మోదీ పనితీరుపై సంజయ్ రౌత్ అసంతృప్తి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీరుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు సమస్యను విస్మరించొద్దని హితవు పలికారు. ‘ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో మోదీ మధ్యవర్తిత్వం వహిస్తారు. కానీ మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదాన్ని పట్టించుకోరు. ఇది ఓ ఉత్తమ రాజకీయ నాయకుడి లక్షణం కాదు. ప్రభుత్వాల మధ్య సమస్యగా దీన్ని చూడొద్దు. మానవత్వం కోసం జరుగుతున్న పోరాటంగా చూడాలి. కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సబబు కాదు’ అని సామ్నా పత్రిక సంపాదకీయంలో రౌత్ … Read more