికెటర్లను నియమించింది. బ్యాటింగ్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ప్రకటించింది. శ్రీలంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగను తమ బౌలింగ్ కోచ్‌గా ఎంచుకున్నట్లు తెలిపింది. గతంలో వీరిద్దరు ముంబై ఇండియన్స్‌కు ఆడినవారే కావడం విశేషం.