నయనతారపై కేసు పెట్టిన మామగారు
లేడీ సూపర్‌స్టార్ నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌పై ఆమె మామలే కేసు పెట్టారు. విఘ్నేశ్ శివన్ తండ్రి శివకు తొమ్మిది మంది అన్నదమ్ములు. అన్నదమ్ములకు సంబంధించిన ఆస్తిని అప్పట్లో శివ వారికి తెలియకుండా అమ్మేశాడు. దీంతో తమ ఆస్తి తమకు కావాలని.. తిరిగి తమకు అప్పగించాలని ఆ అన్నదమ్ములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విఘ్నేశ్ శివన్, ఆయన తల్లి మీనాకుమారి, సోదరి ఐశ్వర్య, భార్య నయనతారలపై కేసు నమోదైంది. కాగా విఘ్నేష్ తండ్రి శివ ప్రస్తుతం బతికి లేరు.