• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ వారం (April 03) థియేటర్లు, OTTలో సందడి చేసే సినిమాలు ఇవే..!

    సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏప్రిల్‌ 3 నుంచి ఏప్రిల్‌ 9 మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

    థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు:

    రావణాసుర:

    మాస్‌ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం ఈ వారంలోనే థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 7) థియేటర్లలో రచ్చ రచ్చ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్, టీజర్‌, సినిమా పోస్టర్లు ఈ చిత్రంపై భారీగా అంచనాలను పెంచేశాయి. రవితేజ సైతం ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఎంతో ధీమాగా ఉన్నారు. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమస్ సిసిరోలియో సంగీతం ఇచ్చారు. 

    మీటర్‌:

    యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘మీటర్‌’ చిత్రం కూడా ఈ శుక్రవారమే (ఏప్రిల్‌ 7) థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనుంది.  కామెడీ, యాక్షన్‌తో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా మీటర్‌ అలరించనుంది. రమేష్‌ కడూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో అతూల్య రవి హీరోయిన్‌గా చేసింది. పోసాని కృష్ణ మురళి, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషించారు. సాయికార్తిక్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు. 

    గుమ్రా:

    ఆదిత్య ఠాకూర్‌, సీతారామం ఫేమ్‌ మృణాల్‌ జంటగా నటించిన బాలీవుడ్‌ మూవీ గుమ్రా శుక్రవారం రిలీజ్ అవుతోంది. వర్ధన్‌ కేట్కర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా అలరించనుంది. తమిళ హిట్‌ చిత్రం తడంకు రీమేక్‌గా ఈ చిత్రం తెరక్కెక్కింది. ఇందులో మృణాల్‌ పోలీసు ఆఫీసర్‌గా నటించింది. కాగా ఈ సినిమా రామ్‌ హీరోగా రెడ్‌ పేరుతో తెలుగు రిలీజ్‌అయింది. 

    ఛిప్‌కలి:

    ఈ వారం మరో బాలీవుడ్‌ ఛిప్‌కలి కూడా థియేటర్లలో రిలీజ్ కానుంది. కౌషిక్‌ కర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా కూడా శుక్రవారం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమైంది. నటులు యాష్‌పాల్‌ శర్మ, యోగేష్‌ భరద్వాజ్‌, తనిస్తా బిస్వాస్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మర్డర్‌ చుట్టూ సినిమా కథ తిరుగుతుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. 

    వీరం:

    కన్నడ మూవీ వీరం సైతం ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. కుమార్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో ప్రజ్వాల్‌ దేవరాజ్‌, శ్రీనగర కిట్టీ, రిచిత రామ్‌, దీపక్‌, అచ్యుత్‌ కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వీరం రాబోతోంది.

    ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్

    అసలు:

    నటి పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అసలు చిత్రం ఏప్రిల్‌ 5 బుధవారం రోజున ఓటీటీలోకి రాబోతోంది. రవిబాబు డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. అసలు కథేంటి? అసలు సినిమా దేని గురించి? అసలు ఎక్కడ చూడాలి? అని ఈటీవీ విన్‌ తన ట్విటర్ ఖాతాలో హైప్‌ క్రియేట్ చేసింది. 

    యాంట్‌ మాన్‌ అండ్‌ ది వాస్ప్‌ క్వాంటుమేనియా:

    ఈ మూవీ హాట్‌స్టార్‌లో ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది. యానిమేటెడ్‌ సైంటిఫిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ మూవీని నిర్మించారు. ఇందులో పాల్‌ పాల్ రూడ్, ఎవాంజెలిన్ లిల్లీ, జోనాథన్ మేజర్స్ వంటి స్టార్‌ క్యాస్ట్ నటించింది. 

    ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు… 

    TitleCategoryLanguagePlatformRelease Date
    The Crossoverseries EnglishDisney+ HotstarApril 5
    Tiny Beautiful Thingsseries EnglishDisney+ HotstarApril 07
    Redefined: J.R. Smith TV seriesenglishAmazon PrimeApril 4
    Bros (2022)movieenglishAmazon PrimeApril 4
    Lizzy Hoo: Hoo Cares!? (2023)movieenglishAmazon PrimeApril 4
    On a Wing and a Prayer (2023)MovieHindiAmazon PrimeApril 7
    Gangs of Lagos (2023)MovieEnglishAmazon PrimeApril 7
    Magic MixiesSeriesEnglishNetflixApril 03
    “Surviving R. Kelly: Part III: The Final ChapterSeriesEnglishNetflixApril 03
    Mo’Nique: My Name Is Mo’NiqueSeriesEnglishNetflixApril 04
    BeefSeriesEnglishNetflixApril 06
    The Last StandMovieEnglishNetflixApril 06
    On a Wing and a Prayer (2023)MovieEnglishNetflixApril 06
    Thicker Than WaterSeriesEnglishNetflixApril 07
    TransatlanticSeriesEnglishNetflixApril 07
    ChupaMovieEnglishNetflixApril 07
    Oh BelindaMovieEnglishNetflixApril 07
    Holy SpiderMovieEnglishNetflixApril 07
    HungerMovieEnglishNetflixApril 08
    The Lady in DignityMovieMovieMX PlayerApril 05
    My Debate Opponent Season 2 SeriesEnglishMX PlayerApril 08
    The Song of GloryMovieMovieMX PlayerApril 12

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv