
మేఘా ఆకాష్
జననం : అక్టోబర్ 26 , 1995
ప్రదేశం: తమిళనాడు, భారతదేశం
"మేఘా ఆకాష్ దక్షిణాది నటి, ఆమె ప్రధానంగా తమిళం, తెలుగు చిత్రాలలో నటిస్తుంది. తెలుగులో లై (2017)తో పరిచయమైంది. తమిళంలో పెట్టా ద్వారా అరంగేట్రం చేసింది. రాజా రాజా చోరా (2021), కమర్షియల్‌గా విజయం సాధించిన డియర్ మేఘా (2021)లో కూడా నటించింది.
మేఘా ఆకాష్ వయసు ఎంత?
మేఘా ఆకాష్ వయసు 29 సంవత్సరాలు
మేఘా ఆకాష్ ముద్దు పేరు ఏంటి?
మేఘా
మేఘా ఆకాష్ ఎత్తు ఎంత?
5'4'' (163cm)
మేఘా ఆకాష్ అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్, మ్యూజిక్ వినడం
మేఘా ఆకాష్ ఏం చదువుకున్నారు?
Bsc
మేఘా ఆకాష్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
లేడీ ఆండాళ్ స్కూల్, చెన్నై
ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీ, చెన్నై
మేఘా ఆకాష్ ఫిగర్ మెజర్‌మెంట్స్?
33-24-34
మేఘా ఆకాష్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
2024 వరకూ తెలుగులో 9 చిత్రాల్లో మేఘా నటించింది.
మేఘా ఆకాష్ In Saree
మేఘా ఆకాష్ In Ethnic Dress
మేఘా ఆకాష్ Childhood Images
మేఘా ఆకాష్ Hot Pics
మేఘా ఆకాష్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Megha Akash Viral Video
కథనాలు

Vikkatakavi Web Series Review: 1970ల నాటి దేవతల గుట్ట మిస్టరీ.. ‘వికటకవి’ థ్రిల్లింగ్‌గా ఉందా?
నటీనటులు: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, షిజు మీనన్, తారక్ పొన్నప్ప, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్ తదితరులు
దర్శకుడు: ప్రదీప్ మద్దాలి
సంగీత దర్శకుడు: అజయ్ అరసాడా
సినిమాటోగ్రఫీ: షోయెబ్ సిద్దికీ
ఎడిటర్: సాయి బాబు తలారి
నిర్మాత : రజని తాళ్లూరి
ఓటీటీ వేదిక : జీ 5
యువ నటుడు నరేష్ అగస్త్య (Naresh Agastya) 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటెస్ట్ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Vikkatakavi Web Series Review)
కథేంటి
ఈ సిరీస్ 1970 కాలంలో సాగుతుంటుంది. రామకృష్ణ (నరేష్ అగస్త్య) ఫేమస్ డిటెక్టివ్. తన తెలివి తేటలతో ఎంతో సంక్లిష్టమైన కేసులను పరిష్కరిస్తుంటాడు. దీంతో పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసులు సైతం అతడి సాయం తీసుకుంటుంటారు. మరోవైపు అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. రామకృష్ణ డిటెక్టివ్ స్కిల్స్ గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్ దేవతల గుట్ట రహాస్యాన్ని కనుగొనాలని ఛాలెంజ్ చేస్తాడు. దీంతో దేవతల గుట్ట మీదకు వెళ్లిన రామకృష్ణ ఏం తెలుసుకున్నాడు?. అతడితో అమరగరి సంస్థాన రాజు మనవరాలు లక్ష్మీ (మేఘా ఆకాష్) ఎందుకు వెళ్లింది? వారిద్దరి పరిచయం ఎలా జరిగింది? ఇంతకీ ఆ శాపం ఏంటి? దానిని రామకృష్ణ పరిష్కరించాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేష్ ఆగస్త్య (Vikkatakavi Web Series Review) ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ నటనతో అదరగొట్టాడు. లుక్స్, డైలాగ్స్ పరంగా ఎంతో పరిణితి సాధించాడని చెప్పవచ్చు. తన బాడీ లాంగ్వేజ్‌తో పాత్రకు మంచి వెయిటేజ్ తీసుకొచ్చాడు. మేఘా ఆకాష్ (Megha Akash) నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే కనిపించింది. హావాభావాలను చక్కగా పలికించింది. రఘు కుంచె, షిజు అబ్దుల్ రషీద్, ముక్తార్ ఖాన్, అశోక్ కుమార్, అమిత్ తివారిలవి రెగ్యులర్ రోల్స్ అయినా కథలో సెట్ అయ్యాయి. తారక్ పొన్నప్ప చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అతడి స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది. ఏ దశలోనూ కథ నుంచి డివియేట్ కాకుండా మెప్పించాడు. కథలోని ప్రతీ పాత్రకు ఓ పర్పస్ ఉండటం, ఆ క్యారెక్టర్లను డిజైన్ చేసిన విధానం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. కథకు సంబంధించి హింట్స్ ఇస్తూనే ఇంట్రస్ట్ క్రియేట్ చేశారు. ట్విస్టులు కాస్త ఊహించే విధంగానే ఉన్నప్పటికీ ఎంగేజింగ్‌గా అనిపిస్తాయి. అయితే కొన్ని సన్నివేశాలను ఇంకాస్త బలంగా చూపించే అవకాశమున్నప్పటికీ దర్శకుడు వినియోగించుకోలేకపోయాడు. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగదీతగా అనిపించిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని ఎలివేషన్స్ షాట్స్ కూడా బెటర్‌గా తీసి ఉంటే సిరీస్ నెక్స్ట్ లెవల్లో ఉండేదని చెప్పవచ్చు. ఊహాజనితంగా సాగడం కూడా ఇంకో మైసన్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా..
ఈ సిరీస్‌కు టెక్నికల్ విభాగాలు (Vikatakavi Web Series Review) అన్నీ మంచి పనితీరు కనబరిచాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కావడంతో అప్పటి సెటప్, డ్రెస్సింగ్ స్టైల్‌ను ఆర్ట్ డిపార్ట్‌మెంట్ బాగా తీర్చిదిద్దింది. సినిమాటోగ్రాఫీ కూడా వెనకటి కాలానికి తీసుకెళ్లేలా ఉంది. నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, కథనంనరేష్ అగస్త్య నటనట్విస్టులు
మైనస్ పాయింట్స్
ఊహాజనితంగా ఉండటంకొన్ని సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 28 , 2024
Ravanasura Review: విలన్ షేడ్స్‌లో అదరగొట్టిన మాస్ మహారాజా… ధమాకా తర్వాత మరో హిట్..!
నటీనటులు: రవితేజ, దక్ష నగర్కర్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, సుశాంత్, సంపత్, మురళి శర్మ, రావు రమేష్
దర్శకుడు: సుధీర్ వర్మ
రచయిత: శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం భారీ అంచనాలతో ఇవాళ ( ఏప్రిల్ 7) థియేటర్లలో విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో నటించిన రవితేజ.. ధమాకా చిత్రం ద్వారా భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అదే ఉత్సాహంతో రావణుసుర చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటివరకు రవితేజ చేసిన సినిమాల్లో కెల్లా రావణసుర ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఇందులో రవితేజ విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, ట్రైలర్, టీజర్ ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో రావణసుర చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రవితేజకు మరో హిట్ తెచ్చిపెట్టిందా? అసలు సినిమా స్టోరీ ఏంటి? విలన్‌గా రవితేజ నటనకు ఎన్ని మార్కులు పడ్డాయి? వంటి ప్రశ్నలకు ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం.
కథ ఏంటంటే:
రావణసుర కథలోకి వెళితే... ఫరియా అబ్దుల్లా దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్ లాయర్‌గా పనిచేస్తుంటాడు. కోర్టులో న్యాయం జరగకపోతే బాధితులకు బయట న్యాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ మేఘా ఆకాష్ ఓ కేసు విషయమై రవితేజ, ఫరియా అబ్దుల్లాను సంప్రదిస్తుంది. తన తండ్రి సంపత్ రాజ్‌పై పడిన హత్య అభియోగం వెనక నిజాలు వెలికితీసేందుకు వారి సాయం కోరుతుంది. అయితే మర్డర్స్ మాత్రం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఇలా వరుస హత్యలు చేస్తోంది ఎవరు?. మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి?. రవితేజకు హత్యలకు సంబంధం ఏంటి? రవితేజ ఎందుకు విలన్‌గా మారాడు? అనేది సినిమా కథాంశం.
ఎలా చేశారంటే:
ఈ సినిమాకు రవితేజ నటనే హైలెట్ అని చెప్పాలి. ఫస్టాఫ్‌లో కామెడి చేస్తూ నవ్వించే రవితేజ.. విలన్ షెడ్స్‌లో కనిపించి మెప్పిస్తాడు. రవితేజ చేసిన నెగిటివ్ రోల్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఆ పాత్ర ద్వారా విలన్‌గానూ ఆడియన్స్‌ను మెప్పించగలనని రవితేజ నిరూపించాడు. ఇక యువ హీరో సుశాంత్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర దక్కింది అనే చెప్పాలి. ఇందులో సుశాంత్ చాలా కొత్తగా కనిపిస్తాడు. తన నటనతో ఆడియన్స్‌ను మెప్పిస్తాడు. హీరోయిన్స్ గా నటించిన ఫైరా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ తమ పరిధిమేర బాగానే నటించారు. ఇక సంపత్, మురళి శర్మ, రావు రమేష్ నటన కూడా ఆకట్టుకుంటుంది.
టెక్నికల్‌గా:
ఈ సినిమాను డైరెక్టర్ సుధీర్‌వర్మ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. రవితేజ మార్క్ కామెడీని చూపిస్తూనే థ్రిల్లింగ్ అనుభూతిని కూడా పంచాడు. రవితేజలోని నటుడ్ని సుధీర్ చాాలా బాగా ఉపయోగించుకున్నాడు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు మరీ సాగదీసినట్లు అనిపిసిస్తుంది. ఇక విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. హర్షవర్ధన్, భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కొన్ని సీన్లు చాలా రిచ్‌గా అనిపించాయి.
ప్లస్ పాయింట్స్
రవితేజ యాక్టింగ్హీరోయిన్స్ గ్లామర్కథబ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
సినిమా ఫస్టాప్ సాగదీత సన్నివేశాలు
చివరిగా: వాల్తేరు వీరయ్య, ధమాాకా చిత్రాల తర్వాత రవితేజ నుంచి మరో డీసెంట్ మూవీ రావణాసుర అని చెప్పొచ్చు. ఈ వీకెండ్‌లో మంచి టైంపాస్ కావాలనుకునేవారికి రావణాసుర మంచి ఛాయిస్.
రేటింగ్: 2.75/5
ఏప్రిల్ 07 , 2023
Vikkatakavi Series OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ సిరీస్.. కారణం ఇదే!
యువ నటుడు నరేష్ అగస్త్య (Naresh Agasthya) 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. అతడు నటించిన లేటెస్ట్ సిరీస్ ‘వికటకవి’ సిరీస్ ఇటీవల ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించగా మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వికటకవి సిరీస్ ఓటీటీలో దుమ్మురేపుతోంది. రికార్డ్ వ్యూస్‌తో ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. వికటకవి సిరీస్ ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
జాతీయ స్థాయిలో ట్రెండింగ్..
‘వికటకవి’ (Vikkatakavi Web Series) సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee 5) స్ట్రీమింగ్‌కు తెచ్చింది. నవంబర్ 28 నుంచి తెలుగు సహా పలు దక్షిణాది భాషల్లో ప్రసారమవుతోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు విశేష స్పందన వస్తున్నట్లు ఓటీటీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పటివరకూ 150+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదైనట్లు తెలిపింది. ఈ మేరకు స్పెషల్ పోస్టుతో పాటు, చిన్న వీడియో క్లిప్‌ను సైతం ‘జీ 5’ వర్గాలు విడుదల చేశాయి. ప్రతీ ఒక్కరూ ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను వీక్షించాలని కోరాయి.
https://twitter.com/ZEE5Telugu/status/1866779619975893192
https://twitter.com/baraju_SuperHit/status/1866742687057187002
కారణం ఏంటంటే
దర్శకుడు ప్రదీప్ మద్దాలి (Pradeep Maddali) మిస్టరీ థ్రిల్లర్‌గా వికటకవి సిరీస్‌ను రూపొదించాడు. అమరగిరి ప్రాంతంలోని దేవతల గుట్టపైకి వెళ్తున్న వారంతా గతాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అన్న కాన్సెప్ట్‌తో ఆద్యాంతం ఆసక్తిగా సిరీస్‌ను నడిపించారు. కథ, కథనం విషయంలో ఎక్కడా పక్కదారి పట్టకుండా ఇంట్రస్టింగ్‌గా తీసుకెళ్లారు. డిటెక్టివ్ అయిన హీరో ఓ పోలీసు అధికారి సాయంతో ఈ మిస్టరీని కనుగునేందుకు చేసే ఇన్‌వేస్టిగేషన్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. గుట్టపైన అంతుచిక్కని రహస్యానికి సంబంధించి ఒక్కో చిక్కుముడిని విప్పిన విధానం మెస్మరైజ్ చేస్తుంది. దేవతల గుట్ట రహస్యం, కథనాయకుడు దాన్ని ఛేదించడం చూసిన తర్వాత ఒక థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్‌ను చూసిన భావన తప్పక కలుగుతుంది.
https://twitter.com/an18256761/status/1864704641541210416
అగస్త్య వన్‌మ్యాన్ షో
డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నటుడు నరేష్ ఆగస్త్య (Vikkatakavi Web Series) వన్ మ్యాన్‌షో చేశాడు. సెటిల్డ్ నటనతో అదరగొట్టాడు. లుక్స్, డైలాగ్స్ పరంగా ఎంతో పరిణితి సాధించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో పాత్రకు మంచి వెయిటేజ్ తీసుకొచ్చాడు. అటు సైకలాజి చదివిన యువతి పాత్రలో మేఘా ఆకాష్ (Megha Akash) ఆకట్టుకుంది. హావాభావాలను చక్కగా పలికించింది. రఘు కుంచె, షిజు అబ్దుల్ రషీద్, ముక్తార్ ఖాన్, అశోక్ కుమార్, అమిత్ తివారిలవి రెగ్యులర్ రోల్స్ అయినా కథలో సెట్ అయ్యాయి. తారక్ పొన్నప్ప చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు.
https://twitter.com/ZEE5Tamil/status/1862134559640531310
కథ ఇదే..
ఈ సిరీస్ 1970 కాలంలో సాగుతుంటుంది. రామకృష్ణ (నరేష్ అగస్త్య) ఫేమస్ డిటెక్టివ్. తన తెలివి తేటలతో ఎంతో సంక్లిష్టమైన కేసులను పరిష్కరిస్తుంటాడు. దీంతో పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసులు సైతం అతడి సాయం తీసుకుంటుంటారు. మరోవైపు అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. రామకృష్ణ డిటెక్టివ్ స్కిల్స్ గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్ దేవతల గుట్ట రహాస్యాన్ని కనుగొనాలని ఛాలెంజ్ చేస్తాడు. దీంతో దేవతల గుట్ట మీదకు వెళ్లిన రామకృష్ణ ఏం తెలుసుకున్నాడు?. అతడితో అమరగరి సంస్థాన రాజు మనవరాలు లక్ష్మీ (మేఘా ఆకాష్) ఎందుకు వెళ్లింది? వారిద్దరి పరిచయం ఎలా జరిగింది? ఇంతకీ ఆ శాపం ఏంటి? దానిని రామకృష్ణ పరిష్కరించాడా? లేదా? అన్నది స్టోరీ.
డిసెంబర్ 11 , 2024
ఈ వారం (April 03) థియేటర్లు, OTTలో సందడి చేసే సినిమాలు ఇవే..!
సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9 మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు:
రావణాసుర:
మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం ఈ వారంలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ శుక్రవారం (ఏప్రిల్ 7) థియేటర్లలో రచ్చ రచ్చ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సినిమా పోస్టర్లు ఈ చిత్రంపై భారీగా అంచనాలను పెంచేశాయి. రవితేజ సైతం ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఎంతో ధీమాగా ఉన్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్ నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమస్ సిసిరోలియో సంగీతం ఇచ్చారు.
మీటర్:
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘మీటర్’ చిత్రం కూడా ఈ శుక్రవారమే (ఏప్రిల్ 7) థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనుంది. కామెడీ, యాక్షన్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మీటర్ అలరించనుంది. రమేష్ కడూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో అతూల్య రవి హీరోయిన్‌గా చేసింది. పోసాని కృష్ణ మురళి, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషించారు. సాయికార్తిక్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
గుమ్రా:
ఆదిత్య ఠాకూర్, సీతారామం ఫేమ్ మృణాల్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ గుమ్రా శుక్రవారం రిలీజ్ అవుతోంది. వర్ధన్ కేట్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా అలరించనుంది. తమిళ హిట్ చిత్రం తడంకు రీమేక్‌గా ఈ చిత్రం తెరక్కెక్కింది. ఇందులో మృణాల్ పోలీసు ఆఫీసర్‌గా నటించింది. కాగా ఈ సినిమా రామ్ హీరోగా రెడ్ పేరుతో తెలుగు రిలీజ్‌అయింది.
ఛిప్‌కలి:
ఈ వారం మరో బాలీవుడ్ ఛిప్‌కలి కూడా థియేటర్లలో రిలీజ్ కానుంది. కౌషిక్ కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా శుక్రవారం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమైంది. నటులు యాష్‌పాల్ శర్మ, యోగేష్ భరద్వాజ్, తనిస్తా బిస్వాస్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మర్డర్ చుట్టూ సినిమా కథ తిరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.
వీరం:
కన్నడ మూవీ వీరం సైతం ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. కుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో ప్రజ్వాల్ దేవరాజ్, శ్రీనగర కిట్టీ, రిచిత రామ్, దీపక్, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వీరం రాబోతోంది.
ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్
అసలు:
నటి పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అసలు చిత్రం ఏప్రిల్ 5 బుధవారం రోజున ఓటీటీలోకి రాబోతోంది. రవిబాబు డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. అసలు కథేంటి? అసలు సినిమా దేని గురించి? అసలు ఎక్కడ చూడాలి? అని ఈటీవీ విన్ తన ట్విటర్ ఖాతాలో హైప్ క్రియేట్ చేసింది.
యాంట్ మాన్ అండ్ ది వాస్ప్ క్వాంటుమేనియా:
ఈ మూవీ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. యానిమేటెడ్ సైంటిఫిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ మూవీని నిర్మించారు. ఇందులో పాల్ పాల్ రూడ్, ఎవాంజెలిన్ లిల్లీ, జోనాథన్ మేజర్స్ వంటి స్టార్ క్యాస్ట్ నటించింది.
ఫ్లాట్‌ఫామ్ వారీగా ఓటీటీ విడుదలలు…
TitleCategoryLanguagePlatformRelease DateThe Crossoverseries EnglishDisney+ HotstarApril 5Tiny Beautiful Thingsseries EnglishDisney+ HotstarApril 07Redefined: J.R. Smith TV seriesenglishAmazon PrimeApril 4Bros (2022)movieenglishAmazon PrimeApril 4Lizzy Hoo: Hoo Cares!? (2023)movieenglishAmazon PrimeApril 4On a Wing and a Prayer (2023)MovieHindiAmazon PrimeApril 7Gangs of Lagos (2023)MovieEnglishAmazon PrimeApril 7Magic MixiesSeriesEnglishNetflixApril 03“Surviving R. Kelly: Part III: The Final ChapterSeriesEnglishNetflixApril 03Mo’Nique: My Name Is Mo’NiqueSeriesEnglishNetflixApril 04BeefSeriesEnglishNetflixApril 06The Last StandMovieEnglishNetflixApril 06On a Wing and a Prayer (2023)MovieEnglishNetflixApril 06Thicker Than WaterSeriesEnglishNetflixApril 07TransatlanticSeriesEnglishNetflixApril 07ChupaMovieEnglishNetflixApril 07Oh BelindaMovieEnglishNetflixApril 07Holy SpiderMovieEnglishNetflixApril 07HungerMovieEnglishNetflixApril 08The Lady in DignityMovieMovieMX PlayerApril 05My Debate Opponent Season 2 SeriesEnglishMX PlayerApril 08The Song of GloryMovieMovieMX PlayerApril 12
ఏప్రిల్ 03 , 2023

చల్ మోహన్ రంగ.
డ్రామా , రొమాన్స్
28 నవంబర్ 2024 న విడుదలైంది

రాజ రాజ చోర
హాస్యం , క్రైమ్
09 ఆగస్టు 2024 న విడుదలైంది

వికటకవి
28 నవంబర్ 2024 న విడుదలైంది

తూఫాన్
09 ఆగస్టు 2024 న విడుదలైంది

సబా నాయగన్
22 డిసెంబర్ 2023 న విడుదలైంది

మను చరిత్ర
23 జూన్ 2023 న విడుదలైంది
.jpeg)
భూ
27 మే 2023 న విడుదలైంది
.jpeg)
రావణాసుర
07 ఏప్రిల్ 2023 న విడుదలైంది

ప్రేమ దేశం
03 ఫిబ్రవరి 2023 న విడుదలైంది

గుర్తుందా శీతాకాలం
09 డిసెంబర్ 2022 న విడుదలైంది

డియర్ మేఘా
03 సెప్టెంబర్ 2021 న విడుదలైంది

రాజ రాజ చోర
19 ఆగస్టు 2021 న విడుదలైంది

తూటా
19 నవంబర్ 2019 న విడుదలైంది
.jpeg)
పేట
10 జనవరి 2019 న విడుదలైంది
మేఘా ఆకాష్ తల్లిదండ్రులు ఎవరు?
ఆకాష్ రాజా, బిందు
మేఘా ఆకాష్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
మేఘా ఆకాష్ తండ్రి ఆకాష్ రాజా తెలుగు వారు కాగా తల్లి బిందు ఆకాష్ తమిళ మహిళ.అడ్వర్‌టైజింగ్ ఫీల్డ్‌లో ఉండగా వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు.
మేఘా ఆకాష్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
మేఘాకు ఓ సోదరి ఉంది. ఆమె పేరు పూజా
మేఘా ఆకాష్ పెళ్లి ఎప్పుడు అయింది?
సుదీర్ఘకాలం డేటింగ్‌లో ఉన్న మెఘా ఆకాష్ తన బాయ్ ఫ్రెండ్ సాయి విష్ణుతో నిశ్చితార్థం చేసుకుంది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు.
మేఘా ఆకాష్ Family Pictures
మేఘా ఆకాష్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
ఛల్ మోహన్ రంగ సినిమాతో పాపులర్ అయ్యింది.
మేఘా ఆకాష్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
లై(Lie)
తెలుగులో మేఘా ఆకాష్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
మేఘా ఆకాష్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
డియర్ మేఘా సినిమాలో మేఘా స్వరూప్ పాత్ర.
మేఘా ఆకాష్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
మేఘా ఆకాష్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
మేఘా ఆకాష్ రెమ్యూనరేషన్ ఎంత?
ఒక్కో సినిమాకు రూ.కోటీ వరకూ తీసుకుంటోంది.
మేఘా ఆకాష్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
ఐస్‌క్రీమ్స్, చాక్‌లేట్స్, ఇండియన్ ఫుడ్
మేఘా ఆకాష్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
మేఘా ఆకాష్ కు ఇష్టమైన నటి ఎవరు?
మేఘా ఆకాష్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
హిందీ, ఇంగ్లీషు, తెలుగు
మేఘా ఆకాష్ ఫేవరేట్ కలర్ ఏంటి?
తెలుపు, ఎరుపు
మేఘా ఆకాష్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
మేఘా ఆకాష్ ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
ఎం.ఎస్. ధోని
మేఘా ఆకాష్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
ఆస్ట్రేలియా
మేఘా ఆకాష్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
మేఘా ఆస్తుల విలువ రూ.28 కోట్ల వరకూ ఉంటుంది.
మేఘా ఆకాష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
4 మిలియన్లు
మేఘా ఆకాష్ సోషల్ మీడియా లింక్స్
మేఘా ఆకాష్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
ఎడిసన్ అవార్డ్ - 2019
రీజనింగ్ ప్రిన్సెస్ ఆఫ్ కోలీవుడ్‌గా ఎడిసన్ అవార్డ్ అందుకుంది.
మేఘా ఆకాష్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
వికేర్ హెయిర్ రిమూవల్ ఆయిల్ ప్రకటనలో మేఘా నటించింది.
మేఘా ఆకాష్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే మేఘా ఆకాష్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.