• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విదేశాలకు సమంత: అతడు ఎమోషనల్

    స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ విషయాన్ని నిజం చేస్తూ సామ్ హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘గడిచిన రెండేళ్లు ఎండా వాన లెక్కచేయకుండా పని చేశాం. నవ్వులు, బాధలు, కష్టాలు అన్ని చిరునవ్వుతో భరించాం. ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకుని అద్భుత జర్నీ చేశాం. చికిత్స తీసుకుంటున్న సమయంలో నీకు మరింత బలం, శక్తి రావాలి. మళ్లీ మిమ్మల్ని కలిసే రోజు కోసం ఎదురు చూస్తున్నా.’’ అంటూ పోస్ట్ చేశాడు.

    సమంతకు మయోసైటిస్ ఇంకా తగ్గలేదా?

    స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సబంధించిన ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటోంది. ప్రస్తుతం నెలవారీ ఐవీఐజీ సెషన్‌కు హాజరైనట్లు సమంత అభిమానులకు తెలిపింది. ‘న్యూ నార్మల్’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా ఈ ట్రీట్‌మెంట్ బాగా ఉపయోగపడుతుందని సామ్ చెబుతోంది. ఓ వైపు ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే.. మరోవైపు జిమ్ కూాడా చేస్తోంది. జిమ్ చేస్తున్న వీడియో కూడా సామ్ అభిమానులతో పంచుకుంది.