• TFIDB EN
  • రాజా రవీందర్
    జననం : ఏప్రిల్ 18 , 1968
    ప్రదేశం: భీమవరం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    రాజా రవీంద్ర టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు. 1970 సెప్టెంబర్‌ 19న జన్మించారు. 'యముడికి మెుగుడు' (1988) చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశారు. పెదరాయుడు (1995) సినిమాలో మోహన్‌బాబుకు సోదరుడిగా నటించి పాపులర్ అయ్యారు. విలన్‌గా, హీరో ఫ్రెండ్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా 350 పైగా చిత్రాల్లో రాజా రవీంద్ర నటించారు.

    రాజా రవీందర్ వయసు ఎంత?

    రాజా రవీంద్ర 57 సంవత్సరాలు

    రాజా రవీందర్ ముద్దు పేరు ఏంటి?

    రాజా

    రాజా రవీందర్ ఎత్తు ఎంత?

    5' 5'' (167 cm)

    రాజా రవీందర్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, జిమ్‌

    రాజా రవీందర్ ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేట్‌

    రాజా రవీందర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    కెరీర్‌ ప్రారంభంలో పలువురు హీరో హీరోయిన్లకు మేనేజర్‌గా పనిచేసారు. వారి షూటింగ్‌ షెడ్యూల్స్‌కు సంబంధించి డేట్స్‌ చూసేవారు.

    రాజా రవీందర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    రాజా రవీందర్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    విలన్‌గా, హీరో ఫ్రెండ్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా 350పైగా చిత్రాల్లో నటించారు.

    రాజా రవీందర్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    వెబ్‌ సిరీస్‌లు చేయలేదు. కానీ, 'వసుంధర', 'ఎఫ్‌ఐఆర్‌', 'కృష్ణదాసి', 'జానకి కలగనలేదు' వంటి సీరియల్స్‌లో నటించారు.

    రాజా రవీందర్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Raja Raveendar

    <strong>Thiragabadara Saami Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ - మాల్వీ మల్హోత్ర చిత్రం ఎలా ఉందంటే?</strong>
    Thiragabadara Saami Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ - మాల్వీ మల్హోత్ర చిత్రం ఎలా ఉందంటే? నటీనటులు : రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా, అంకిత ఠాకూర్‌, మకరంద్‌ దేశ్‌పాండే, ప్రగతి, రాజా రవీంద్ర, జాన్‌ విజయ్‌, పృథ్వీ, తాగుబోతు రమేష్‌ తదితరులు డైరెక్టర్‌ : ఏ.ఎస్‌. రవి కుమార్‌ సంగీతం : జేబీ సినిమాటోగ్రఫీ : జవహర్‌ రెడ్డి నిర్మాత : మాల్కాపురం శివ కుమార్‌ విడుదల తేదీ : ఆగస్టు 2, 2024 యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ నటించిన లేటెస్ట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘తిరగబడరా సామి’ (Thiragabadara Saami Movie Review). ఏ.ఎస్‌ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra), మన్నారా చోప్రా (Mannara Chopra) హీరోయిన్లుగా చేశారు. మకరంద్‌ దేశ్‌పాండే, రాజా రవీంద్ర, ప్రగతి ఇతర ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా హీరో హీరోయిన్లుగా చేసిన రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రపై సంచలన ఆరోపణలు వచ్చాయి. రాజ్‌తరుణ్‌ తనను మోసం చేసి మాల్వీతో రిలేషన్‌లో ఉన్నట్లు అతడి మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే ఆగస్టు 2న ‘తిరగబడరా సామి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గిరి (రాజ్ తరుణ్) చాలా పిరికివాడు. ప్రతి దానికి భయపడుతూ చుట్టూ ఏం జరుగుతున్నా అసలు పట్టించుకోడు. కానీ శైలజా (మాల్వీ మల్హోత్ర) అలా కాదు. చాలా దూకుడుతో వైలెంట్‌గా ఉంటుంది. టీజ్‌ చేసిన వారిని ఇరగ దీస్తుంటుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. అయితే శైలజాను కంట్రోల్‌ చేయలేక గిరి ఎలాంటి తిప్పలు పడ్డాడు? వారి ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి? ఎప్పుడు సౌమ్యంగా ఉండే గిరి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? తన ప్రేమను గెలిపించుకునేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే హీరో రాజ్‌ తరుణ్‌ గిరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తొలుత అమాయకుడిగా, ఆపై ప్రేయసి కోసం శత్రువులపై తిరగబడే ప్రియుడిగా రెండు డైమన్షన్లలో మంచి నటన కనబరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో రాజ్‌ దుమ్మురేపాడు. ఈ స్థాయి యాక్షన్‌ సీన్స్‌ అతడు ఇప్పటివరకూ చేయలేదు. ఇక శైలజా పాత్రలో హీరోయిన్‌ మాల్వీ మల్హోత్ర ఒదిగిపోయింది. తెలుగులో ఆమెకు ఇది తొలి సినిమానే అయిన్పప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. స్క్రీన్‌పై రాజ్‌ తరుణ్‌ - మాల్వీ మల్హోత్ర కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. సెకండ్‌ హీరోయిన్ మన్నారా చోప్రా కూడా అద్భుతంగా నటించింది. ఇక జాన్‌ విజయ్‌, రఘుబాబు, అంకిత ఠాకూర్‌, ప్రగతి, రాజా రవీంద్ర తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు ఏ.ఎస్‌ రవికుమార్ ఈ చిత్రాన్ని లవ్‌ &amp; యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. తొలి భాగం మెుత్తం హీరో-హీరోయిన్‌ పరిచయం, వారి లవ్‌ ట్రాక్‌తో సాగిపోయింది. గిరిని శైలజా డామినేట్‌ చేసే క్రమంలో వచ్చే హాస్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదరడంతో ఫస్టాఫ్‌ ఎక్కడా బోర్‌ లేకుండా వెళ్లిపోతుంది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచారు డైరెక్టర్‌. రెండో భాగాన్ని హీరో ఎలివేషన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌తో పూర్తిగా నింపేశారు. రాజ్‌ తరుణ్‌ను ఎన్నో మాస్‌ యాంగిల్స్‌లో చూపించి డైరెక్టర్‌ ఆకట్టుకున్నారు. అయితే అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని ఫైట్స్‌ రాజ్‌తరుణ్‌ కటౌట్‌కు మించి ఉండటంతో లాజికల్‌గా కనెక్ట్‌ కాలేము. భావోద్వేగ సన్నివేశాలు సైతం పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఒక మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను కోరుకునేవారికి 'తిరబడరా సామి' నచ్చుతుంది.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే జేబీ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను బీజీఎం మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే పాటలు గుర్తుంచుకునేలా లేవు. అటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ రాజ్‌తరుణ్‌ నటనలవ్‌ ట్రాక్‌యాక్షన్‌ సీక్వెన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ వర్కౌట్‌ కాని ఎమోషన్స్‌కొన్ని బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 02 , 2024
