సబ్బునీటి బుడగ గడ్డ కట్టడం చూశారా?
‘ఫ్రోజెన్’ సినిమా చూస్తుంటే అందులో మంచు యానిమేషన్స్ మనల్ని కట్టిపడేస్తాయి. ఎల్సా తన మంత్ర శక్తులతో మంచును పుట్టిస్తుంటే పువ్వుల ఆకారంలో ఉండే ఆ కణాలు మనసుకు ఇంపుగా అనిపిస్తాయి. కానీ మంచు కణాలు నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాయని చాలా మందికి తెలియదు. మనది ఉష్ణమండలం దేశం కాబట్టి చూసే అవకాశం కూడా తక్కువే. కానీ సబ్బునీటి బుడగ గడ్డకడుతుండగా తీసిన ఈ వీడియో మీకు నిజంగా సినిమాకు మించిన అనుభూతిని పంచుతుంది.