నటీనటులు : రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా, అంకిత ఠాకూర్, మకరంద్ దేశ్‌పాండే, ప్రగతి, రాజా రవీంద్ర, జాన్ విజయ్, పృథ్వీ, తాగుబోతు రమేష్ తదితరులు
డైరెక్టర్ : ఏ.ఎస్. రవి కుమార్
సంగీతం : జేబీ
సినిమాటోగ్రఫీ : జవహర్ రెడ్డి
నిర్మాత : మాల్కాపురం శివ కుమార్
విడుదల తేదీ : ఆగస్టు 2, 2024
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరా సామి’ (Thiragabadara Saami Movie Review). ఏ.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra), మన్నారా చోప్రా (Mannara Chopra) హీరోయిన్లుగా చేశారు. మకరంద్ దేశ్‌పాండే, రాజా రవీంద్ర, ప్రగతి ఇతర ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా హీరో హీరోయిన్లుగా చేసిన రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రపై సంచలన ఆరోపణలు వచ్చాయి. రాజ్‌తరుణ్ తనను మోసం చేసి మాల్వీతో రిలేషన్‌లో ఉన్నట్లు అతడి మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే ఆగస్టు 2న ‘తిరగబడరా సామి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గిరి (రాజ్ తరుణ్) చాలా పిరికివాడు. ప్రతి దానికి భయపడుతూ చుట్టూ ఏం జరుగుతున్నా అసలు పట్టించుకోడు. కానీ శైలజా (మాల్వీ మల్హోత్ర) అలా కాదు. చాలా దూకుడుతో వైలెంట్‌గా ఉంటుంది. టీజ్ చేసిన వారిని ఇరగ దీస్తుంటుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. అయితే శైలజాను కంట్రోల్ చేయలేక గిరి ఎలాంటి తిప్పలు పడ్డాడు? వారి ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి? ఎప్పుడు సౌమ్యంగా ఉండే గిరి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? తన ప్రేమను గెలిపించుకునేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
హీరో రాజ్ తరుణ్ గిరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తొలుత అమాయకుడిగా, ఆపై ప్రేయసి కోసం శత్రువులపై తిరగబడే ప్రియుడిగా రెండు డైమన్షన్లలో మంచి నటన కనబరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో రాజ్ దుమ్మురేపాడు. ఈ స్థాయి యాక్షన్ సీన్స్ అతడు ఇప్పటివరకూ చేయలేదు. ఇక శైలజా పాత్రలో హీరోయిన్ మాల్వీ మల్హోత్ర ఒదిగిపోయింది. తెలుగులో ఆమెకు ఇది తొలి సినిమానే అయిన్పప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. స్క్రీన్‌పై రాజ్ తరుణ్ – మాల్వీ మల్హోత్ర కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. సెకండ్ హీరోయిన్ మన్నారా చోప్రా కూడా అద్భుతంగా నటించింది. ఇక జాన్ విజయ్, రఘుబాబు, అంకిత ఠాకూర్, ప్రగతి, రాజా రవీంద్ర తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని లవ్ & యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. తొలి భాగం మెుత్తం హీరో-హీరోయిన్ పరిచయం, వారి లవ్ ట్రాక్‌తో సాగిపోయింది. గిరిని శైలజా డామినేట్ చేసే క్రమంలో వచ్చే హాస్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదరడంతో ఫస్టాఫ్ ఎక్కడా బోర్ లేకుండా వెళ్లిపోతుంది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచారు డైరెక్టర్. రెండో భాగాన్ని హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌తో పూర్తిగా నింపేశారు. రాజ్ తరుణ్‌ను ఎన్నో మాస్ యాంగిల్స్‌లో చూపించి డైరెక్టర్ ఆకట్టుకున్నారు. అయితే అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని ఫైట్స్ రాజ్‌తరుణ్ కటౌట్‌కు మించి ఉండటంతో లాజికల్‌గా కనెక్ట్ కాలేము. భావోద్వేగ సన్నివేశాలు సైతం పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒక మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కోరుకునేవారికి ‘తిరబడరా సామి’ నచ్చుతుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే జేబీ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్‌ను బీజీఎం మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే పాటలు గుర్తుంచుకునేలా లేవు. అటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- రాజ్‌తరుణ్ నటన
- లవ్ ట్రాక్
- యాక్షన్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్
- వర్కౌట్ కాని ఎమోషన్స్
- కొన్ని బోరింగ్ సీన్స్
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్