• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vikkatakavi Series OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్‌ సిరీస్‌.. కారణం ఇదే! 

    యువ నటుడు నరేష్‌ అగస్త్య (Naresh Agasthya) ‘మత్తు వదలరా’, ‘సేనాపతి’, ‘పంచతంత్రం’ చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. అతడు నటించిన లేటెస్ట్‌ సిరీస్ ‘వికటకవి’ సిరీస్‌ ఇటీవల ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించగా మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వికటకవి సిరీస్‌ ఓటీటీలో దుమ్మురేపుతోంది. రికార్డ్‌ వ్యూస్‌తో ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. వికటకవి సిరీస్‌ ఈ స్థాయిలో సక్సెస్‌ కావడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌..

    ‘వికటకవి’ (Vikkatakavi Web Series) సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee 5) స్ట్రీమింగ్‌కు తెచ్చింది. నవంబర్‌ 28 నుంచి తెలుగు సహా పలు దక్షిణాది భాషల్లో ప్రసారమవుతోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు విశేష స్పందన వస్తున్నట్లు ఓటీటీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పటివరకూ 150+ మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌ నమోదైనట్లు తెలిపింది. ఈ మేరకు స్పెషల్‌ పోస్టుతో పాటు, చిన్న వీడియో క్లిప్‌ను సైతం ‘జీ 5’ వర్గాలు విడుదల చేశాయి. ప్రతీ ఒక్కరూ ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను వీక్షించాలని కోరాయి. 

    కారణం ఏంటంటే

    దర్శకుడు ప్రదీప్‌ మద్దాలి (Pradeep Maddali) మిస్టరీ థ్రిల్లర్‌గా వికటకవి సిరీస్‌ను రూపొదించాడు. అమరగిరి ప్రాంతంలోని దేవతల గుట్టపైకి వెళ్తున్న వారంతా గతాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అన్న కాన్సెప్ట్‌తో ఆద్యాంతం ఆసక్తిగా సిరీస్‌ను నడిపించారు. కథ, కథనం విషయంలో ఎక్కడా పక్కదారి పట్టకుండా ఇంట్రస్టింగ్‌గా తీసుకెళ్లారు. డిటెక్టివ్‌ అయిన హీరో ఓ పోలీసు అధికారి సాయంతో ఈ మిస్టరీని కనుగునేందుకు చేసే ఇన్‌వేస్టిగేషన్‌ ఆసక్తికరంగా అనిపిస్తుంది. గుట్టపైన అంతుచిక్కని రహస్యానికి సంబంధించి ఒక్కో చిక్కుముడిని విప్పిన విధానం మెస్మరైజ్‌ చేస్తుంది. దేవతల గుట్ట రహస్యం, కథనాయకుడు దాన్ని ఛేదించడం చూసిన తర్వాత ఒక థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ను చూసిన భావన తప్పక కలుగుతుంది.

    అగస్త్య వన్‌మ్యాన్‌ షో

    డిటెక్టివ్‌ రామకృష్ణ పాత్రలో నటుడు నరేష్ ఆగస్త్య (Vikkatakavi Web Series) వన్‌ మ్యాన్‌షో చేశాడు. సెటిల్డ్‌ నటనతో అదరగొట్టాడు. లుక్స్‌, డైలాగ్స్‌ పరంగా ఎంతో పరిణితి సాధించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో పాత్రకు మంచి వెయిటేజ్‌ తీసుకొచ్చాడు. అటు సైకలాజి చదివిన యువతి పాత్రలో మేఘా ఆకాష్‌ (Megha Akash) ఆకట్టుకుంది. హావాభావాలను చక్కగా పలికించింది. రఘు కుంచె, షిజు అబ్దుల్ రషీద్, ముక్తార్ ఖాన్, అశోక్ కుమార్, అమిత్ తివారిలవి రెగ్యులర్ రోల్స్ అయినా కథలో సెట్ అయ్యాయి. తారక్ పొన్నప్ప చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. 

    కథ ఇదే..

    ఈ సిరీస్‌ 1970 కాలంలో సాగుతుంటుంది. రామకృష్ణ (నరేష్‌ అగస్త్య) ఫేమస్‌ డిటెక్టివ్‌. తన తెలివి తేటలతో ఎంతో సంక్లిష్టమైన కేసులను పరిష్కరిస్తుంటాడు. దీంతో పెండింగ్‌ కేసుల పరిష్కారానికి పోలీసులు సైతం అతడి సాయం తీసుకుంటుంటారు. మరోవైపు అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. రామకృష్ణ డిటెక్టివ్‌ స్కిల్స్‌ గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్‌ దేవతల గుట్ట రహాస్యాన్ని కనుగొనాలని ఛాలెంజ్‌ చేస్తాడు. దీంతో దేవతల గుట్ట మీదకు వెళ్లిన రామకృష్ణ ఏం తెలుసుకున్నాడు?. అతడితో అమరగరి సంస్థాన రాజు మనవరాలు లక్ష్మీ (మేఘా ఆకాష్‌) ఎందుకు వెళ్లింది? వారిద్దరి పరిచయం ఎలా జరిగింది? ఇంతకీ ఆ శాపం ఏంటి? దానిని రామకృష్ణ పరిష్కరించాడా? లేదా? అన్నది స్టోరీ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv