నటీనటులు: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, షిజు మీనన్, తారక్ పొన్నప్ప, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్ తదితరులు
దర్శకుడు: ప్రదీప్ మద్దాలి
సంగీత దర్శకుడు: అజయ్ అరసాడా
సినిమాటోగ్రఫీ: షోయెబ్ సిద్దికీ
ఎడిటర్: సాయి బాబు తలారి
నిర్మాత : రజని తాళ్లూరి
ఓటీటీ వేదిక : జీ 5
యువ నటుడు నరేష్ అగస్త్య (Naresh Agastya) ‘మత్తు వదలరా‘, ‘సేనాపతి‘, ‘పంచతంత్రం‘ చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటెస్ట్ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Vikkatakavi Web Series Review)
కథేంటి
ఈ సిరీస్ 1970 కాలంలో సాగుతుంటుంది. రామకృష్ణ (నరేష్ అగస్త్య) ఫేమస్ డిటెక్టివ్. తన తెలివి తేటలతో ఎంతో సంక్లిష్టమైన కేసులను పరిష్కరిస్తుంటాడు. దీంతో పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసులు సైతం అతడి సాయం తీసుకుంటుంటారు. మరోవైపు అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. రామకృష్ణ డిటెక్టివ్ స్కిల్స్ గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్ దేవతల గుట్ట రహాస్యాన్ని కనుగొనాలని ఛాలెంజ్ చేస్తాడు. దీంతో దేవతల గుట్ట మీదకు వెళ్లిన రామకృష్ణ ఏం తెలుసుకున్నాడు?. అతడితో అమరగరి సంస్థాన రాజు మనవరాలు లక్ష్మీ (మేఘా ఆకాష్) ఎందుకు వెళ్లింది? వారిద్దరి పరిచయం ఎలా జరిగింది? ఇంతకీ ఆ శాపం ఏంటి? దానిని రామకృష్ణ పరిష్కరించాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేష్ ఆగస్త్య (Vikkatakavi Web Series Review) ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ నటనతో అదరగొట్టాడు. లుక్స్, డైలాగ్స్ పరంగా ఎంతో పరిణితి సాధించాడని చెప్పవచ్చు. తన బాడీ లాంగ్వేజ్‌తో పాత్రకు మంచి వెయిటేజ్ తీసుకొచ్చాడు. మేఘా ఆకాష్ (Megha Akash) నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే కనిపించింది. హావాభావాలను చక్కగా పలికించింది. రఘు కుంచె, షిజు అబ్దుల్ రషీద్, ముక్తార్ ఖాన్, అశోక్ కుమార్, అమిత్ తివారిలవి రెగ్యులర్ రోల్స్ అయినా కథలో సెట్ అయ్యాయి. తారక్ పొన్నప్ప చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అతడి స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది. ఏ దశలోనూ కథ నుంచి డివియేట్ కాకుండా మెప్పించాడు. కథలోని ప్రతీ పాత్రకు ఓ పర్పస్ ఉండటం, ఆ క్యారెక్టర్లను డిజైన్ చేసిన విధానం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. కథకు సంబంధించి హింట్స్ ఇస్తూనే ఇంట్రస్ట్ క్రియేట్ చేశారు. ట్విస్టులు కాస్త ఊహించే విధంగానే ఉన్నప్పటికీ ఎంగేజింగ్‌గా అనిపిస్తాయి. అయితే కొన్ని సన్నివేశాలను ఇంకాస్త బలంగా చూపించే అవకాశమున్నప్పటికీ దర్శకుడు వినియోగించుకోలేకపోయాడు. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగదీతగా అనిపించిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని ఎలివేషన్స్ షాట్స్ కూడా బెటర్‌గా తీసి ఉంటే సిరీస్ నెక్స్ట్ లెవల్లో ఉండేదని చెప్పవచ్చు. ఊహాజనితంగా సాగడం కూడా ఇంకో మైసన్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా..
ఈ సిరీస్‌కు టెక్నికల్ విభాగాలు (Vikatakavi Web Series Review) అన్నీ మంచి పనితీరు కనబరిచాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కావడంతో అప్పటి సెటప్, డ్రెస్సింగ్ స్టైల్‌ను ఆర్ట్ డిపార్ట్‌మెంట్ బాగా తీర్చిదిద్దింది. సినిమాటోగ్రాఫీ కూడా వెనకటి కాలానికి తీసుకెళ్లేలా ఉంది. నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- కథ, కథనం
- నరేష్ అగస్త్య నటన
- ట్విస్టులు
మైనస్ పాయింట్స్
- ఊహాజనితంగా ఉండటం
- కొన్ని సాగదీత సన్నివేశాలు
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!