• TFIDB EN
  • జల్సా
    ATelugu2h 47m
    సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    Free
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtube
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    పవన్ కళ్యాణ్
    సంజయ్ సంజు సాహు
    ఇలియానా డి క్రజ్
    భాగ్యమతి 'భాగి'
    పార్వతి మెల్టన్
    జ్యోత్స్న జ్యో
    కమలినీ ముఖర్జీ
    భాగీ సోదరి
    ముఖేష్ రిషి
    దామోదర్ రెడ్డి
    ప్రకాష్ రాజ్
    ఇందు మరియు భాగ్యమతి తండ్రి
    బ్రహ్మానందం
    హెడ్ ​​కానిస్టేబుల్
    అలీ
    అభి
    సునీల్
    శీను
    తనికెళ్ల భరణి
    బుల్లి రెడ్డి
    శివాజీ
    దామోదర్ రెడ్డి పెద్ద కొడుకు
    ఆదిత్య రెడ్డిజ్
    దామోదర్ రెడ్డి చిన్న కొడుకు
    కమల్ కామరాజు
    ఇందు భర్త
    మకరంద్ దేశ్‌పాండే
    నక్సలైట్
    శిశిర్ శర్మ
    జనార్ధన్ సాహు
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    డాక్టర్
    మల్లికార్జునరావు
    మంత్రి
    బియాంకా దేశాయ్
    భాగ్యమతి స్నేహితురాలు
    రవి వర్మ
    నక్సలైట్
    కృష్ణుడు
    రవి ప్రకాష్
    సంజు స్నేహితుడు
    ఉత్తేజ్
    సంజు స్నేహితుడు
    సత్యం రాజేష్
    కాలేజీ విద్యార్థి
    భరత్ రెడ్డి
    మహేష్ బాబు
    శేఖర్ (వాయిస్ ఓవర్)
    సిబ్బంది
    త్రివిక్రమ్ శ్రీనివాస్
    దర్శకుడు
    అల్లు అరవింద్
    నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    KV గుహన్
    సినిమాటోగ్రాఫర్
    రసూల్ ఎల్లోర్
    సినిమాటోగ్రాఫర్
    ఎ. శ్రీకర్ ప్రసాద్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌.. ఎందుకంటే?
    Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌.. ఎందుకంటే?
    సలార్‌ (Salaar) తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). మహానటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఉంది. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజ్‌ న్యూస్‌ బయటకొచ్చింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.  మహేష్‌ బాబు డబ్బింగ్‌? (Mahesh Babu Dubbing) కల్కి చిత్రం (Prabhas New Movie)లో హీరో ప్రభాస్‌ విష్ణు మూర్తి అవతారంలో కనిపించనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అతడి పాత్ర పేరు 'భైరవ' అని చిత్ర యూనిట్‌ ఇప్పటికే రివీల్‌ చేసింది. అయితే ప్రభాస్‌ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్‌ బాబు (Mahesh Babu) వాయిస్‌ను ఉపయోగించుకోవాలని మేకర్స్‌ భావిస్తున్నారట. ప్రభాస్ ఎంట్రీకి, ఎలివేషన్స్‌కు మహేష్‌ వాయిస్‌ ఇస్తే సినిమాపై హైప్‌ మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ విషయమై మహేష్‌ను కూడా సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  గతంలో ఇలాగే.. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఇలా డబ్బింగ్‌ చెప్పడం కొత్తేమి కాదు. గతంలో ఆయనకు డబ్బింగ్‌ చెప్పిన అనుభవం ఉంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) - త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ (Jalsa Movie) సినిమాకు మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. సంజయ్‌ సాహు పాత్రను పరిచయం చేస్తూ తన వాయిస్‌తో చక్కటి ఎలివేషన్స్‌ ఇచ్చాడు. అప్పట్లో ఇది ‘జల్సా’ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మహేష్‌ చేత ఎలాగైన డబ్బింగ్‌ చెప్పించాలని దర్శకుడు నాగ్‌ అశ్విన్ పట్టుదలతో ఉన్నట్లు ఫిల్స్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్‌ ‘SSMB29’ సినిమా షూట్‌ కోసం సిద్దమవుతున్నాడు. మరి ఈ ఆఫర్‌కు మహేష్ ఓకే చెప్తాడో లేదో చూడాలి. కల్కి వెనక లెజెండరీ డైరెక్టర్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Prabhas New Movie Director).. కల్కి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ద్వాపర యుగం నుంచి కలియుగం అంతంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉండనుందని టాక్. మహాభారతం నాటి పాత్రలతో ముడిపడి ఉన్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై ఇతిహాసాల ప్రభావం కూడా గట్టిగానే ఉండనుంది. ఈ నేపథ్యంలో పౌరాణిక చిత్రాలపై పట్టున్న లెజెండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) ఈ సినిమా విషయంలో తన వంతు సాయం అందిస్తున్నట్లు సమాచారం. ‘మాయాబజార్‌’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడం, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ లాంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన అనుభవం కల్కికి ఉపయోగపడుతుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు.  ‘ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు’ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ (Prabhas New Movie) సినిమాపై రానా (Rana Daggubati) ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా కథకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కనెక్ట్‌ అవుతారని ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో వ్యాఖ్యానించాడు. ‘భారతీయ తెరపై తదుపరి పెద్ద మూవీ కల్కి. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు. ఈ ఇండియన్‌ ఎవెంజర్స్ క్షణం కోసం ఎదురు చూస్తున్నా’ అని అన్నాడు. కాగా, ఈ సినిమాకు అశ్వనీదత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్‌ సరసన దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. 
    మే 08 , 2024
    Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్‌ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
    Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్‌ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
    సాధారణంగా హీరో పాత్రలు ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ఉంటాయి. యాక్షన్‌ చిత్రాల్లో ఒకలా.. సోషియోఫాంటసీ జానర్స్‌లో మరోలా ఉంటాయి. చాలా వరకూ సినిమాల్లో హీరో పాత్రను సాధారణ ప్రేక్షకులు ఓన్‌ చేసుకోలేరు. ఎందుకంటే ఆ చిత్రాల్లో వారు కలర్‌ఫుల్‌ డ్రెస్‌లు వెసుకుంటూ కార్లల్లో తిరుగుతుంటారు. హైఫై జీవితాలను గడుపుతుంటారు. అయితే కొన్ని సినిమాలు అలా కాదు. అవి మధ్యతరగతి కుటుంబాలకు చాలా దగ్గరగా ఉంటాయి. మిడిల్‌ క్లాస్‌ జీవితాలను కళ్లకు కడతాయి. ఆ సినిమాల్లో హీరో ఎలాంటి హంగులు లేకుండా కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు. అందుకే సమాజంలోని మెజారిటీ యూత్‌ ఆ హీరో పాత్రలను ఓన్‌ చేసుకుంటారు. తమను తాము తెరపై చూసుకుంటున్నట్లు భావిస్తారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన టాప్‌ మిడిల్ క్లాస్ హీరో పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.  ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ (Aadavari Matalaku Arthale Verule)  సినిమాలో హీరో వెంకటేష్‌ (Venkatesh) సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఉద్యోగం లేక తండ్రి కోటా శ్రీనివాస్‌ చేత చివాట్లు తింటూ ఉంటాడు. చివరికీ ఉద్యోగం రావడంతో తండ్రిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఓ కారణం చేత తండ్రిని కోల్పోయి అనాథగా మారతాడు. ఇలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మిడిల్‌ క్లాస్‌ జీవితాలను గుర్తు చేస్తూనే ఉంటుంది.  రఘువరన్‌ బీటెక్‌ ఈ (Raghuvaran Btech) సినిమాలో రఘువరన్‌ (ధనుష్‌) కుటుంబం కోసం ఏదోటి కోల్పోతూనే ఉంటాడు. ఓ అవసరం కోసం దాచుకున్న డబ్బును తమ్ముడికి ఇచ్చేస్తాడు. తల్లి చనిపోవడంతో ఇష్టం లేని ఉద్యోగానికి ఇంటర్యూలకు తిరుగుతాడు.  తమ్ముడు ఈ (Thammudu) సినిమాలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తొలుత ఆకతాయి తనంగా ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఉంటాడు. బాక్సింగ్‌ పోటీలకు సిద్దమైన అన్నపై అతడి ప్రత్యర్థులు దాడి చేయడంతో పవన్‌లో మార్పు వస్తుంది. అన్న కోసం జల్సా జీవితాన్ని వదులుకొని ఎంతో కష్టపడి బాక్సింగ్‌ నేర్చుకుంటాడు. అన్నను ఆస్పత్రిపాలు చేసిన విలన్‌కు బాక్సింగ్‌ కోర్టులో బుద్ది చెప్తాడు.  అలా వైకుంఠపురంలో ఇందులో (Ala Vaikunthapurramuloo) అల్లు అర్జున్‌ కోటీశ్వరుడు. మురళిశర్మ చేసిన కుట్రతో అతడే తండ్రి అని నమ్మి చిన్నప్పటి నుంచి అతడి ఇంట్లోనే పెరుగుతాడు. అతడి భార్యను తల్లిగా, కూతుర్ని సొంత చెల్లెలని  భావిస్తాడు. పెద్దయ్యాక తనెవరో నిజం తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న అసలైన తల్లిదండ్రులను కాపాడతాడు. కానీ వారికి నిజం చెప్పడు. మిడిల్‌ క్లాస్‌ జీవితాన్నే గడిపేందుకు ఇష్టపడతాడు. గ్యాంగ్‌ లీడర్‌ గ్యాంగ్‌లీడర్‌లో (Gang Leader) చిరంజీవి (Chiranjeevi) తొలుత ఖాళీగా తిరుగుతుంటాడు. పెద్దన్న మరణంతో రెండో అన్న చదువు బాధ్యత తనపై వేసుకుంటాడు. డబ్బు కోసం ఓ కేసులో జైలుకు సైతం వెళ్తాడు. అలా తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు.  అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఈ (Amma Nanna O Tamila Ammayi) సినిమాలో రవితేజ (Ravi Teja)కు తన తండ్రి ప్రకాష్‌ రాజ్ అంటే అసలు పడదు. తన తల్లిని వదిలేశాడని కోపంతో ఉంటాడు. అనుకోకుండా తల్లి చనిపోవడంతో ఆమె ఆఖరి కోరిక మేరకు బాక్సింగ్ కోచ్ అయిన తండ్రి దగ్గరకు వెళ్తాడు. విలన్‌ తన తండ్రిని, సవతి చెల్లిని మోసం చేశాడని తెలుసుకొని బాక్సింగ్ కోర్టులో తలపడి అతడికి బుద్ధి చెప్తాడు.  అ ఆ ఇందులో (A Aa) నితిన్‌ (Nithin) పక్కా మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిలా ఉంటాడు. రావురమేష్‌కి తన ఫ్యామిలీ అప్పు ఉండటంతో ఇష్టం లేకపోయినా అతడి కూతుర్ని చేసుకునేందుకు సిద్ధపడతాడు. కోటీశ్వరురాలైన అత్త కూతురు సమంత ప్రేమిస్తోందని తెలిసినప్పటికీ క్లైమాక్స్‌ వరకూ కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటాడు.  జెర్సీ (Jersey) క్రికెటర్‌ అయినా నాని (Nani) అనారోగ్య కారణంతో ఆటకు దూరమవుతాడు. రైల్వే ఉద్యోగం కోల్పోయి భార్య సంపాదనపై ఆధారపడి జీవిస్తుంటాడు. క్రికెటర్‌గా చూడాలని కొడుకు చెప్పడంతో తిరిగి బ్యాట్‌ పట్టుకుంటాడు. ఒక మధ్యతరగతి తండ్రి కొడుకును ఎంతగా ప్రేమిస్తాడో ఈ సినిమాలో నాని చూపించాడు.  నేనింతే  ఈ (Neninthe) సినిమాలో రవితేజ (Ravi Teja).. సినిమా డైరెక్టర్‌ కావాలని కలలు కంటూ ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించలేని స్థితిలో ఉంటాడు. ఓ వైపు లక్ష్యం.. మరోవైపు తల్లి ఆరోగ్యం మధ్య అతడు పడే సంఘర్షణ చాలా మంది జీవితాలను ప్రతిబింబిస్తుంది.  యోగి ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన యోగి (Yogi) చిత్రం మిడిల్‌ క్లాస్‌ యువతకు చాలా బాగా కనెక్ట్‌ అవుతుంది. డబ్బుకోసం తల్లిని విడిచి నగరానికి వచ్చిన హీరో ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడు. రూపాయి రూపాయి కూడగట్టి తల్లికి గాజులు చేయిస్తాడు. అయితే ఆ గాజులు వేసుకోకుండానే తల్లి చనిపోవడం చాలా మందికి తమ గతాన్ని గుర్తు చేస్తుంది. 
    మార్చి 01 , 2024
    PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..! 
    PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..! 
    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ ఏ హీరోకు లేదనడంలో అతిశయోక్తి లేదు. పవన్‌ క్రేజ్‌ సినిమాలకు అతీతమైనది కావడమే ఇందుకు కారణం. ఎందుకంటే పవన్‌ను హీరోగా కంటే మంచి మనసున్న వ్యక్తిగా ఆరాధించేవారే ఎక్కువ. ఇక పవన్‌ తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు తీశాడు. ఆయన తీసిన తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేది చిత్రాలు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. ఈ చిత్రాలను ఇప్పటికీ పవన్‌ ఫ్యాన్స్ రిపీట్‌ మోడ్‌లో చూస్తుంటారు. ఈ నేపథ్యంలో IMDB (Internet Movie Database)లో టాప్‌ రేటెడ్‌ పవన్‌ మూవీస్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.  1. తొలి ప్రేమ IMDBలోని పవన్‌ కల్యాణ్‌ సినిమాల జాబితాలో ‘తొలి ప్రేమ’ (Tholi Prema) టాప్ రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రానికి IMDB 8.4 రేటింగ్ ఇచ్చింది. తొలి ప్రేమ చిత్రం పవన్‌ కెరీర్‌లో నాల్గో సినిమా. 1998లో విడుదలైన ఈ మూవీకి కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. పవన్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. కీర్తి రెడ్డి ఇందులో హీరోయిన్‌గా చేసింది. తొలి ప్రేమలోని పాటలు అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘నీ మనసే’ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ అని సాంగ్‌. 2. ఖుషి  పవన్‌ సినిమాల్లో ‘ఖుషి’ (Kushi) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రానికి IMDB 8.1 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రంలో పవన్‌ మేనరిజమ్స్‌, సొంతంగా కొరియోగ్రాఫ్‌ చేసిన ఫైట్స్‌ మూవీకే హైలెట్‌ అని చెప్పొచ్చు. 2001లో వచ్చిన ఈ సినిమాకు S.J. సూర్య దర్శకత్వం వహించాడు. భూమిక చావ్లా హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే ఈ చిత్రం రీ-రిలీజ్‌ కావడం విశేషం. తాజాాగా ఇదే సినిమా పేరుతో విజయ్‌ దేవరకొండ ఓ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది.  3. తమ్ముడు  1999లో వచ్చిన ‘తమ్ముడు’ (Thammudu) చిత్రం బిగ్గెస్ట్‌ హిట్ అందుకుంది. ఈ చిత్రం IMDBలో 7.9 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అన్న కలను నెరవేర్చే తమ్ముడిగా పవన్‌ కల్యాణ్‌ నటించాడు. ఇందులో పవన్‌ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాలేజీ స్టూడెంట్‌గా పవన్‌ పండించిన హాస్యం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రానికి P.A అరుణ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించాడు. ప్రీతి ఝూంగియాని, అదితి గోవరికర్ హీరోయిన్లుగా నటించారు.  4. జల్సా త్రివిక్రమ్‌ - పవన్‌ కల్యాణ్‌ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి బంధానికి బీజం వేసిన చిత్రం మాత్రం ‘జల్సా’ (Jalsa). త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో 2008లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ అప్పట్లో యూత్‌ను ఉర్రూతలూగించింది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ చిత్రానికి IMDB 7.4 రేటింగ్ ఇచ్చింది.  5. బద్రి పూరి జగన్నాథ్‌, పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మెుదటి సినిమా ‘బద్రి’ (Badri). ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ చెప్పే డైలాగ్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్‌' అనే డైలాగ్‌ ప్రేక్షకులను పవన్‌కు మరింత దగ్గర చేసింది. ఈ చిత్రానికి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది.  6. అత్తారింటికి దారేది మాటల మంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో పవన్‌ నటించిన రెండో చిత్రం ‘అత్తారింటికి దారేది’ (Attarintiki daredi). ఈ మూవీకి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది. 2013లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. విడుదలకు ముందే ఈ సినిమా ఒరిజినల్‌ ప్రింట్‌ లీకైనప్పటికీ కలెక్షన్స్‌పై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. దీన్ని బట్టి ఫ్యాన్స్‌లో పవన్‌ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించారు.  7. గోపాల గోపాల పవన్ కల్యాణ్‌, వెంకటేష్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గోపాల గోపాల’ (Gopala Gopala). బాలీవుడ్ చిత్రం 'ఓఎంజీ' (OMG)కి తెలుగు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 2015లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్‌ ప్రధాన పాత్ర పోషించగా.. పవన్‌ దేవుడిగా కనిపించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు IMDB సైతం ఈ మూవీకి 7.2 రేటింగ్ ఇచ్చింది. తాజాగా విడుదలైన ‘బ్రో’ చిత్రంలోనూ పవన్‌ దేవుడిలా కనిపించడం విశేషం. 8. గబ్బర్‌ సింగ్‌ హిందీలో సల్మాన్‌ ఖాన్‌ చేసిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్‌గా ‘గబ్బర్‌ సింగ్’ (Gabbar singh) చిత్రం రూపొందింది. కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పవన్‌ తనదైన స్టైల్‌లో పోలీసు పాత్రను పోషించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో  అభిమానుల చేత ఈలలు వేయించాడు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. కాగా, IMDB ఈ మూవీకి 7.1 రేటింగ్ ఇచ్చింది.  9. వకీల్‌సాబ్‌  వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం వకీల్‌ సాబ్‌ (Vakeel saab). హిందీ పింక్‌ చిత్రానికి ఇది రీమేక్‌. 2021లో కోర్టు రూమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్‌ లాయర్‌గా కనిపించాడు. ఇందులోనూ శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం IMDBలో 7.0 రేటింగ్‌ సంపాదించింది. 10. పంజా ‘పంజా’ (Panja) చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ రూపొందించారు. ఇందులో పవన్ స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. 2011లో విడుదలైన ఈ చిత్రంలో సారా జేన్‌, అంజలి  లవానియా హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి IMDB 6.5 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద పంజా పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం. 
    జూలై 31 , 2023
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    “విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్‌ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్‌ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం. నువ్వు నాకు నచ్చావ్‌! ప్రకాశ్‌ రాజ్‌ ఇంటికి వెంకటేశ్‌ వచ్చినపుడు సునీల్‌ తనని ఔట్‌ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్‌ సెటైర్‌ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్‌ పేరు లంకా” అనేస్తాడు. https://www.youtube.com/watch?v=UVFCtTNU29s అత్తారింటికి దారేది అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్‌. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్‌ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్‌ “ ఒరేయ్‌ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్‌ ఎలా కట్టాలి అని ప్లాన్‌ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్‌ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు. https://www.youtube.com/watch?v=9-PckWpekQY జల్సా జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్‌ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.  https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI అ ఆ ‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్‌ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్‌ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు. https://www.youtube.com/watch?v=qrrldRJc5e8 మన్మథుడు మన్మథుడులో సునీల్‌ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్‌ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్‌ ఇస్తాడు.  https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow అల వైకుంఠపురములో అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్‌ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు. అజ్ఞాతవాసి “సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి) S/O సత్యమూర్తి “రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌) భీమ్లా నాయక్‌ “ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్‌) అతడు “హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్‌ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
    ఏప్రిల్ 14 , 2023
    రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు ఇవే!
    రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు ఇవే!
    టాలివుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అప్పట్లో ఆడని సినిమాలు కూడా ఇప్పుడు బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. ఇదే అదనుగా హీరో క్రేజ్‌ను వాడుకుని నిర్మాతలు సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్‌ చేసి కాసులు గడిస్తున్నారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి, బాలయ్య, మహేశ్‌ బాబు ఇలా అందరి సినిమాలు రిలీజై రికార్డులు సృష్టించాయి. అప్పట్లో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన రామ్‌ చరణ్ ‘ఆరెంజ్‌’ కూడా ఇటీవల  విడుదల చేశారు. అది ఇప్పటికే రూ.3 కోట్లు వసూలు చేసి ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఇదే పంథా రానున్న రోజుల్లోనూ కొనసాగబోతోంది. అనేక మంది స్టార్‌ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.  దేశముదురు అల్లు అర్జున్‌ను మాస్‌ హీరోగా చేసిన సినిమా దేశముదురు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా హీరో ఇంట్రో సీన్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్‌. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా  ఏప్రిల్‌ 6, 8 తేదీల్లో దేశముదురు 4K థియేటర్లలో నడవబోతోంది. పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ఐకాన్‌ స్టార్‌ మేనియాను క్యాష్‌ చేసుకోబోతున్నారు. హన్సిక హీరోయిన్‌గా పరిచయమైంది కూడా ఈ సినిమాతోనే. వైశాలి పాత్రకు వచ్చిన క్రేజ్‌తోనే ఆ తర్వాత హన్సిక స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.   ఆది RRR స్టార్‌గా విశ్వవ్యాప్తం అయిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘తొడ గొట్టు చిన్నా’ డైలాగ్‌ తెలుగు వారందరికీ తెలిసిందే. అప్పుడప్పుడే మీసాలు వస్తున్న వయసులో జూ.ఎన్టీఆర్ చేసిన బలమైన పాత్ర ‘ఆది’. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో వివి వినాయక్‌ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా మే 20న మరోసారి థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సింహాద్రి రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సింహాద్రి. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఇందులో ఉపయోగించిన కత్తి, కీరవాణి పాటలు అన్నీ అప్పట్లో జనాన్ని ఆకట్టుకున్నవే. మే 20న ‘ఆది’తో పాటే సింహాద్రి కూడా థియేటర్లో సందడి చేయబోతోంది. ఇందులో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు.  మోసగాళ్లకు మోసగాడు భారత సినీ చరిత్రలోనే తొలి కౌబాయ్‌ ఫిల్మ్‌ ‘మోసగాళ్లకు మోసగాడు’ 4K వెర్షన్‌ కూడా థియేటర్లో విడుదల కాబోతోంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమా  మే 31న మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. KSR దాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, ఆరుద్ర స్క్రీన్‌ప్లే అందించారు. కృష్ణ సరసన విజయ నిర్మల నటించారు. ఇంగ్లీష్‌ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత తమిళ హిందీ భాషల్లోనూ రీమేక్ అయింది. ప్రస్తుతం 4K కు సినిమాను రీస్టోర్‌ చేసి మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన “ఈ నగరానికి ఏమైంది?”(ENE)కి యూత్‌లో మామూలుగా క్రేజ్‌ ఉండదు. ఫ్రెష్‌ కాన్సెప్ట్‌, మ్యూజిక్‌, కథనం, కామెడీతో 2018లో కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కి విడుదలైన ఈ సినిమా..ఏకంగా రూ.17 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సీక్వెల్‌ కోసం సోషల్‌ మీడియాలో నిత్యం తరుణ్‌ భాస్కర్‌ను అడుగుతూనే ఉంటారు. త్వరలోనే తీస్తానని తరుణ్‌ భాస్కర్‌ కూడా చాలాసార్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ENE రీ రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తరుణ్‌ భాస్కర్‌ వెల్లడించాడు. ఎప్పుడు రిలీజ్‌ చేస్తానన్న విషయం చెప్పలేదు గానీ త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌ ఇస్తానని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం తరుణ్‌ భాస్కర్‌ ‘కీడా కోలా’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే  రీ రిలీజ్‌ అయిన ఖుషి ఏకంగా రూ.7.73 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. రజినీకాంత్‌ కెరీర్‌లో ఫ్లాప్‌గా నిలిచిన ‘బాబా’ రూ.4.4 కోట్లు రాబట్టింది. ఈ సినిమా పరాజయం వల్ల తన హీరోయిన్‌ కెరీర్‌ ముగిసిపోయిందని  మనీషా కొయిరాలా ఇటీవల బాధను వ్యక్తం చేశారు. కానీ రీ రిలీజ్‌లో మాత్రం ‘బాబా’ ఘన విజయం సాధించింది. పవన్‌ కల్యాణ్ ‘జల్సా’ కూడా రీ రిలీజ్‌తో రూ.3.25 కోట్లు వసూలు చేసింది. మహేశ్ బాబు ఒక్కడు రూ.2.25 కోట్లు రాబట్టింది. పోకిరి కూడా బాగానే వసూలు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని రీ రిలీజ్‌లు చూసే అవకాశముంది. కొన్ని సినిమాలు అప్పట్లో థియేటర్‌లో  ఫ్లాప్‌ అయినా టీవీలో సూపర్‌ హిట్‌గా నిలిచాయి. అలాంటి సినిమాలు థియేటర్లో రావాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. అలాగే కొన్ని హిట్‌ సినిమాలు కూడా రీ రిలీజ్‌ అయితే బాగుంటుందని నెట్టింట డిమాండ్‌ చేస్తున్నారు. మీరు ఏ సినిమా మళ్లీ బిగ్‌ స్క్రీన్‌ మీద చూడాలనుకుంటున్నారు? కామెంట్‌ చేయండి.
    ఏప్రిల్ 01 , 2023
    Malavika Mohanan: తడి అందాలతో సోకుల విందు చేస్తున్న మలయాళి తెగింపు !
    Malavika Mohanan: తడి అందాలతో సోకుల విందు చేస్తున్న మలయాళి తెగింపు !
    తమిళ్ స్టార్ నటి మాళవిక మోహన్ మరోసారి సోకుల విందు చేసింది. నదిలో జలకాలాడుతూ తడిసిన అందాలతో ఫోటో షూట్ చేసింది. ట్సాన్సపరెంట్ వైట్ శారీలో పాల మీగడ లాంటి అందాలను కుర్రకారుకు విందు చేసింది. తడి అచ్ఛాదనతో అమ్మడి అందం ద్విగుణీకృతమైంది. ఓవైపు తడిసిన ఎద అందాలు, వయ్యారపు నడుమందాలు మరోవైపు.. నాభి అందాల మేళవింపుతో కైఫెక్కిస్తోంది. ఈ కుర్రదాని మత్తిక్కించే చూపులు తడిసిన దేహంతో ఉన్న అందాన్ని ఇంకాస్తా దొంతర్లు ఎక్కిస్తోంది దక్షిణాది చిన్నదే అయినా గ్లామర్‌ను వడ్డించడంలో నార్త్ ముద్దు గుమ్మలకు ఏమాత్రం తీసిపోదు. చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా... అందాలను తనదైన శైలీలో వడ్డించడంలో ఈ మలయాళి తెగింపు దిట్ట కనీసం వారానికో హాట్ ఫొటో షూట్‌ అయినా చేస్తూ కుర్రాళ్ల అందాల దాహం తీరుస్తుంటుంది సూపర్ స్టార్ రజినీకాంత్ 'పేట' మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ సోగసుల కోవకు పెద్దగా సక్సెస్ మాత్రం దక్కలేదు. ఆ మధ్య లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన మాస్టర్ చిత్రంలో నటించి మెప్పించింది. అయితే అవకాశాలు మాత్రం ఈ తడి అందానికి అంతగా రావడం లేదు. అయితేనేం.. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మాత్రం సంపాదించింది. స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫొటో షూట్ చేస్తూ... ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.  మాళవిక మోహన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహన్ కుమార్తే. ఆమె కుటుంబం కేరళకు చెందినది అయినా పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే. అలా సినీ నేపథ్యం ఉన్నా మలయాళి కుట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మలయాళంలో ఆమె నటించిన గ్రేట్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం తమిళ్‌లో తంగాళన్, హిందీలో యుద్ర మూవీల్లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్స్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
    అక్టోబర్ 26 , 2023
    Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్‌ బాబు.. హిట్ కొట్టాడా?
    Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్‌ బాబు.. హిట్ కొట్టాడా?
    నటీనటులు : సుధీర్‌ బాబు, మాళవిక శర్మ, జయప్రకాష్‌, సునీల్‌, అర్జున్‌ గౌడ, రవి కాలే తదితరులు దర్శకత్వం : జ్ఞానసాగర్‌ ద్వారక సంగీతం : చైతన్ భరద్వాజ్‌ ఎడిటర్‌ : రవితేజ గిరిజాల నిర్మాత : సుమంత్‌ జి. నాయుడు విడుదల తేదీ: 14- 05-2024 సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌, రవి కాలే, కేశవ్‌ దీపక్, రాజశేఖర్‌ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాలపై అంచనాలను పెంచింది. గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న సుధీర్‌బాబు.. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జూన్‌ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. సుధీర్‌బాబుకు హిట్‌ అందించిందా? అతడి అంచనాలను నిలబెట్టిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి 1980ల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి, అతని సోదరుడు బసవ, కుమారుడు శరత్‌రెడ్డి తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. తాము చెప్పిందే వేదం అన్నట్లు అన్యాయాలు, అరాచకాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉద్యోగరిత్యా సుబ్రహ్మణ్యం (సుధీర్‌బాబు) ఆ ఊరికి వస్తాడు. ఓ కాలేజీలో మెకానికల్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ శరత్‌రెడ్డితో గొడవపడి సస్పెండ్‌ అవుతాడు. ఆర్థిక సమస్యల వల్ల తన మెకానికిల్‌ తెలివితేటలతో గన్స్‌ తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు. తొలుత గొడవపడిన శరత్‌రెడ్డితో చేతులు కలిపి అక్రమంగా తుపాకులు చేయడం మెుదలు పెడతాడు. ఈ క్రమంలో ఒక రోజు తమ్మిరెడ్డికి ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత ఏమైంది? కుప్పం ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఆ ప్రాంత ప్రజలు హీరోను ఎందుకు దేవుడిగా భావించారు? తమ్మిరెడ్డిని అతడెలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే సుబ్రహ్మణ్యం పాత్రలో.. సుధీర్‌బాబు కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో కష్టమైన కుప్పం యాసలో మాట్లాడుతూ తన మార్క్‌ నటనతో మెప్పించాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ ఇలా అన్ని రంగాల్లో ప్రతిభ చూపించాడు. ఇక అతడికి జోడీగా చేసిన మాళవిక శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సుధీర్‌బాబుతో ఆమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. విలన్‌ పాత్రల్లో జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ మంచి ప్రభావం చూపించారు. కానిస్టేబుల్‌ పాత్రతో సునీల్‌ ఆకుట్టుకున్నాడు. అక్షర గౌడ పాత్ర చిన్నదే అయిన పోలీస్ ఆఫీసర్‌గా ఆమె మెప్పించింది. మిగిలిన పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక.. రొటిన్‌ స్టోరీనే సినిమాకు తీసుకున్నప్పటికీ కథనాన్ని అద్భుతంగా నడిపి మంచి మార్కులు కొట్టేశాడు. తను చెప్పాలనుకున్న పాయింట్‌ను నేరుగా చెబుతూనే స్టన్నింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కథకు జోడించారు. తొలి అర్ధభాగాన్ని చాలావరకూ పాత్రల పరిచయానికే కేటాయించిన డైరెక్టర్‌.. ఇంటర్వెల్‌ ముందుకు వచ్చే భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. సెకండాఫ్‌ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అయితే సెకండాఫ్‌ ఊహించే విధంగా ఉండటం కాస్త మైనస్‌గా మారింది. ఓవరాల్‌గా.. మంచి యాక్షన్ సినిమాను కోరుకునేవారికి ‘హరోం హర’ మంచి ట్రీట్‌ ఇస్తుందని చెప్పవచ్చు.  సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. 1980ల నాటి కుప్పాన్ని వారు మళ్లీ రీ క్రియేట్ చేసిన తీరు ప్రశంసనీయం. అటు సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా మూవీకి బాగా ప్లస్‌ అయ్యాయి. ఎడిటింగ్‌ వర్క్‌ కూడా బాగుంది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ సుధీర్‌బాబు నటనయాక్షన్‌ సీక్వెన్స్‌ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కొత్తదనం లేకపోవడంకానరాని మలుపులు Telugu.yousay.tv Rating : 3/5  
    జూన్ 14 , 2024
    Samantha in Bikini: బికినీలో తడిసిన అందాలతో రెచ్చగొడుతున్న సమంత.. దానికోసమేనా?
    Samantha in Bikini: బికినీలో తడిసిన అందాలతో రెచ్చగొడుతున్న సమంత.. దానికోసమేనా?
    టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత తన గ్లామర్‌ ఫొటోతో మరోమారు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బికినీ సూట్‌ డ్రెస్‌లో ఉన్న ఈ భామ బోల్డ్ ఫొటో షూట్ నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఆఫ్రికన్ అడవుల్లోని సెలయేరులో సమంత జలకాళాడుతున్న ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి. పోక రంగు బికినీలో అందాలు ప్రదర్శన చేస్తూ చెమటలు పట్టిస్తోంది.  ఈ ఫోటోలు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. లుకింగ్ హాట్, అంటూ తమ కామెంట్లకు పనిచెబుతున్నారు. ఈ మధ్య వరుస పరాజయాలతో డీలా పడిన సమంత.. ఖుషి సినిమా విజయంతో కాస్త ఊరట పొందింది. అయితే టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం ఆశించినంతగా లభించడం లేదు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) కుర్ర హీరోయిన్లు శ్రీలీల, నుపుర్ సనన్, ఆషికా రంగనాథ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది.  దీంతో మరోసారి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారేందుకు ఇలా హాట్ ఫొటో షూట్‌ ద్వారా ఫొటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తనలో ఏమాత్రం వేడి తగ్గలేదని నిరూపిస్తోంది. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత... కొద్దికాలంలోనే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది.  మహేష్ బాబు, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  తెలుగుతో పాటు  కోలివుడ్‌లోనూ అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ చైతు- సామ్ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు.  ఇరువురి మధ్య అభిప్రాయ భేదంతో విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంది.  తాను ఏ పని చేసినా హైలెట్ అవుతూ వస్తుంది. ఎంత మంది ట్రోల్ చేసిన.. ధైర్యం కోల్పోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఆమెను అభిమానించే ఫ్యాన్ ఎల్లప్పుడూ సామ్‌కు అండగా ఉంటూ మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. మయోసైటిస్ వ్యాధి భారిన పడిన సామ్ కోలుకుని వరుసగా  సినిమాలు చేస్తోంది.  ప్రుస్తుతం బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్ సిటాడెల్‌ సిరీస్‌లో సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సీరిస్ రిలీజ్ కావాల్సి ఉంది.  మరోవైపు సమంత కొన్ని రోజుల క్రితమే నిర్మాతగానూ మారింది.  'ట్రా లా లా మూవీంగ్‌ పిక్చర్స్‌' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.  కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు సామ్‌ తెలిపింది. ప్రస్తుతం సామ్ సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. కుర్ర హీరోయిన్ల కంటే పదునైన అందాల దాడి తాను చేయగలనని హింట్ ఇస్తోంది.
    ఫిబ్రవరి 24 , 2024
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    తెలుగులో ఎంతో మంది నటులు శ్రీకృష్ణుడి వేషధారణలో నటించి తమదైన ముద్ర వేశారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారల్లో శ్రీకృష్ణావతారం ఎంతో ఉత్కృష్ణమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయన నోటి నుంచి వచ్చిన జ్ఞాన బోధే పంచవేదం భగవద్గీతగా విరాజిల్లుతోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా ప్రసిద్ధిచెందాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెండితెరపై శ్రీకృష్ణుడి పాత్రలో మెరిసిన నేటి తరం యువ కథనాయకులు, పాత తరం హీరోలపై YouSay Telugu ప్రత్యేక కథనం. జూ.ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో కొద్దిసేపూ జూ. ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఈ సినిమాలో ‘చిన్నదో వైపు, పెద్దదో వైపు’  పాటలో తారక్ మోడ్రన్ కృష్ణుడి గెటప్‌లో వావ్ అనిపించాడు. అయితే రాముడిగా, యంగ్ యముడి పాత్రలో ప్రేక్షకులను అలరించిన  జూ.ఎన్టీఆర్‌ను.. కృష్ణుడిగా ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలైతే ఉన్నాయి. https://www.youtube.com/watch?v=hzAaEN6yc1g మహేష్ బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా అలరించాడు. ఆయన కేరీర్ ఆరంభంలో వచ్చిన ‘యువరాజు’ సినిమాలోని 'గుంతలకిడి గుంతలకిడి గుమ్మ' పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. కృష్ణుడి వేషంలో మహేష్ బాగా సెట్ అయ్యాడని అప్పట్లో అభిమానులు తెగ సంతోషపడిపోయారు. https://youtu.be/b02ieSLiyRI?feature=shared పవన్ కళ్యాణ్ ఈ తరం హీరోల్లో కృష్ణుడి పాత్రలో అలరించిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా మెరిసాడు. సామన్య మానవుడి రూపు దాల్చిన  శ్రీకృష్ణ పరమాత్మ వేషంలో పవర్ స్టార్ కనిపించి కనువిందు చేశాడు. https://www.youtube.com/watch?v=HNeBe1JvBmU నాగార్జున మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కృష్ణార్జున' మూవీలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. నాగార్జున సైతం మోడ్రన్ కృష్ణుడిగా... సామాన్యుడిలా కనిపించి అలరించాడు. సునీల్ విలక్షణ నటుడు సునీల్ తొలిసారి తేజా డైరెక్షన్‌లో వచ్చిన నువ్వు- నేను సినిమాలో కాసేపు చిలిపి కృష్ణుడిగా కనిపించి నవ్వులు పూయించాడు. ‘గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా’ సాంగ్‌లో సునీల్ కృష్ణుడిగా మెరిసాడు. అలాగే అందాలరాముడులో కొంటె శ్రీకృష్ణుడిగా కాసేపు కనువిందు చేశాడు.. https://youtu.be/VhyejE23l4M?feature=shared రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ డ్యుయల్ రోల్‌లో మెప్పించిన ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో... నటకిరిటి శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. బాలకృష్ణ పౌరాణిక వేషాల్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆహార్యం సంపాదించిన నటులు బాలకృష్ణ. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. https://youtu.be/wcJhLH_T6N0?feature=shared శోభన్ బాబు: వెండితెరపై శ్రీకృష్ణుడి వేషం వేసి మెప్పించిన నటుల్లో శోభన్ బాబు ఒకరు.  బాపు డైరెక్షన్‌లో వచ్చిన 'బుద్దిమంతుడు' చిత్రంలో కాసేపూ ఆయన కృష్ణుడి వేషంలో దర్శనమిచ్చారు. 'కురుక్షేత్రం' సినిమాలో పూర్తి నిడివిలో కృష్ణ భగవానుడిగా అలరించారు. https://youtu.be/Nf2ts_Cld-s?feature=shared కాంతరావు ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి పాత్రలో మెప్పించిన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన తొలిసారి మలయాళ చిత్రం భక్త కుచేల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు. ఆ తర్వాత పాండవ వనమాసం, నర్తనశాల, ప్రమీలార్జనీయం చిత్రాల్లో కృష్ణుడి వేషంలో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల మదిలో కృష్ణుడు, రాముడు అంటే గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. వెండితెరపై ఎంతమంది కృష్ణుడి వేషంలో కనిపించినా ఆయనకు సాటి రాలేదనేది చాలా మందివాదన. ఆయన రూపం, సంభాషణ చాతుర్యం ఇలాంటివన్నీ ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణుడిగా నిలబెట్టాయి. ఆయన సినిమాలు, ఇతర నాటకాల్లో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణుడిగా కనిపించారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం, దానవీరశూరకర్ణ వంటి చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా అలరించారు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ 18 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. https://www.youtube.com/watch?app=desktop&v=JlsXEmQIWNs
    సెప్టెంబర్ 06 , 2023
    New OTT Releases Telugu: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    New OTT Releases Telugu: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ప్రతీ శుక్రవారం టాలీవుడ్‌లో కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే గత కొన్ని వారాలుగా పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ వారం కూడా అదే రిపీట్‌ కానుంది. ఈ వీకెండ్‌ కూడా ప్రేక్షకులను అలరించేందుకు చిన్న చిత్రాలు, తమిళ డబ్బింగ్‌ మూవీస్‌ రాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త చిత్రాలు, సిరీస్‌లు మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు హరోం హర సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌, రవి కాలే, కేశవ్‌ దీపక్, రాజశేఖర్‌ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. 1989 నేపథ్యంలో జరిగే కథ ఇదని, అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రెజెంట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. రాయణ్‌  తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (New OTT Releases Telugu) నటించిన లేటెస్ట్‌ చిత్ర 'రాయణ్‌' (Raayan). ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దుషారా విజయన్‌ హీరోయిన్‌గా చేసింది. సందీప్‌ కిషన్‌, ఎస్‌.జే. సూర్య, అపర్ణ బాలమురళి, నిత్యా మీనన్‌, కాళిదాస్‌ జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.  ఇంద్రాణి  యానీయా, అంకిత, అజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంద్రాణి' (Indrani). ఈ చిత్రం స్టీఫెన్‌ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందింది. జూన్‌ 14న ఈ చిత్రం ధియేటర్లలో రిలీజ్‌ కాబోతోంది. టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. వందేళ్ల తర్వాత టెక్నాలజీ పరంగా వచ్చే మార్పులేంటి? అన్నది ఇందులో చూడవచ్చని చెప్పింది.  మ్యూజిక్‌ షాప్‌ మూర్తి టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్, క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. జూన్ 14న (New OTT Releases Telugu) గ్రాండ్‌ ఈ సినిమా విడుదల కానుంది. 'ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు' అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది. మహారాజా (తెలుగు డబ్‌) తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి నటించిన 'మహా రాజా' (Maha Raja).. ఈ వారమే విడుదల కానుంది. నిథిలాన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్‌ దాస్‌, అనురాగ్‌ కశ్యప్‌, మునీశ్‌ కాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం సమకూర్చారు. జూన్‌ 14న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్‌ కానుంది.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జూన్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ (OTT Releases This Week Telugu) పోస్టర్‌ విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 31 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.  పారిజాత పర్వం చైతన్య రావు, శ్రద్ధా దాస్ నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam) ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజై.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని రెండు నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. జూన్ 12 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు 'ఆహా' (OTT Releases This Week Telugu) అధికారికంగా ప్రకటించింది. కంభంపాటి సంతోష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్‌, హర్ష కీలక పాత్రలు చేశారు.  TitleCategoryLanguagePlatformRelease DateTour Day France Unchained S2SeriesEnglishNetflixJune 11My Next Guest S2SeriesEnglishNetflixJune 12Mysteries Of The Terracotta WarriorsMovieEnglishNetflixJune 12Doctor ClimaxSeriesEnglishNetflixJune 13Gangs Of GodavariMovieTeluguNetflixJune 14Maha RajMovieHindiNetflixJune 14Protecting ParadiseMovieEnglishDisney + HotstarJune 10The Colour Of VictorySeriesEnglishDisney + HotstarJune 10Not Dead At S2SeriesEnglishDisney + HotstarJune 12Gaanth Chapter 1SeriesHindiJio CinemaJune 11GroundMovieTeluguAmazonJune 10The Boys Season 4SeriesTeluguAmazonJune 13Paarijatha ParvamMovieTeluguAhaJune 12Kurangu PedalSeriesTamilAhaJune 14Love Ki Arrange MarriageMovieHindiZee 5June 14ParuvuSeriesTeluguZee 5June 14
    జూన్ 10 , 2024
    Ramoji Rao: రామోజీ పార్థివదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన రాజమౌళి.. వారి బంధం ఎంత బలమైందంటే?
    Ramoji Rao: రామోజీ పార్థివదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన రాజమౌళి.. వారి బంధం ఎంత బలమైందంటే?
    ఈనాడు మీడియా అధినేత, ప్రముఖ సినీ నిర్మాత రామోజీరావు (Ramoji Rao) మరణం టాలీవుడ్‌ ఇండస్ట్రీని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. ఆయన లేని లోటును తలుచుకుంటూ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీని కడసారి చూసేందుకు ఆయన పార్థివ దేహమున్న ఫిలిం సిటీకి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం కుటుంబ సమేతంగా ఫిలిం సిటీకి వెళ్లారు. అక్కడ అశ్రు నయనాలతో రామోజీకి అంజలి ఘటించారు.  వెక్కి వెక్కి ఏడ్చిన రాజమౌళి! రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించడానికి దర్శకధీరుడు రాజమౌళితో పాటు ఆయన భార్య రమా రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani) కూడా వెళ్లారు. ఈ సందర్భంలో రామోజీని చూస్తూ రాజమౌళి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. రాజమౌళిని ఇంత బాధలో ఎప్పుడు చూడలేదని ఫ్యాన్స్ అంటున్నారు. రామోజీతో రాజమౌళికి ఉన్న బంధం ఎంత విలువైనదో ఈ దృశ్యాలే కళ్లకు కడుతున్నాయని చెబుతున్నారు.  https://twitter.com/i/status/1799327168675360807 ఆ కన్నీటికి కారణం ఇదే! రాజమౌళి సినిమా దర్శకుడు అయ్యే కంటే ముందే శాంతి నివాసం అనే సీరియల్‌తో దర్శకుడిగా మారారు. ఈ శాంతి నివాసం సీరియల్ ఈటీవీలోనే ప్రసారమయ్యేది. అలా అప్పుడు రామోజీరావుతో రాజమౌళికి ఏర్పడిన పరిచయం తర్వాత సాన్నిహిత్యంగా మారింది. తనకు ఆత్మీయుడైన రామోజీ మరణించడంతో రాజమౌళి తట్టుకోలేకపోయారు. అటు సోషల్‌ మీడియా వేదికగాను నివాళులు అర్పించారు.  'ఒక వ్యక్తి తన 50 సంవత్సరాల స్థితిస్థాపకత, కృషి, ఆవిష్కరణలతో లక్షలాది మందికి ఉపాధి, జీవనోపాధి మరియు ఆశలను అందించారు. రామోజీ రావు గారికి మనం నివాళులు అర్పించే ఏకైక మార్గం 'భారతరత్న' ప్రదానం చేయడం' అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.  స్టార్‌ హీరోల నివాళులు పత్రికా రంగం, సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన రామోజీ రావుకి టాలీవుడ్‌ స్టార్ హీరోలు.. సోషల్‌ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు. రామోజీ రావు గారి మరణం అత్యంత బాధాకరమని రామ్‌ చరణ్‌ అన్నారు. ఈ మేరకు 'గేమ్‌ ఛేంజర్‌' చిత్ర యూనిట్‌తో కలిసి నివాళులు అర్పించారు. అక్షర యోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రామోజీ రావు పేరు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని కళ్యాణ్‌ రామ్‌ పోస్టు చేశారు. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. తాను గౌరవించే స్ఫూర్తిదాయ వ్యక్తుల్లో రామోజీ ఒకరని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అంటూ అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. రామోజీ మరణం తీరని లోటని సినీ నటుడు రవితేజ కామెంట్‌ చేశారు.  ఆదివారం అంత్యక్రియలు రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
    జూన్ 08 , 2024
    Anasuya Bharadwaj Hot: భర్త, పిల్లల ముందే బికినీలో అనసూయ!
    Anasuya Bharadwaj Hot: భర్త, పిల్లల ముందే బికినీలో అనసూయ!
    ప్రముఖ నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ షేర్‌ చేసిన ఫొటోలు.. సోషల్‌ మీడియాను కుదిపేస్తున్నాయి.  ప్రస్తుతం ఫ్యామిలీ విహార యాత్రలు చేస్తున్న అనసూయ.. వాటర్‌ ఫాల్స్‌ దగ్గర బికినీతో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది.  బ్లాక్‌ అండ్‌ పింక్‌ కాంబినేషన్‌లోని ఈ వాటర్‌ సూట్‌లో తన తడి అందాలను ప్రదర్శించి ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది.  ఎద, థైస్‌ అందాలను చూపిస్తూ.. చల్లటి నీటిలో జలకాలు ఆడింది. అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోల్లో ఆమె భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.  అనసూయ లేటెస్ట్‌ గ్లామర్‌ షోను చూసిన నెటిజన్లు.. ఆమె ఒంపుసొంపులకు ఫిదా అవుతున్నారు. అందంలో రంగమ్మత్తకు పోటీ ఎవరూ రాలేరని కామెంట్స్ చేస్తున్నారు.  జబర్దస్త్‌ షో (Jabardasth Show) ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.  2012 - 2022 మధ్య  బుల్లితెర యాంకర్‌గా ‌కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.  యాంకర్‌ కాకముందు ప్రముఖ వార్త ఛానల్‌లో అనసూయ (Anasuya Bharadwaj) న్యూస్‌ రీడర్‌గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్‌ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. Anchor Anasuya Hot 🔥 pic.twitter.com/N7ByHQl57v— Viji Tamil Channel ❤️ (@vijiandco6) June 30, 2023 రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా (Meeku Maathrame Cheptha), కథనం (Kathanam), F2, చావు కబురు చల్లగా (Chavu Kaburu Challaga), థ్యాంక్‌ యూ బ్రదర్‌, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.  సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. గతేడాది సెప్టెంబర్‌లో పెదకాపు1 (Peddha Kapu-1) అనే సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత విమానం (Vimanam) అనే మరో మూవీలోనూ అనసూయ నటించింది.  ఇందులో తెలంగాణ మాండలికం ఓన్‌ చేసుకొని మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  రీసెంట్‌గా ‘రజాకార్‌’ (Razakar) అనే తెలంగాణ నేపథ్యమున్న చిత్రంలోనూ అనసూయ మెరిసింది.  ఇందులో పోచమ్మ పాత్రలో ఎంతో అగ్రెసివ్‌గా కనిపించి ఆకట్టుకుంది.  అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో అనసూయ నటిస్తోంది. గతంలో పుష్పలో ఈ పాత్రనే ఆమె పోషించగా మంచి పేరు వచ్చింది. దీంతో పుష్ప 2లో తన రోల్‌పై అనసూయ ఎన్నో ఆశలు పెట్టుకుంది.  పుష్ప 2తో పాటు ' ఫ్లాష్‌బాక్‌' (Flashback) అనే తమిళ చిత్రంలోనూ అనసూయ నటిస్తోంది. ఈ మూవీ కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. 
    మే 24 , 2024
    EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!
    EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!
    సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్‌ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్‌కు తెలియజేశాయి. టాలీవుడ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  పుష్ప (Pushpa) అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్‌ చేశాడు.  గుంటూరు కారం (Guntur Karam) మహేష్‌ బాబు (Mahesh Babu) రీసెంట్‌ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్‌ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్‌ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.  బలగం (Balagam) ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్‌ వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్‌చరణ్‌ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.  దసరా (Dasara) హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.  కలర్‌ఫొటో (Colour Photo) కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్‌ తెలుగు ఆడియన్స్‌కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.  ఉప్పెన (Uppena) యంగ్ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej), డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.  కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam) వరుణ్‌ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు. విరాట పర్వం (Virata parvam) హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.  ఇస్మార్ట్ శంకర్‌ (Ismart Shankar) రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్‌ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్‌గా చేసిన నభా నటేష్‌.. వరంగల్‌ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం. కేర్ ఆఫ్‌ కంచరపాలెం (C/o కంచరపాలెం) మహా వెంకటేష్‌ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్‌ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.  రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru) కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.  గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు టాలీవుడ్‌ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చినవే.  . 
    మే 03 , 2024
    Mamita Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    Mamita Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    మలయాళ నటి 'మమితా బైజు' (Mamita Baiju) పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగుతోంది. ఇటీవల వచ్చిన 'ప్రేమలు' (Premalu) చిత్రంలో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌ రీనూగా కనిపించి యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించింది. దీంతో నెట్టింట ఆమె పేరు తెగ ట్రెండ్‌ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మమితా బైజు’ ఎవరు? ఆమె నటించిన చిత్రాలు ఏంటి? ఆమె కుటుంబ నేపథ్యం? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  కేరళ కొట్టాయం జిల్లాలోని కిడంగూర్‌ ప్రాంతం.. మమితా బైజు స్వస్థలం. ఆమె తల్లిదండ్రులు డా.బైజు క్రిష్ణణ్‌, మిని. మమితా సోదరుడి పేరు మిథున్‌.  కిడంగూర్‌లోని మేరి మౌంట్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఎన్‌.ఎస్‌.ఎస్‌ హైయర్‌ సెకండరీ స్కూల్స్‌లో మమిత పాఠశాల విద్యను అభ్యసించింది. ప్రస్తుతం బీఎస్సీ సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది.  పాఠశాల రోజుల నుంచి మమిత సాంస్కృతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ సమయంలోనే 'సర్వోపరి పలక్కరన్‌' (2017) అనే మలయాళ చిత్రంలో ఆమెకు అవకాశం వచ్చింది.  ఆమె రెండో చిత్రం ‘హనీ బీ 2: సెలబ్రేషన్స్‌’ కూడా అదే ఏడాదిలో విడుదలైంది. ‘డాకినీ’, ‘స్కూల్‌ డైరీ’, ‘వికృతి’, ‘కిలోమీటర్స్‌ అండ్‌ కిలోమీటర్స్‌’, ‘ఆపరేషన్‌ జావా’ వంటి విభిన్నతరహా చిత్రాల్లో మమిత నటించింది.  2021లో వచ్చిన ‘ఖోఖో’ సినిమాలో టీమ్‌ కెప్టెన్‌గా వైవిధ్యం ప్రదర్శించి, ఉత్తమ సహాయ నటిగా ‘కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డు’ అందుకుంది.  గతేడాది ‘ప్రణయ విలాసం’, ‘రామచంద్ర బాక్‌ అండ్‌ కో’ సినిమాలతో మలయాళ ప్రేక్షకుల్ని అలరించింది.  'ఖోఖో' సినిమాలోని ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో 'కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్ అవార్డ్‌' అందుకుంది.  మమిత 16వ చిత్రం 'ప్రేమలు'.. మలయాళంతోపాటు తెలుగులోనూ ఘన విజయం అందుకుంది. ఇందులోని ఆమె అందం, నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.  ఈ సినిమాని తెలుగులో రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ హక్కులు తీసుకొని విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన తరువాత దర్శకధీరుడు రాజమౌళి.. మమితపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు అందరూ అంతర్జాలంలో వెతుకులాట ప్రారంభించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ 'రెబల్‌' అనే చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది.  తెలుగు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని మమిత తాజా ఇంటర్యూలో తెలిపింది.  తాను చూసిన తొలి తెలుగు చిత్రం ‘మగధీర’ అని పేర్కొంది. ‘మగధీర’ ‘ఈగ’ సినిమాలను ఎన్నోసార్లు చూశానని చెప్పింది.  తెలుగులో ఇష్టమైన నటుడు 'అల్లు అర్జున్' అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆయనతో నటించే ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ సందర్భంలో తెలిపింది.  మమితకు కూచిపూడి నృత్యంలో ప్రవేశం ఉంది. ఓసారి స్కూల్‌లో ఇచ్చిన ప్రదర్శనకు సంబంధించిన ఫొటో.. ఆమెకు తొలి చిత్రంలో అవకాశం తెచ్చిపెట్టిందట. ఆమె తండ్రి బైజు క్రిష్ణన్‌ వైద్యుడు కావడంతో తనలాగే కుమార్తెనూ డాక్టర్‌ని చేయాలని ఆయన భావించారట. కానీ, మమితకు అది ఇష్టం లేదట. సినీ రంగంలోనే రాణిస్తానంటోంది.
    మార్చి 14 , 2024
    Miss Perfect Web Series Review: ఓసీడీతో లావణ్యకి ఎన్ని సమస్యలో.. సిరీస్‌ ఎలా ఉందంటే?
    Miss Perfect Web Series Review: ఓసీడీతో లావణ్యకి ఎన్ని సమస్యలో.. సిరీస్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు: లావణ్య త్రిపాఠి, అభిజిత్‌, కేశవ్‌ దీపక్‌, ఝాన్సీ, హర్షవర్ధన్‌, అభిజ్ఞ, రోషన్‌, సతీష్‌ సరిపల్లి, మహేష్‌ విట్టా తదితరులు డైరెక్టర్‌: విశ్వక్ ఖండేరా సినిమాటోగ్రాఫర్‌ : అదిత్య జవ్వాది సంగీతం : ప్రశాంత్‌ ఆర్. విహారి స్ట్రీమింగ్‌ భాషలు : తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, బెంగాలి, కన్నడ, మరాఠీ ఓటీటీ వేదిక: డిస్నీ + హాట్‌స్టార్‌ విడుదల తేదీ:  02 ఫిబ్రవరి, 2024 లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్' (Miss Perfect Web Series Review in Telugu). 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్, 'బిగ్ బాస్ 4' విన్నర్ అభిజీత్ (Abhijith) ఆమెకు జంటగా నటించాడు. అభిజ్ఞ, హర్షవర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్టా, సునైనా ఇతర ప్రధాన తారాగణంగా ఉన్నారు. 'స్కై ల్యాబ్' (Sky Lab) ఫేమ్ విశ్వక్ ఖండేరావు ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించగా నేటి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం. కథ లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) శుచి - శుభ్రతలకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి అమ్మాయి. ఓసీడీ ఉండటం వల్ల పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని భావిస్తుంటుంది. ప్రమోషన్‌లో భాగంగా లావణ్య హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవుతుంది. రోహిత్ (అభిజీత్) ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో అద్దెకు దిగుతుంది. వీరిద్దరి ఫ్లాట్‌లో జ్యోతి (అభిజ్ఞ) వంట చేస్తుంటుంది. ఓ కారణం చేత లావణ్య.. రోహిత్ ఫ్లాట్‌కు వెళ్తుంది. ఆమెను జ్యోతి పంపిన పనిమనిషి అని రోహిత్‌ భ్రమపడటంతో కథ మలుపు తిరుగుతుంది. మరి లావణ్య రోజూ రోహిత్‌ ఫ్లాటుకు ఎందుకు వెళ్లింది? రోహిత్‌ ఆమెను ఎందుకు ఇష్టపడ్డాడు? ఆ విషయాన్ని ఆమెకు చెప్పాడా లేదా? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే మిస్‌ పర్ఫెక్ట్‌గా (Miss Perfect) లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. అపరిశుభ్రతను భరించలేని పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ అభిజీత్‌ కూడా చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించాడు. ఫ్రెష్‌ లుక్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అభిజిత్‌ - లావణ్య జోడీ చూడటానికి చాలా బాగుంది. ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక హర్షవర్ధన్‌, ఝూన్సీ క్యారెక్టర్లు పరిమితంగా ఉన్నాయి. మహేష్‌ విట్టాతో పాటు మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే తెలుగు ప్రేక్షకులకు ఓసీడీ కథ కొత్త కాదు. 'మహానుభావుడు' చిత్రం ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిందే. అయితే మహిళకు ఓసీడీ ఉంటే ఎలా ఉంటుందన్న లైన్‌ను దర్శకుడు విశ్వక్‌ ఖండేరావు తీసుకోవడం ఆసక్తికరం. అందుకు అనుగుణంగానే లావణ్య క్యారెక్టర్‌ను బాగా డిజైన్‌ చేశారు. అయితే ఆ పాత్రకు తగ్గ సన్నివేశాలను రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. ఆమెకున్న ఓసీడీని క్యాష్‌ చేసుకొని కామెడీని పండించడంలో ఆయన విఫలమయ్యారు. కథ - కథనాల్లో, కామెడీలో, నెక్స్ట్ ఏంటి అన్న క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలోనూ డైరెక్టర్‌ తడబడ్డారు. రైటింగ్‌ ఫెయిల్యూర్‌ వల్ల భావోద్వేగాలు కూడా పెద్దగా పండలేదు.  సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్. విహారికే దక్కుతుంది. సిరీస్ అని లైట్ తీసుకోకుండా మంచి మెలోడీ పాటలు కంపోజ్ చేశారు. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ లావణ్య, అభిజిత్ నటనసంగీతంసినిమాటోగ్రఫి మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంసాగదీత సీన్లుపండని భావోద్వేగాలు రేటింగ్‌: 2.5/5
    ఫిబ్రవరి 02 , 2024
    Sana Javed: షోయాబ్‌ మాలిక్ కొత్త భార్య ‘సనా జావేద్’ ఎంత ఫేమస్సో తెలుసా?
    Sana Javed: షోయాబ్‌ మాలిక్ కొత్త భార్య ‘సనా జావేద్’ ఎంత ఫేమస్సో తెలుసా?
    పాక్‌ నటి ‘సనా జావేద్‌’ (Sana Javed)ను పాక్‌ మాజీ కెప్టెన్‌ షోయాబ్‌ మాలిక్‌ (Shoaib Malik) మూడో పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం ఆమె పేరు మార్మోగుతోంది.  భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మిర్జా (Sania Mirza)కు షోయాబ్‌ భర్త కాగా, వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.  ఈ క్రమంలోనే సనా జావేద్‌ను వివాహం చేసుకున్నట్లు షోయాబ్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ‘సనా జావేద్‌’.. సౌదీ అరేబియాలోని జడ్డా ప్రాంతంలో మార్చి 24, 1993న జన్మించింది. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది.  ఈ క్రమంలోనే 2012లో పాక్‌ సీరియల్‌ 'మేరా పెహ్లా ప్యార్‌'తో నటిగా అరంగేట్రం చేసింది. అదే ఏడాది షెహర్‌-ఈ-జాత్‌ అనే టీవీ సిరీస్‌లోనూ ఆమె కనిపించింది. 2016లో ప్రముఖ సీరియల్‌ యాక్టర్‌ జాహిద్‌ అహ్మద్‌తో 'జరా యాద్‌ కర్‌' అనే టీవీ సిరీస్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  దీంతో తర్వాతి ఏడాదే (2017) ఆమెకు పాక్‌ సినిమాలో అవకాశం దక్కింది. యంగ్‌ హీరో ధనిష్‌ తైమూర్ సరసన ‘మెహరునీసా ఐ లవ్‌ యూ’ (Mehrunisa V Lub U) అనే చిత్రంలో సనా హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది. అదే ఏడాది 'రంగ్‌రేజా' చిత్రంలో లీడ్‌ రోల్‌లో కనిపించి నటిగా పాక్‌ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.  2020లో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన 'జీతో పాకిస్తాన్‌ లీగ్‌' అనే రియాలిటీ షోలో డ్రాగన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి సనా అందరి దృష్టిని ఆకర్షించింది. అదే ఏడాది సనా జావేద్‌కి వివాహమైంది. 2020 అక్టోబర్‌లో పాక్‌ సింగర్‌ ఉమైర్ జస్వాల్‌ను కరాచీలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.  అయితే వారి కాపురం ఎక్కువ రోజులు నిలబడలేదు. కొద్ది రోజులకే సనా, ఉమైర్‌ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. తమ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించారు. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు ఒంటరిగానే జీవించిన సనా జావేద్‌.. ఆ తర్వాత పాక్‌ మాజీ కెప్టెన్‌ షోయాబ్‌ మాలిక్‌కు దగ్గరైంది. గతేడాది సనా బర్త్‌డేకు షోయాబ్‌ బహిరంగంగా విషెస్‌ చెప్పడంతో వారి బంధం తొలిసారి వెలుగు చూసింది.  అప్పటి నుంచి వారి డేటింగ్‌కు సంబంధించిన వార్తలు తరచూ చక్కర్లు కొట్టాయి. తాజాగా పెళ్లి బంధంతో షోయాబ్‌, సనా ఒక్కటై ఆ వార్తలకు ముగింపు పలికారు. ఇక రీసెంట్‌గా ‘ఐ లవ్‌ యూ జారా’ (2023) అనే చిత్రంలో సనా జావేద్‌ నటించింది. ‘సుకూన్‌’ అనే సీరియల్‌లోనూ ఐనా పాత్రను పోషిస్తోంది.  ప్రస్తుతం సనా.. ఏ చిత్రాలను ఒప్పుకోలేదు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న 'మెహమ్మద్‌ ఏక్‌ సాజా' అనే సిరీయల్‌లో మాత్రం ఆమె నటిస్తోంది. 
    జనవరి 20 , 2024
    Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ మళ్లీ భయపెట్టిందా? రేటింగ్ ఇదే!
    Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ మళ్లీ భయపెట్టిందా? రేటింగ్ ఇదే!
    నటీనటులు: సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి, సాహితి దాస‌రి, అక్ష‌త శ్రీనివాస్‌ తదితరులు దర్శకుడు : డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ నిర్మాత: గౌరీ కృష్ణ సంగీతం: జ్ఞాని సినిమాటోగ్రఫీ: కుశిదర్ రమేష్ రెడ్డి విడుదల తేదీ : నవంబర్ 03, 2023 2021లో వచ్చిన మా ఊరి పొలిమేర (Maa Oori Polimera) చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ చిత్రం అత్యధిక ఆదరణను సంపాదించింది. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అందరికీ నచ్చేయడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా రూపొందించారు. డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ డైరెక్షన్‌లో రూపొందిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) ఇవాళ (నవంబర్‌ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా వాటిని అందుకుందా? పార్ట్‌-1 లాగే విభిన్నమైన కథాంశంతో మెప్పించిందా? సత్యం రాజేష్‌ నటన ఎలా ఉంది? వంటి అంశాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే రెండో భాగం ప్రారంభమవుతుంది. ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎలా సాగిదంటే పొలిమేర పార్ట్‌ 1 మొత్తాన్ని ఓ నాలుగు నిమిషాల్లో చూపించి పార్ట్‌ 2 మెుదలవుతోంది. ఆ తర్వాత కేరళలో ఉన్న కొమురయ్యను చూపించి కథను అతని భార్య వద్దకు తీసుకెళ్లాడు డైరెక్టర్‌. కొత్తగా వచ్చిన ఎస్సై ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. కేరళ అడవుల్లో కొమురయ్య చేసే పూజలు కొంతవరకు భయపెడతాయి. ఆ తర్వాత కథ అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కూడా కథ రొటీన్‌గా సాగుతుంది. కానీ చివర్లో వచ్చే కొన్ని ట్విస్టులు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. పార్ట్‌ 1లో మర్డర్‌ మిస్టరికీ చేతబడిని యాడ్‌ చేస్తే ఇందులో గుప్త నిధుల అనే పాయింట్‌ని జత చేశారు. పార్ట్‌-1లో లాగే పార్ట్‌-2లో కూడా పలు ప్రశ్నలు లేవనెత్తి వాటికి సమాధానం పార్ట్‌ 3లో ఉంటుందని ముగించేశారు.  ఎవరెలా చేశారంటే? కొమురయ్య పాత్రలో సత్యం రాజేశ్‌ అదరగొట్టాడు. పార్ట్‌ 1లో నటించిన అనుభవంతో ఇందులో ఈజీగా నటించేశాడు. కొన్ని చోట్ల అతని ఎక్స్‌ప్రెషన్స్‌ భయపెడతాయి. కొమిరి భార్య లక్ష్మీ పాత్రలో కామాక్షి భాస్కర్ల  చక్కగా నటించింది. పార్ట్‌ 1తో పోలిస్తే ఇందులో ఆమెకు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్‌ అదిరిపోతుంది. ఇక జంగయ్యగా నటించిన బాలాదిత్య తన పాత్ర పరిధిమేరకు నటించాడు. తొలి భాగంతో పోలిస్తే ఇందుతో అతని పాత్ర నిడివి చాలా తక్కువే. ఇక బలిజ పాత్రలో గెటప్‌ శ్రీను జీవించేశాడు. ఎస్సైగా రాకేందు మౌళి, సర్పంచ్‌గా రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.   డైరెక్షన్ ఎలా ఉందంటే? కథ, కథనాన్ని నడిపించడంలో దర్శకుడు డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.  కొన్ని సీన్స్‌కి అయితే లాజిక్కే ఉండదు. ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేయాలన్న ఉద్దేశంతోనే కొన్ని ట్విస్టులను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి కథకు ఏ మేరకు అవసరమనేది డైరెక్టర్‌ పట్టించుకోలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సింది. ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ని చూపించడం వల్ల ఏది గతం, ఏది ప్రస్తుతం అనే కన్యూఫ్యూజన్ ఆడియన్స్‌లో నెలకొంటుంది. అయితే పార్ట్‌ 1 చూడకపోయినా పార్ట్‌ 2 చూసే విధంగా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ విషయంలో అతన్ని అభినందించాల్సిందే.  టెక్నికల్‌గా ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం జ్ఞాని నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల ఆయన భయపెట్టాడు. ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ సత్యం రాజేశ్ నటనకథలోని ట్విస్ట్‌లునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్ నెమ్మదిగా సాగే కథనంలాజిక్‌ లేని సీన్స్‌ చివరిగా: థ్రిల్లింగ్‌ సినిమాలను ఇష్టపడే వారికి ‘మా ఊరి పొలిమేర 2’ కచ్చితంగా నచ్చుతుంది. ట్విస్టులు, క్రైమ్‌ సీన్స్‌, క్లైమాక్స్‌కు వారు బాగా కనెక్ట్ అవుతారు.  రేటింగ్‌ : 3.5/5
    నవంబర్ 03 , 2023
    Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!
    Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!
    భారతీయ సంస్కృతిలో ఉపధ్యాయ వృత్తికి అత్యున్నత గౌరవం ఉంది. పురాణాలు, చరిత్రలో గురువులకు సముచిత స్థానం కల్పించారు మన పూర్వికులు. "గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః" అంటూ గురువును త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పొల్చారు. విద్యార్థుల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రబోధించే గురువులకు అప్పటికీ, ఇప్పటికీ ఉన్నారు. వారందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలుగు తెరపై టీచర్లుగా నటించి మంచి గుర్తింపు పొందిన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఆ పంతులమ్మలు ఎవరో ఓసారి చూద్దాం... విజయశాంతి: తెలుగు తెరపై ఎన్ని సినిమాలు వచ్చినా అందులో విజయశాంతి నటించిన ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. ప్రతిఘటనలో లెక్చరర్‌గా ఆమె పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఆ సినిమాలో గతి తప్పిన విద్యార్థులను ఉద్దేశిస్తూ విజయశాంతి పాడిన పాట సినిమాకే హైలెట్. "ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతలోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం ఆరవవేదం మానభంగపర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం... ఆసిన్ విజయశాంతి తర్వాత టీచర్ పాత్ర చేసి అంత గుర్తింపు పొందిన హీరోయిన్ ఆసిన్. విక్టరీ వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రంలో మ్యాథ్య్ టీచర్‌గా సీరియస్‌ రోల్‌ నటించి మెప్పించింది. కమలినీ ముఖర్జీ హ్యాపీ డేస్ చిత్రంలో తన గ్లామర్‌తో మాయ చేసింది కమలినీ ముఖర్జీ. ఇంగ్లిష్ లెక్చరర్‌గా కనువిందు చేసింది. ఇలియానా రవితేజ నటించిన ‘ఖతర్నాక్’ మూవీలో చేసిన టీచర్ పాత్రకు కాస్త గ్లామర్ అద్దింది ఇలియానా. ఈ రోల్‌పై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. టీచర్‌ పాత్రను ఇలా చూపించడం ఏమిటంటూ పలువురు పెదవి విరిచారు. నయనతార లేడీ బాస్ నయనతార సైతం పలు చిత్రాల్లో పంతులమ్మ క్యారెక్టర్లో నటించి మెప్పించింది. ‘నేనే అంబానీ మూవీలో టీచర్‌ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది. అనుపమ పరమేశ్వరన్ క్యూట్ డాల్ అనుపమ పరమేశ్వరన్ కూడా టీచర్ రోల్‌ మెప్పించి ఔరా అనిపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలో టీచర్ పాత్రలో కనిపించింది. సాయి పల్లవి ఈ తరం కుర్రకారును లెక్చరర్ పాత్రలో బాగా మెప్పించిన రోల్‌ ఏదైన ఉందంటే  'ప్రేమమ్'(మలయాళం) సినిమాలో సాయిపల్లవి చేసిన అధ్యాపకురాలి పాత్ర. ఈ పాత్రలో సాయిపల్లవి పరకాయ ప్రవేశం చేసి అలరించింది. శృతిహాసన్ తెలుగులో వచ్చిన 'ప్రేమమ్' సినిమాలోనూ లెక్చరర్ పాత్రలో ఒదిగిపోయింది శృతిహాసన్‌. ఆ సినిమాలో హీరోగా నాగచైతన్య నటించిన సంగతి తెలిసిందే. సన్నిలియోన్ మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’ సినిమాలో కాసేపు టీచర్ పాత్రలో నటించి కాసేపు కనువిందు చేసింది సన్ని లియోన్. షకిలా నితిన్-సదా జంటగా నటించిన జయం సినిమాలో షకిలా లెక్చరర్ పాత్రలో నటించి నవ్వులు పూయించింది. అప్పట్లో ఈ క్యారెక్టర్ వివాదాస్పదమైంది.   కలర్స్ స్వాతి సుమంత్ హీరోగా నటించిన గోల్కొండ హై స్కూల్ చిత్రంలో టీచర్ పాత్రలో మెరిసింది కలర్స్ స్వాతి  సంయుక్త మీనన్ ధనుష్ హీరోగా నటించిన 'సార్' మూవీలో లెక్చరర్ పాత్రలో నటించి కనువిందు చేసింది సంయుక్త మీనన్. బయాలజీ టీచర్‌ రోల్‌లో నటించి అలరించింది. ఈ సినిమా సూపర్ హిట్  సుహాసిని ఇక పాత తరంలో 'ఆరాధన' సినిమాలో సుహాసిని చేసిన టీచర్ పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
    సెప్టెంబర్ 05 , 2023
    Telangana Folk Singers: తెలంగాణలో గద్దర్ లాంటి విప్లవ కళాకారులు ఉన్నారా?
    Telangana Folk Singers: తెలంగాణలో గద్దర్ లాంటి విప్లవ కళాకారులు ఉన్నారా?
    ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇటీవల కన్నుమూశారు. విప్లవానికి కళం, గళం తోడైతే అది గద్దర్‌లా ఉంటుంది. గద్దరన్న ఎన్నో పాటలతో జాతిని జాగృతం చేశాడు. ఆయన చూపించిన విప్లవ పంథా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. గద్దరన్నతో పాటు ఎంతో మంది విప్లవ కళాకారులు ప్రజలను ఏకం చేసేందుకు ప్రయత్నించారు. పాట, ఆట రూపంలో ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించిన వారున్నారు. మరి, ఆ కళాకారులు ఎవరో తెలుసుకుందాం.   ఎపూరు సోమన్న అయోధ్య అంటే గుర్తొస్తడు రామన్న. పల్లె పాట అంటే యాదికొస్తడు ఏపూరు సోమన్న. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం వెలిశాలలో జన్మించాడు ఏపూరు సోమన్న. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినా నానమ్మ సంరక్షణలో పెరిగాడు. సోమన్న పాటలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఏ పాట పాడినా అది శ్రోతలను ఆకట్టుకుంటుంది. పాటే తన జీవితంగా బతుకుతున్నాడు. ‘జోరు సాగుతుందిరా కొడకా.. తెలంగాణ హోరు సాగుతుందిరా’, ‘ఎవడిపాలైందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో తెలంగాణ?’ అంటూ రాగమెత్తితే ఉద్యమ స్ఫూర్తి  రగలాల్సిందే.  https://www.youtube.com/watch?v=JigfoYaKt5Y&t=33s గోరేటి వెంకన్న గోరేటి వెంకన్న కవి, గాయకుడు. ప్రస్తుతమున్న నాగర్ కర్నూల్ జిల్లా గౌరారంలో జన్మించాడు గోరేటి వెంకన్న. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది’ అంటూ తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించాడు. వివిధ సినిమాల్లో పాటలు రాసి కుబుసం సినిమాలోని ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అంటూ గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించాడు. వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ లభించింది. ప్రస్తుతం వెంకన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు.   https://www.youtube.com/watch?v=kU344_l7S-U&t=4s రసమయి బాలకిషన్ గజ్జె కట్టి, మైకు పట్టి.. గొంతెత్తి కాలు కదిపిన రసమయి బాలకిషన్ విప్లవ కళాకారుడే. రసమయి సిద్దిపేట జిల్లాలోని రావురూకులలో జన్మించాడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. ‘తెలంగాణ ధూం ధాం’ కార్యక్రమానికి పురుడు పోసింది రసమయినే. ‘ఓ యమ్మ నా పల్లె సీమ.. ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామా?’ అంటూ ఎన్నో పాటలకు జీవం పోశాడు. తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి ప్రజలను ఏకం చేశాడు.  Oyamma Telangana- Rasamayi Balakishan Telangana Song || Folk Song Telugu || Folk songs ఆర్.నారాయణమూర్తి సామాజిక కళాకారుడిగా ఆర్ నారాయణ మూర్తి అందరికీ సుపరిచితం. క్రోనీ క్యాపిటలిజం, నిరుద్యోగిత, సామాజిక సమస్యలపై తన గళం విప్పిన వ్యక్తి. తన సినిమాలతో వివిధ అంశాలను స్పృశిస్తూ ప్రజలను మేల్కొలిపాడు. అందుకే ఈయణ్ను పీపుల్స్ స్టార్ అని పిలుస్తుంటారు. నటుడిగా, గాయకుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సేవలు అందించాడు. ఎన్నో సినిమాలను తీశాడు. ‘బంజారే బంజో’, ‘ఆపుర రిక్షోడా’, ‘ఎర్ర జెండ.. ఎర్ర జెండ’ వంటి పాటలతో పోరాట స్ఫూర్తిని రగిల్చాడు.  https://www.youtube.com/watch?v=pwV92lAeq_w&t=1119s విమలక్క భువనగిరి జిల్లా ఆలేరులో జన్మించింది విమలక్క. తెలంగాణను జాగృతం చేసే ఎన్నో పాటలను పాడింది. ‘అసైదులా హారతి’, ‘పల్లె పల్లెనా’, ‘ఏడు గడిసి పాయె.. దినము ఒడిసి పాయె’ వంటి పాటలను పాడి ప్రజల మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది. మానవ హక్కుల సంరక్షణకు కదం తొక్కారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కళాకారులతో కలిసి కార్యక్రమాలను నిర్వహించినందుకు నాలుగు నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించింది.  https://www.youtube.com/watch?v=e33k9zFzk18&t=5s బెళ్లి లలిత  ‘తెలంగాణ గాన కోకిల’గా బిరుదు పొందిన బెళ్లి లలిత ఉద్యమ కళాకారిణి. అణచివేతకు, అధికారానికి వ్యతిరేకంగా గొంతెత్తి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వనిత. తెలంగాణ కళా సమితి వ్యవస్థాపకురాలు. నాడు ఈమె ఎలుగెత్తిన తీరుకు అధికార నేతలే హడలిపోయారు. ప్రజలను సంఘటితం చేయడాన్ని చూసి వణికిపోయారు.  సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. అయితే, పుట్టిన భువనగిరిలోనే లలితక్కను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి 18 ముక్కులుగా నరికేశారు. ఈమె మరణంపై ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయి.  https://www.youtube.com/watch?v=wLsc-0JvUf4 పయిలం సంతోష్   తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా పనిచేశాడు పయిలం సంతోష్. సంతోష్ అసలు పేరు అడూరి బ్రహ్మయ్య. జానపద కళాకారుడు. ఉద్యమ సమయంలో గొంతెత్తి ప్రజలను సంఘటితం చేశాడు. తెలంగాణ నుంచి బొంబాయికి వలస పోతున్న ప్రజలను ఉద్దేశించి సంతోష్ ‘పైలం’ అనే ఆల్బమ్ విడుదల చేశాడు. అప్పటి నుంచి పైలం సంతోష్‌గా పేరుపొందాడు. సూర్యాపేట వెలిదండలో పుట్టిన సంతోష్.. నల్గొండలోని దుగునెల్లిలో పెరిగాడు. 2020లో అకాల మరణం పొందాడు.  https://www.youtube.com/watch?v=XXQTnLMJP6g&t=3s సాయిచంద్ తెలంగాణ ఉద్యమ సమయంలో గొంతుకు సానబెట్టిన కళాకారుడు సాయిచంద్. వనపర్తి జిల్లాలోని అమరచింతలో జన్మించిన సాయిచంద్ ఎంతో చురుగ్గా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం, అధికార పార్టీకి పనిచేశాడు. చనిపోయేంత వరకు వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్నాడు. https://www.youtube.com/watch?v=KHtwovGCU9g&t=2s
    ఆగస్టు 10 , 2023
    Sarath Babu: శరత్‌ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిన టాప్‌-10 చిత్రాలు ఇవే..!
    Sarath Babu: శరత్‌ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిన టాప్‌-10 చిత్రాలు ఇవే..!
    టాలీవుడ్‌లోని అతి తక్కువ మంది విలక్షణ నటుల్లో శరత్‌బాబు ఒకరు. ప్రియుడిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, మోసకారిగా, విలన్‌గా ఇలా ఎన్నో పాత్రల్లో కనిపించి తిరుగులేని నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన శరత్‌బాబు 1973లో వచ్చిన రామరాజ్యం సినిమాతో తెరంగేట్రం చేశారు. 300లకు పైగా సినిమాల్లో నటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్‌బాబు (71).. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన చివరిగా నరేష్- పవిత్ర జంటగా చేసిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించారు. శరత్‌బాబు మరణం నేపథ్యంలో ఆయనకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చిన టాప్‌-10 చిత్రాలు మీకోసం.. 1. సీతాకోక చిలుక 1981లో వచ్చిన ‘సీతాకోక చిలుక’ సినిమా నటుడిగా శరత్‌ బాబుకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. ఇందులో హీరోయిన్‌ కరుణకు అన్నగా శరత్‌ బాబు అద్భుతంగా నటించారు. జాలి, దయ, ప్రేమ, కరుణ లేని డేవిడ్ పాత్రలో శరత్‌బాబు ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా విజయంలోనూ శరత్‌బాబు కీలక పాత్ర పోషించారు. అప్పట్లో సీతాకోక చిలుక చిత్రం ఒక ప్రభంజనమే సృష్టించింది. https://www.youtube.com/watch?v=lPf-cPdYjq0 2. అన్వేషణ 1985లో వచ్చిన ‘అన్వేషణ’ చిత్రం అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో జేమ్స్‌ అనే ఫారెస్టు రేంజ్‌ అధికారి పాత్రను శరత్‌ బాబు పోషించారు. తన అద్బుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా తర్వాత నుంచి శరత్‌ బాబుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 3. సితార 1980వ దశకంలో వచ్చిన ‘సితార’ చిత్రం శరత్‌ బాబు నటనా పాఠవాలను తెలియజేసింది. ఇందులో హీరోయిన్‌కు అన్నగా శరత్‌ బాబు నటించారు. చందర్ పాత్రలో ఒదిగిపోయాడు. చెల్లిని అమితంగా ఇష్టపడే అన్నగా.. కోర్టు గొడవలతో సతమతమయ్యే వ్యక్తిగా శరత్‌బాబు ఎంతో వైవిధ్యంతో నటించారు.  https://www.youtube.com/watch?v=ZK4qaJMWwoc 4. సంసారం చదరంగం ‘సంసారం చదరంగం’ సినిమా కూడా శరత్‌బాబుకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో అప్పల నరసయ్య కుమారుడి పాత్రలో శరత్‌ కుమార్ నటించారు. డబ్బు విషయంలో కచ్చితంగా ఉండే ప్రకాష్‌ పాత్రలో ఆయన అలరించాడు. ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాల్లో శరత్‌ బాబు అద్భుతమే చేశాడు. తన నటన ఎంత లోతైనదో చూపించాడు.  https://www.youtube.com/watch?v=esucI1zKcM4 5. సాగర సంగమం కె. విశ్వనాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘సాగర సంగమం’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమల్‌ హసన్‌ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా ఇది మిగిలిపోయింది. ఇందులో  రఘుపతి పాత్ర పోషించిన శరత్‌బాబుకు కూడా ఈ సినిమా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. కమల్‌కు స్నేహితుడిగా ఇందులో శరత్‌బాబు నటించారు.  https://www.youtube.com/watch?v=CtBi8524GAc 6. స్వాతి ముత్యం కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా చేసిన ‘స్వాతి ముత్యం’ సినిమాలోనూ శరత్‌బాబు నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సోదరుడు చలపతి పాత్రలో శరత్‌బాబు అత్యుత్తమ నటన కనబరిచాడు. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కురిశాయి. 7. ముత్తు రజనీకాంత్‌ కెరీర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ముత్తు’ ఒకటి. ఇందులో జమీందారైన రాజా పాత్రలో శరత్‌బాబు ఆకట్టుకున్నాడు. రజనీకాంత్‌తో పోటీ పడి మరీ నటించాడు. రజనీ - శరత్‌బాబు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శరత్‌బాబు అత్యుత్తమ నటన కనబరిచిన సినిమాల్లో ముత్తు కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.  https://www.youtube.com/watch?v=0h6qh6ABmdk 8. అన్నయ్య చిరంజీవి, సౌందర్య జంటగా నటించిన అన్నయ్య సినిమాలో శరత్‌బాబు విలన్‌ పాత్ర పోషించారు.  సోదరులను అడ్డుపెట్టుకొని చిరంజీవిపై పగ తీర్చుకునే రంగారావు పాత్రలో శరత్‌బాబు మంచి నటన కనబరిచాడు.  https://www.youtube.com/watch?v=Deoo7_CQFdg 9. మగధీర రామ్‌చరణ్‌ - రాజమౌళి కాంబో వచ్చిన మగధీర చిత్రంలోనూ శరత్‌ కుమార్‌ నటించారు. కాజల్‌కు తండ్రిగా, విక్రమ్‌ సింగ్ మహారాజ్‌గా మెప్పించాడు.  https://www.youtube.com/watch?v=G7haVu5g-Qw 10. వకీల్‌సాబ్‌ పవన్‌ కల్యాణ్‌ రీసెంట్ మూవీ వకీల్‌సాబ్‌ సినిమాలోనూ శరత్‌కుమార్‌ కనిపించారు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఆయన నటించారు. పవన్‌ను ఉద్దేశిస్తూ ‘ఇప్పుడు జనాలకు నీ అవసరం ఉంది’ అని శరత్‌ బాబు చెప్పిన డైలాగ్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. 
    మే 22 , 2023

    @2021 KTree