    Mr.Pregnent Review: మిస్టర్ ప్రెగ్నెంట్ డెలివర్ చేసిన మెసేజ్ ఏంటి? నటీనటులు: సొహైల్, రూప కొడవయూర్, సుహాసిని, వైవా హర్ష, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, అభిషేక్.&nbsp; దర్శకుడు: శ్రీనివాస్ వింజనంపాటి&nbsp; నిర్మాత: అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి&nbsp; సంగీతం: శ్రవణ్ భరద్వాజ్&nbsp;&nbsp; బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం(Aug 18) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సంగీతం ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. ఇటీవల 200 మంది గర్భిణులకు ప్రత్యేకంగా సినిమా స్క్రీనింగ్ చేయించడంతో ప్రేక్షకుల చూపు మూవీపై పడింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? థియేటర్లలో ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనేది రివ్యూలో చూద్దాం.&nbsp; కథ గౌతమ్ (సొహైల్) అనాథ. అతడికి పిల్లలంటే ఇష్టముండదు. సిటీలో టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు. వృత్తి పరంగా ఉన్నత స్థానంలో ఉంటాడు గౌతమ్. మంచి డిమాండ్ ఉన్న టాటూ ఆర్టిస్ట్. తన స్నేహితులందరూ కుళ్లుకునేంత టాలెంట్ &amp; ఫేమ్ ఉన్న గౌతమ్‌ను మహి (రూప కొడవయూర్) గాడంగా ప్రేమిస్తుంది. మొదట్లో ఆమె ప్రేమను నిరాకరించిన గౌతమ్.. ఆమె ప్రేమలోని నిజాయితీని అర్ధం చేసుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ, పిల్లలు వద్దని చెబుతాడు. ఈ క్రమంలో మహి గర్భం దాల్చిన విషయం తెలుస్తుంది. అయితే, బిడ్డ తన కడుపులో పెరగాలని డిసైడ్ అయ్యి గర్భాన్ని తనకు మార్పిడి చేసుకుంటాడు గౌతమ్. మరి, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆ తర్వాత ఏమైందనేది మిగతా కథ. https://twitter.com/RyanSohel/status/1691410954377220096?s=20 ఎలా ఉందంటే? పురుషుడు గర్భం దాల్చవచ్చా? దాలిస్తే ఎలా ఉంటుందన్న కథాంశం ఆసక్తిని రేపింది. ఈ పాయింట్‌తోనే సినిమా చూడాలనిపిస్తుంది. కాకపోతే, మూవీలో అసలు విషయం దగ్గరికి రావడానికి కాస్త సమయం పడుతుంది. కథానాయకుడి పరిచయ సన్నివేశాలు, లవ్ ట్రాక్, ఇరికించినట్లుగా అనిపించే కామెడీ ఫస్టాఫ్‌ని బోర్ కొట్టిస్తాయి. కానీ, సొహైల్ నిర్ణయం తర్వాత సినిమా ఆసక్తికరంగా మారింది. సెకండాఫ్‌లో ఎమోషన్ సీన్స్ బాగా పండాయి. గర్భం దాల్చాక ఒకరి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎమోషనల్ కనెక్టివిటీతో చూపించడం ప్రేక్షకుడికి నచ్చుతుంది. గర్భం చుట్టూ జరిగే కామెడీ నవ్వు పుట్టిస్తుంది. చివరికి ఇచ్చిన మెసేజ్ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగా మరీ నాటకీయంగా అనిపిస్తాయి. అయితే, మహిళలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.&nbsp; ఎవరెలా చేశారు? నటనకు ఎంతో స్కోప్ ఉన్న పాత్రను ఎంచుకున్నాడు సొహైల్. గర్భం దాల్చాక ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా నటించాడు. ద్వితీయార్థంలో సొహైల్ చేసిన యాక్టింగ్ నచ్చుతుంది. చక్కగా భావాలు పలికించాడు. ఇక, రూప తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఇంకొంచెం బాగా చేసే అవకాశం కూడా ఉంది. చాన్నాళ్ల తర్వాత సుహాసిని మణిరత్నంకి మంచి పాత్ర దొరికింది. డాక్టర్‌గా ఆమె బాగా నటించారు. కీలక సన్నివేశాల్లో తను ఆకట్టుకుంది. ఇక, బ్రహ్మాజీ, వైవా హర్ష కామెడీతో అలరించారు. చిన్న పాత్రే అయినా రాజా రవీంద్ర మెప్పించాడు. టెక్నికల్‌గా దర్శకుడు శ్రీనివాస్ క్లిష్టమైన సబ్జెక్ట్‌ని ఎంచుకుని చక్కగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. మగాళ్లు గర్భం దాల్చొచ్చనే అంశంపై బాగా రీసెర్చ్ చేసినట్లు అనిపించింది. స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నాడు. కాకపోతే, పాత్రల ఎలివేషన్ కోసం సమయం తీసుకున్నాడు. క్లైమాక్స్ పార్ట్ బాగా వర్కౌట్ చేశాడు. ఇక, సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలం. నిజార్ షఫీ కెమెరా పనితనం ఓకే.&nbsp; https://twitter.com/RyanSohel/status/1691722567441412475?s=20 ప్లస్ పాయింట్స్ సొహైల్ నటన సెకండాఫ్, క్లైమాక్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ ఇరికించిన కామెడీ సీన్లు ఫస్టాఫ్ కాస్ట్యూమ్స్ ఫైనల్‌గా.. మిస్టర్ ప్రెగ్నెంట్ కథ తెలుసుకోవాలంటే మొదటి 45 నిమిషాలు ఓపిక పట్టాల్సిందే.&nbsp;&nbsp; రేటింగ్: 2/5 https://www.youtube.com/watch?v=MDUVa03xbIs
