గత రెండు వారాల్లో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మినహా ఏ కొత్త సినిమా థియేటర్లలోకి రాలేదు. ప్రభాస్ చిత్రానికి పోటీగా తమ మూవీని రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సాహసించకపోవడమే ఇందుకు కారణం. అయితే తొలి వారంలోనే కల్కి సినిమాను వీక్షించిన వారు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరో భారీ చిత్రం ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో అలరించనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
భారతీయుడు 2
కమల్ హాసన్ (Kamal Haasan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ (Bharateeyudu) చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అవినీతి, లంచగొండతనంపై భారతీయుడు చేసిన పోరాటం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రూపొందింది. ‘భారతీయుడు 2‘ (Bharateeyudu 2 Release Date) టైటిల్‌తో జులై 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో కమల్‌తో పాటు సిద్ధార్థ్ (Siddharth), రకుల్‌ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), ఎస్.జె.సూర్య (S.J Surya), బాబీ సింహా (Bobby Simha), బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని (Samuthirakani) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
సారంగదరియా
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సారంగదరియా’ (Sarangadariya). పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్‌చంద్ర నిర్మాతలు. మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. జులై 12న ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
మహారాజా
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన రీసెంచ్ చిత్రం మహారాజా ఓటీటీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది. జులై 12 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చని పేర్కొంది. విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన మహారాజా.. థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ.100 వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. థియేటర్‌లో ఈ మూవీని చూడలేకపోయినవారు ఓటీటీలో వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు.
ధూమం
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad Faasil) నటించిన చిత్రం ‘ధూమం’. అపర్ణ బాలమురళి కథానాయిక. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం గతేడాది విడుదలై పర్వాలేదనిపించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ఆహాలో జులై 11వ (Dhoomam Telugu OTT) తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title | Category | Language | Platform | Release Date |
Receiver | Series | English | Netflix | July 10 |
Wild Wild Punjab | Movie | Hindi | Netflix | July 10 |
Vikings : Wall Halla | Series | English | Netflix | July 11 |
Commander Karan Saxena | Series | Hindi | Hotstar | July 8 |
Mastermind | Series | English | Hotstar | July 10 |
Agni Sakshi | Serial Series | Telugu | Hotstar | July 12 |
Show Time | Series | English | Hotstar | July 12 |
36 Days | Series | Telugu/Hindi | SonyLIV | July 12 |
Pil | Movie | Hindi | Jio Cinema | July 12 |
గత 15 రోజుల్లో విడుదలైన చిత్రాలు & వెబ్ సిరీస్‌లు..
గత 15 రోజుల్లో చాలా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అయితే కొన్ని మాత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి. అత్యధిక వీక్షణలు సాధిస్తూ ఆయా ఓటీటీ వేదికల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ చిత్రాలు, సిరీస్‌లపై ఓ లుక్కేయండి.
Title | Category | Language | Platform |
Mirzapur 3 | Series | Telugu/ Hindi | Amazon Prime |
Malayali From India | Movie | Telugu/ Malayalam | SonyLIV |
Furiosa: A Mad Max Saga | Movie | English/ Telugu | Amazon Prime |
Sasi Madanam | Series | Telugu | ETV Win |
Market Mahalakshmi | Movie | Telugu | Aha |
Bhaje Vayu Vegam | Movie | Telugu | Netflix |
Sathyabama | Movie | Telugu | Amazon Prime |
Love Mouli | Movie | Telugu | Aha |
Vindu Bhojanam | Movie | Telugu | Aha |
Guruvayoor Ambalanadayil | Movie | Telugu/ Malayalam | Aha |
Aham Reboot | Movie | Telugu | Aha |
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం