నటీనటులు: రవితేజ, దక్ష నగర్కర్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, సుశాంత్, సంపత్, మురళి శర్మ, రావు రమేష్
దర్శకుడు: సుధీర్ వర్మ
రచయిత: శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం భారీ అంచనాలతో ఇవాళ ( ఏప్రిల్ 7) థియేటర్లలో విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో నటించిన రవితేజ.. ధమాకా చిత్రం ద్వారా భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అదే ఉత్సాహంతో రావణుసుర చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటివరకు రవితేజ చేసిన సినిమాల్లో కెల్లా రావణసుర ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఇందులో రవితేజ విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, ట్రైలర్, టీజర్ ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో రావణసుర చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రవితేజకు మరో హిట్ తెచ్చిపెట్టిందా? అసలు సినిమా స్టోరీ ఏంటి? విలన్‌గా రవితేజ నటనకు ఎన్ని మార్కులు పడ్డాయి? వంటి ప్రశ్నలకు ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం.
కథ ఏంటంటే:
రావణసుర కథలోకి వెళితే… ఫరియా అబ్దుల్లా దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్ లాయర్‌గా పనిచేస్తుంటాడు. కోర్టులో న్యాయం జరగకపోతే బాధితులకు బయట న్యాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ మేఘా ఆకాష్ ఓ కేసు విషయమై రవితేజ, ఫరియా అబ్దుల్లాను సంప్రదిస్తుంది. తన తండ్రి సంపత్ రాజ్‌పై పడిన హత్య అభియోగం వెనక నిజాలు వెలికితీసేందుకు వారి సాయం కోరుతుంది. అయితే మర్డర్స్ మాత్రం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఇలా వరుస హత్యలు చేస్తోంది ఎవరు?. మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి?. రవితేజకు హత్యలకు సంబంధం ఏంటి? రవితేజ ఎందుకు విలన్‌గా మారాడు? అనేది సినిమా కథాంశం.
ఎలా చేశారంటే:
ఈ సినిమాకు రవితేజ నటనే హైలెట్ అని చెప్పాలి. ఫస్టాఫ్‌లో కామెడి చేస్తూ నవ్వించే రవితేజ.. విలన్ షెడ్స్‌లో కనిపించి మెప్పిస్తాడు. రవితేజ చేసిన నెగిటివ్ రోల్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఆ పాత్ర ద్వారా విలన్‌గానూ ఆడియన్స్‌ను మెప్పించగలనని రవితేజ నిరూపించాడు. ఇక యువ హీరో సుశాంత్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర దక్కింది అనే చెప్పాలి. ఇందులో సుశాంత్ చాలా కొత్తగా కనిపిస్తాడు. తన నటనతో ఆడియన్స్‌ను మెప్పిస్తాడు. హీరోయిన్స్ గా నటించిన ఫైరా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ తమ పరిధిమేర బాగానే నటించారు. ఇక సంపత్, మురళి శర్మ, రావు రమేష్ నటన కూడా ఆకట్టుకుంటుంది.
టెక్నికల్‌గా:
ఈ సినిమాను డైరెక్టర్ సుధీర్‌వర్మ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. రవితేజ మార్క్ కామెడీని చూపిస్తూనే థ్రిల్లింగ్ అనుభూతిని కూడా పంచాడు. రవితేజలోని నటుడ్ని సుధీర్ చాాలా బాగా ఉపయోగించుకున్నాడు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు మరీ సాగదీసినట్లు అనిపిసిస్తుంది. ఇక విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. హర్షవర్ధన్, భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కొన్ని సీన్లు చాలా రిచ్‌గా అనిపించాయి.
ప్లస్ పాయింట్స్
- రవితేజ యాక్టింగ్
- హీరోయిన్స్ గ్లామర్
- కథ
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
- సినిమా ఫస్టాప్
- సాగదీత సన్నివేశాలు
చివరిగా: వాల్తేరు వీరయ్య, ధమాాకా చిత్రాల తర్వాత రవితేజ నుంచి మరో డీసెంట్ మూవీ రావణాసుర అని చెప్పొచ్చు. ఈ వీకెండ్‌లో మంచి టైంపాస్ కావాలనుకునేవారికి రావణాసుర మంచి ఛాయిస్.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..