    ఆగస్టు 18 , 2023
    Telugu OTT Movies: ‘భారతీయుడు 2’ వచ్చేస్తున్నాడు.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే! గత రెండు వారాల్లో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మినహా ఏ కొత్త సినిమా థియేటర్లలోకి రాలేదు. ప్రభాస్‌ చిత్రానికి పోటీగా తమ మూవీని రిలీజ్‌ చేసేందుకు దర్శక నిర్మాతలు సాహసించకపోవడమే ఇందుకు కారణం. అయితే తొలి వారంలోనే కల్కి సినిమాను వీక్షించిన వారు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరో భారీ చిత్రం ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో అలరించనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు భారతీయుడు 2 కమల్‌ హాసన్‌ (Kamal Haasan), డైరెక్టర్‌ శంకర్‌ (Shankar) కాంబోలో పాతికేళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' (Bharateeyudu) చిత్రం సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అవినీతి, లంచగొండతనంపై భారతీయుడు చేసిన పోరాటం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందింది. 'భారతీయుడు 2' (Bharateeyudu 2 Release Date) టైటిల్‌తో జులై 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో కమల్‌తో పాటు సిద్ధార్థ్‌ (Siddharth), రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), ఎస్‌.జె.సూర్య (S.J Surya), బాబీ సింహా (Bobby Simha), బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని (Samuthirakani) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సారంగదరియా రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సారంగదరియా’ (Sarangadariya). పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్‌చంద్ర నిర్మాతలు. మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. జులై 12న ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు మహారాజా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన రీసెంచ్‌ చిత్రం మహారాజా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసింది. జులై 12 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చని పేర్కొంది. విజయ్‌ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన మహారాజా.. థియేటర్లలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. రూ.100 వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. థియేటర్‌లో ఈ మూవీని చూడలేకపోయినవారు ఓటీటీలో వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు.&nbsp; ధూమం మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) నటించిన చిత్రం ‘ధూమం’. అపర్ణ బాలమురళి కథానాయిక. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రం గతేడాది విడుదలై పర్వాలేదనిపించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ఆహాలో జులై 11వ (Dhoomam Telugu OTT) తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateReceiverSeriesEnglishNetflixJuly 10Wild Wild PunjabMovieHindiNetflixJuly 10Vikings : Wall HallaSeriesEnglishNetflixJuly 11Commander Karan SaxenaSeriesHindiHotstarJuly 8MastermindSeriesEnglishHotstarJuly 10Agni SakshiSerial SeriesTeluguHotstarJuly 12Show TimeSeriesEnglishHotstarJuly 1236 DaysSeriesTelugu/HindiSonyLIVJuly 12Pil&nbsp;MovieHindiJio CinemaJuly 12 గత 15 రోజుల్లో విడుదలైన చిత్రాలు &amp; వెబ్‌ సిరీస్‌లు.. గత 15 రోజుల్లో చాలా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అయితే కొన్ని మాత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి. అత్యధిక వీక్షణలు సాధిస్తూ ఆయా ఓటీటీ వేదికల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ చిత్రాలు, సిరీస్‌లపై ఓ లుక్కేయండి.&nbsp; TitleCategoryLanguagePlatformMirzapur 3SeriesTelugu/ HindiAmazon PrimeMalayali From IndiaMovieTelugu/ MalayalamSonyLIVFuriosa: A Mad Max SagaMovieEnglish/ TeluguAmazon PrimeSasi MadanamSeriesTeluguETV WinMarket MahalakshmiMovieTeluguAhaBhaje Vayu VegamMovieTeluguNetflixSathyabamaMovieTeluguAmazon PrimeLove MouliMovieTeluguAhaVindu BhojanamMovieTeluguAhaGuruvayoor AmbalanadayilMovieTelugu/ MalayalamAhaAham RebootMovieTeluguAha
    జూలై 08 , 2024
    Dhootha Review: జర్నలిస్టుగా నాగ చైతన్య అదుర్స్.. ‘ధూత’ సిరీస్ ఎలా ఉందంటే? నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్ ఛాయాగ్రహణం: మికొలాజ్ సైగుల సంగీతం: ఇషాన్ చబ్రా నిర్మాత: శరత్ మరార్&nbsp; ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో ఎపిసోడ్స్‌: 8 విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023&nbsp;&nbsp; సరికొత్త కథలతో సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్‌ విక్రమ్ కె కుమార్ శైలే వేరు. '13బి', 'ఇష్క్', 'మనం', '24' వంటి మెమరబుల్ ఫిల్మ్స్‌కు ఆయన దర్శకత్వం వహించారు. అటువంటి విక్రమ్‌ తొలిసారి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'దూత'. ఇందులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించడం విశేషం. '13బి' తర్వాత సూపర్ నేచురల్ జానర్ మరోసారి టచ్ చేశారు విక్రమ్ కె కుమార్. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఆయన తీసిన 'దూత' ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథ సాగర్ వర్మ (నాగ చైతన్య) జర్నలిస్ట్. కొత్తగా ప్రారంభమైన సమాచార్ దిన పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుంటాడు. ఓ రోజు ధాబాలోకి వెళ్లిన సాగర్‌కు ఓ పేపర్ కటింగ్ కనిపిస్తుంది. అందులో రాసినట్టు కారుకు యాక్సిడెంట్ జరిగి పెంపుడు కుక్క మరణిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని పేపర్ కటింగ్స్ సాగర్ వర్మ కంట పడతాయి. వాటిలో రాసినట్టుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకు కారణం ఏంటి? జరగబోయే ప్రమాదాన్ని ముందే పేపర్లలో రాస్తోంది ఎవరు? అతని ప్రయాణంలో భార్య ప్రియా (ప్రియా భవానీ శంకర్), పీఏ కమ్ జర్నలిస్ట్ అమృత (ప్రాచీ దేశాయ్), డీసీపీ క్రాంతి (పార్వతి తిరువొతు) పాత్రలు ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నాగ చైతన్య అదరగొట్టాడు. తన లుక్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో సిరీస్‌ ఆసాంతం నాగచైతన్య ఇంప్రెస్‌ చేస్తాడు. అతడి తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునేది పార్వతి తిరువొతు నటన. ఎస్పీ క్రాంతిగా ఆమె ఒదిగిపోయారు. సహజంగా నటించారు. కథలో ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు పరిమితమే. కానీ, ఉన్నంతలో తమ ఉనికి చూపించారు. జయప్రకాశ్ తనకు అలవాటైన నటనతో అలరిస్తారు. రవీంద్ర విజయ్, చైతన్య, రోహిణి, ఈశ్వరీ రావు, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, కామాక్షీ భాస్కర్ల తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సీన్లలో పశుపతి, తరుణ్ భాస్కర్, తనికెళ్ళ భరణి, రాజా గౌతమ్, సత్య కృష్ణన్ మెప్పించారు. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటన ఆశ్చర్యపరుస్తుంది. డైరెక్షన్ ఎలా ఉందంటే? విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వ నైపుణ్యాలు ఈ సిరీస్‌లోనూ కనిపిస్తాయి. దూత కథ ఏమిటనేది ఐదారు ఎపిసోడ్స్‌ తర్వాత గానీ క్లారిటీ రాదు. అయినప్పటికీ వీక్షకులకు ఎక్కడా బోర్‌ కొట్టకుండా సిరీస్‌ను నడిపించారు డైరెక్టర్‌. చిన్న చిన్న చమక్కులు, మెరుపులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశారు. ఇక మీడియాపైనా కొన్ని చమక్కులు పేల్చారు డైరెక్టర్‌. రాజకీయ నాయకుల చేతిలో జర్నలిస్టులు పావులుగా మారుతున్న తీరును ఆయన చక్కగా చూపించారు. జర్నలిజంతో పాటు రాజీకయం, పోలీసు వ్యవస్థల్లోనే మంచి, చెడులను కళ్లకు కట్టారు. అయితే ఒక్కో ఎపిసోడ్‌ 40-50 నిమిషాల మధ్య ఉండటం వల్ల డైరెక్టర్‌ కథను సాగదీసిన ఫీలింగ్ కల్గుతుంది. ఓవరాల్‌గా విక్రమ్‌ కె కుమార్‌ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి.&nbsp; సాంకేతికంగా సాంకేతిక అంశాల పరంగా 'దూత' సిరీస్‌ ఉన్నత స్థాయిలో ఉంది. మికొలాజ్ సైగుల సినిమాటోగ్రఫీ పనితనం మెప్పిస్తుంది. సన్నివేశాలను చిత్రీకరించిన తీరు బాగుంది. ముఖ్యంగా వర్షంలో సన్నివేశాలను ఆయన బాగా తీశారు. అటు నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. చెవులకు ఇబ్బంది కలిగించే శబ్దాలు లేవు. కథతో పాటు ఆర్ఆర్ ట్రావెల్ చేసింది. నిర్మాణ విలువలు సైతం బావున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నాగ చైతన్య నటనసస్పెన్స్‌ &amp; క్యూరియాసిటీనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌సాగదీత సీన్లు రేటింగ్‌: 3.5/5
    డిసెంబర్ 01 , 2023

    రాజా రవీందర్ తల్లిదండ్రులు ఎవరు?

    జయప్రకాష్‌ రాజు, భాస్కరమ్మ దంపతులకు 1970 సెప్టెంబర్‌ 19న జన్మించారు.

    రాజా రవీందర్ పెళ్లి ఎప్పుడు అయింది?

    వెంకట రమాదేవిని రాజా రవీంద్ర వివాహం చేసుకున్నారు.

    రాజా రవీందర్ కు పిల్లలు ఎంత మంది?

    ప్రణతి, వాగ్దేవి అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

    రాజా రవీందర్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    పెదరాయుడు(1995) సినిమాలో మోహన్‌బాబుకుసోదరుడిగా నటించి పాపులర్ అయ్యాడు.

    రాజా రవీందర్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    రాజా రవీంద్ర హీరోగా చేయలేదు. 'యముడికి మెుగుడు' (1988) చిత్రం నటుడిగా అతడికి ఫస్ట్ ఫిల్మ్‌.

    తెలుగులో రాజా రవీందర్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రాజా రవీందర్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' (2016) సినిమాలోని పాత్ర అతడి కెరీర్‌లో అత్యుత్తమమైనది.

    రాజా రవీందర్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    రాజా రవీందర్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    రాజా రవీందర్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్‌ బిర్యాని

    రాజా రవీందర్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    రాజా రవీందర్ కు ఇష్టమైన నటి ఎవరు?

    రాజా రవీందర్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, ఇంగ్లీషు

    రాజా రవీందర్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్‌, బ్లాక్‌

    రాజా రవీందర్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    రాజా రవీందర్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    వీరేంద్ర సెహ్వాగ్‌

    రాజా రవీందర్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రాజా రవీంద్ర ఆస్తుల విలువ రూ.30-50 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.
    రాజా రవీందర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రాజా రవీందర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree