• TFIDB EN
  • రవికిరణ్ కోలా
    జననం : జూలై 20 , 1994
    ప్రదేశం: భద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
    రవికిరణ్ కోలా తూర్పుగోదావరి జిల్లా భద్రవరం గ్రామంలో జన్మించాడు మరియు రాజా వారు రాణి గారుతో దర్శకుడిగా పరిచయం కాకముందు రెండు షార్ట్ ఫిల్మ్‌లు తీశాడు మరియు సినిమా విద్యను అభ్యసించలేదు లేదా సినిమా సెట్‌లో పని చేయలేదు. అతను ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా రాబోయే పొలిటికల్ థ్రిల్లర్‌లో పని చేస్తున్నాడు
    కథనాలు
    <strong>Raayan Movie Review: ధనుష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్‌’ మెప్పించిందా?</strong>
    Raayan Movie Review: ధనుష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్‌’ మెప్పించిందా? నటీనటులు : ధనుష్‌, సందీప్‌ కిషన్‌, ఎస్‌.జే. సూర్య, జయరామ్‌, సెల్వరాఘవన్‌, ప్రకాష్‌ రాజ్‌, దుషారా విజయన్‌, అపర్ణ బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తదితరులు కథ &amp; దర్శకత్వం : ధనుష్‌ సినిమాటోగ్రఫీ : ఓం ప్రకాష్‌ సంగీతం : ఏ.ఆర్‌. రెహమాన్‌ ఎడిటింగ్‌ : ప్రసన్న జి.కె నిర్మాణ సంస్థ : సన్‌ పిక్చర్స్‌ విడుదల తేదీ : 26 జులై, 2024 తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) నటించిన లేటెస్ట్ చిత్రం 'రాయన్‌' (Raayan Movie Telugu Review). ధనుష్‌ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) కీలక పాత్ర పోషించాడు. ప్రకాష్‌ రాజ్‌(Prakash Raj), ఎస్‌. జే. సూర్య (S.J. Surya), జయరామ్‌ (Jayaram), వరలక్ష్మీ (Varalaxmi) ఇతర ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ధనుష్‌కు మరో విజయాన్ని అందించిందా? ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ సక్సెస్‌ అయ్యిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి రాయన్‌ (ధనుష్‌) తన ఇద్దరు తమ్ముళ్లు ముత్తువేల్ (సందీప్ కిషన్), మాణిక్యం(కాళిదాస్ జయరామ్), చెల్లి దుర్గ (దుషారా విజయన్) దుర్గతో కలిసి జీవిస్తుంటాడు. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటుంటే ముత్తువేల్‌ మాత్రం ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక అదే ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(ఎస్‌.జే. సూర్య)లు రౌడీలుగా ఒకరికొకరు వేరువేరు గ్యాంగ్స్ తో ఉంటారు. ఆ ఊరికి పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్) అక్కడున్న రౌడీలని అంతం చేయడానికి పగతో వస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా దొరై చనిపోతాడు. దీంతో రాయన్‌ను సీతారం టార్గెట్‌ చేస్తాడు. దొరైని ఎవరు చంపారు? రాయన్‌ను సీతారాం ఎందుకు టార్గెట్‌ చేశాడు? పోలీసాఫీసర్ ఏం చేసాడు? రాయన్‌ తమ్ముళ్లు ఏం అయ్యారు? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే గ్లోబల్‌ స్టార్‌ ధనుష్‌ ఎప్పటిలాగే ఈ సినిమాలో చక్కటి నటన కనబరిచాడు. రాయన్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో విశ్వరూపం చూపించాడు. అటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ తన మార్క్‌ చూపించాడు. టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌కు ఈ సినిమాలో మంచి పాత్రే దక్కింది. రాయన్‌ తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యం ఉన్న పాత్ర అతడిది. సందీప్‌ ఇప్పటివరకూ చేసిన వాటిలో ఈ పాత్ర గుర్తుండిపోతుంది. అటు ఎస్‌.జే సూర్య, ప్రకాష్‌ రాజ్‌ తమ అద్భుత నటనతో తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సెల్వరాఘవన్‌, దుషారా విజయన్‌, అపర్ణ బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇతర నటీనటులు కూడా తమ పరిధిమేరకు నటించి మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే తన కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన రాయన్‌కు ధనుష్‌ దర్శకత్వం వహించారు. స్టోరీ పరంగా చూస్తే ఓ సాధారణ రీవేంజ్‌ డ్రామాగా అనిపించినప్పటికీ ధనుష్‌ తనదైన డైరెక్షన్, స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. ముగ్గురు డైమన్షన్స్‌లో కథ నడిపి మెప్పించాడు. పోరాట ఘట్టాలు, ఎమోషనల్‌ సీన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించాడు. తద్వారా ప్రేక్షకులను కథలో లీనమయ్యేట్టు చేశారు. అద్భుతమైన ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచాడు. ఇక సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌, ఎమోషన్స్‌, క్లైమాక్స్‌ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యాయి. అయితే రొటిన్‌ స్టోరీ కావడం, తర్వాత జరగబోయేది ముందే ఊహించగలడం, తమిళ నేటివిటికి దగ్గరగా ఉండటం, అక్కడక్కడ కొన్ని బోరింగ్‌ సీన్స్‌ సినిమాకు మైనస్‌గా మారాయి. సాంకేతికంగా&nbsp; టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. ఏ.ఆర్‌. రెహమాన్‌ అందించిన సంగీతం సినిమాకు అతిపెద్ద అసెట్‌గా మారింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. అయితే పాటలు మాత్రం గుర్తుంచుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. బోరింగ్‌ సన్నివేశాలను కాస్త ట్రిమ్‌ చేసి ఉంటే సినిమాకు మరింత వెయిటేజీ వచ్చేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ధనుష్, సందీప్‌ కిషన్‌ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఅక్కడక్కడ బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp; ‘రాయన్‌’ సినిమాపై పబ్లిక్‌ టాక్‌ 'రాయన్‌' చిత్రాన్ని చూసిన కొందరు నెటిజన్లు ఎక్స్‌ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ మంది ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ధనుష్‌ నటన, నేపథ్య సంగీతాన్ని హైలెట్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులు ఏవో చూద్దాం.&nbsp; రాయన్‌ ఫస్టాఫ్‌, సెకండాఫ్‌, ధనుష్‌ ఎంట్రీ, ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ బ్యాంగ్‌, సందీప్‌ కిషన్‌ నటన అదిపోయాయని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఈ సినిమాకు ఏకంగా 4.6/5 రేటింగ్‌ ఇచ్చాడు.&nbsp; https://twitter.com/review0813/status/1816622242421522704 రాయన్‌ మూవీ రా అండ్‌ రస్టిక్‌గా ఉందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ధనుష్‌ మేకోవర్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అదిరిపోయాయని పేర్కొన్నాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ను ధనుష్‌ తన వర్కింగ్‌ స్టైల్‌తో గుర్తు చేశారని ప్రశంసించారు. ఎస్‌.జే సూర్య నటన, ఏ.ఆర్‌. రెహమాన్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచాయని రాసుకొచ్చాడు.&nbsp; https://twitter.com/LetsXOtt/status/1816651224956981478 రాయన్‌ ఒక సాధారణ రివేంజ్‌ డ్రామా అయినప్పటికీ ధనుష్‌ టేకింగ్‌ చాలా కొత్తదనాన్ని ఇచ్చిందని ఇంకో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రెహమాన్‌ ఈ మూవీకి సెకండ్‌ హీరో అంటూ రాసుకొచ్చాడు.&nbsp; https://twitter.com/CinemaWithAB/status/1816657822026764609 రాయన్‌ సినిమా అద్భుతంగా ఉందంటూ ఓ వ్యక్తి పోస్టు పెట్టాడు. 'ఆల్‌రౌండర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా' అని ధనుష్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. ఈ మూవీలో సందీప్‌ కిషన్‌ మేజర్‌ రోల్‌ పోషించాడని ఎక్కడా ల్యాగ్స్‌, బోరింగ్‌ సీన్స్‌ లేవని రాసుకొచ్చారు.&nbsp; https://twitter.com/PikuOffl/status/1816649186571698503
    జూలై 26 , 2024
    Raayan Day 1 Collection: ‘రాయన్‌’ను దెబ్బతీసిన హాలీవుడ్‌ చిత్రం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే? కోలివుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం 'రాయన్‌' (Rayaan). ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తెలుగు హీరో సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) ముఖ్య పాత్ర పోషించాడు. ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj), ఎస్‌.జే. సూర్య (S.J Surya), అపర్ణ బాలమురళి (Aparna Balamurali) ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. కాగా, ఈ చిత్రం జులై 26న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది. రొటిన్ రివేంజ్‌ డ్రామా అని నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చినప్పటికీ ధనుష్‌ యాక్టింగ్‌, డైరెక్షన్‌ స్కిల్స్‌పై ప్రశంసలు కురిశాయి. సినిమా తమకు బాగా నచ్చిందని మెజారిటీ ప్రేక్షకులు నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాయన్‌ తొలి రోజు ఏ మేరకు వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు చూద్దాం. తొలి రోజు వసూళ్లు ఎంతంటే? ధనుష్‌ కెరీర్‌లో 50వ చిత్రంగా ‘రాయన్‌’ రూపొందింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన (జులై 26) ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.20.7 కోట్లు (GROSS) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా రూ.15.7 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.5 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఇక రాష్ట్రాల వారీగా తీసుకుంటే 'రాయన్‌'కు తమిళనాడులో అత్యధికంగా&nbsp; రూ.10.6 కోట్లు వచ్చాయి. ఏపీ &amp; తెలంగాణలో రూ. 2 కోట్లు, కర్ణాటకలో రూ.1.8 కోట్లు, కేరళలో రూ.90 లక్షలు, రెస్ ఆఫ్‌ ఇండియా రూ.40 లక్షలు వసూలైనట్లు వివరించాయి. శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; డెడ్‌పూల్‌ వోల్వరైన్‌ డామినేషన్‌ మార్వెల్‌ సూపర్ హీరో సిరీస్‌లో భాగంగా రూపొందిన ‘డెడ్‌పూల్‌ &amp; వోల్వరైన్‌’ చిత్రం శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా విడుదలై సర్వత్రా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో ‘రాయన్‌’కు ఈ హాలీవుడ్‌ చిత్రం నుంచి గట్టిపోటీ ఎదురైంది. దేశంలోని సినీ ఆడియన్స్‌ ఈ మార్వెల్‌ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. బుక్‌మైషోలో రాయన్‌కు 2 లక్షల 73 వేల టికెట్లు బుక్‌ అయితే ‘డెడ్‌పూల్‌ &amp; వోల్వరైన్‌’కు 3 లక్షల 25 వేల బుకింగ్స్‌ వచ్చాయి. ఈ హాలీవుడ్‌ చిత్రానికి దేశంలో తొలి రోజు రూ. 21.5 కోట్లు (NET) వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లీష్‌ వెర్షన్‌లో రూ.11.7 కోట్లు, హిందీలో రూ.7.5 కోట్లు, తెలుగులో రూ.1.2 కోట్లు, తమిళంలో రూ.1.1 కోట్లు వసూలైనట్లు వివరించాయి. దీన్ని బట్టి చూస్తే ‘రాయన్‌’ వసూళ్లను ఈ హాలీవుడ్‌ చిత్రం ఏ స్థాయిలో దెబ్బతీసిందో అర్థమవుతుంది.&nbsp; ‘రాయన్‌’లో హైలెట్స్‌ ఇవే! గ్లోబల్‌ స్టార్‌ ధనుష్‌ 'రాయన్‌' సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. న‌ట‌నే కాదు త‌న‌లో ఎంత మంచి ద‌ర్శ‌కుడు ఉన్నాడో కూడా ఈ చిత్రం ద్వారా చాటి చెప్పాడు. కథగా చూస్తే ‘రాయన్‌’లో కొత్త‌ద‌న‌ం ఏమీ కనిపించదు. అయితే కొన్ని మ‌లుపులు, కుటుంబ డ్రామా, క‌థా నేప‌థ్యం ఈ సినిమాను ప్ర‌త్యేకంగా మార్చేశాయి. ఒక మామూలు క‌థ‌ని ధ‌నుష్ త‌న అండ‌ర్ ప్లే న‌ట‌న‌తో, వైవిధ్య‌మైన కొన్ని మాస్ ఘ‌ట్టాల‌తో ర‌క్తి క‌ట్టించాడు. ఎ.ఆర్‌.రెహమాన్ నేప‌థ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ఆయన ఈ సినిమాకు సెకండ్‌ హీరో అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్‌ కూడా వచ్చాయి. ‘రాయన్‌’ కథ ఏంటంటే రాయన్‌ (ధనుష్‌) తన ఇద్దరు తమ్ముళ్లు ముత్తువేల్ (సందీప్ కిషన్), మాణిక్యం(కాళిదాస్ జయరామ్), చెల్లి దుర్గ (దుషారా విజయన్) దుర్గతో కలిసి జీవిస్తుంటాడు. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటుంటే ముత్తువేల్‌ మాత్రం ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక అదే ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(ఎస్‌.జే. సూర్య)లు రౌడీలుగా ఒకరికొకరు వేరువేరు గ్యాంగ్స్ తో ఉంటారు. ఆ ఊరికి పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్) అక్కడున్న రౌడీలని అంతం చేయడానికి పగతో వస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా దొరై చనిపోతాడు. దీంతో రాయన్‌ను సీతారం టార్గెట్‌ చేస్తాడు. దొరైని ఎవరు చంపారు? రాయన్‌ను సీతారాం ఎందుకు టార్గెట్‌ చేశాడు? పోలీసాఫీసర్ ఏం చేసాడు? రాయన్‌ తమ్ముళ్లు ఏం అయ్యారు? అన్నది స్టోరీ.&nbsp; ‘డెడ్‌పూల్‌ &amp; వోల్వరైన్‌’ స్టోరీ ఇదే డెడ్‌పూల్‌ అలియాస్‌ వేడ్‌ విల్సన్‌ (ర్యాన్‌ రేనాల్డ్స్‌) సెకండ్‌ హ్యాండ్‌ కార్ల సేల్స్‌ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. గర్ల్ ఫ్రెండ్ వెనేసాతో బ్రేకప్ తర్వాత డెడ్‌పూల్ తన డ్రస్‌ తీసేసి తీసేస్తాడు. ఈ క్రమంలో ఓ రోజున టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు డెడ్‌పూల్‌ను ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616లో జాయిన్ అవ్వమంటారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వోల్వరైన్‌ (హ్యూ జాక్‌మన్‌) సాయం అవసరం అవుతుంది. ఈ క్రమంలో వోల్వరైన్‌తో కలిసి డెడ్‌పూల్‌ ఏం చేశాడు? మల్టీవెర్స్‌లో వీరిద్దరూ ఎలాంటి సాహసాలు చేశారు? పారాడాక్స్‌ను ఎలా ఎదిరించారు? అతడి ఎత్తులను ఎలా చిత్తు చేశారు? టైమ్ వేరియెన్స్ అథారిటీలో చివరకు ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ.
    జూలై 27 , 2024
    This Week Movies: ‘రాయన్‌’ వచ్చేస్తున్నాడు.. ఒక్క వారంలో 18 చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు! ‘కల్కి 2898 ఏడీ’ తర్వాత వచ్చిన ఏ చిత్రాలు ఆ స్థాయి సక్సెస్‌ అందుకోలేక బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడ్డాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘భారతీయుడు 2’ కూడా ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలో జులై చివరి వారంలో ఆడియన్స్‌ను పలకరించేందుకు ఓ బడా చిత్రంతో పాటు రెండు చిన్న సినిమాలు రెడీ అయ్యాయి. అటు ఓటీటీలోనూ మిమల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు రాయన్‌ ధనుష్‌ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాయన్‌’ (Raayan Movie). ఇందులో దుషారా విజయన్, సందీప్‌ కిషన్, కాళిదాస్‌ జయరామ్, అపర్ణ బాలమురళి కీలక పాత్రలు పోషించారు. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాలపై సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. పురుషోత్తముడు రాజ్‌ తరుణ్ కథానాయకుడిగా రామ్‌ భీమన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu). హాసిని సుధీర్‌ కథానాయిక. రమేశ్‌ తేజావత్, ప్రకాశ్‌ తేజావత్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై&nbsp; 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని వర్గాలకు నచ్చే పండగ లాంటి సినిమా ఇదని చిత్ర బృందం తెలిపింది.&nbsp;&nbsp; ఆపరేషన్‌ రావణ్‌ రక్షిత్‌ అట్లూరి హీరోగా రూపొందిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’ (Operation Raavan). వెంకట సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంకీర్తన విపిన్‌ హీరోయిన్‌గా చేసింది. జులై 26న ఈ థియేటర్లలో విడుదల కానుంది. సీనియర్‌ నటి రాధిక ఇందులో కీలక పాత్ర పోషించారు. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు. ఇది ప్రతీ ఒక్కరికీ తప్పక నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.&nbsp; ఓటీటీ విడులయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రాజు యాదవ్‌ గెటప్‌ శ్రీను కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘రాజు యాదవ్‌’ (Raju Yadav). మేలో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా జులై 24న ఓటీటీలోకి రాబోతోంది. ‘ఆహా’ (Aha) ఈ సినిమాను వీక్షించవచ్చు. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీను.. ఓ సమస్య ఉన్న వ్యక్తిగా నటించి, నవ్వులు పంచారు. హీరోయిన్‌గా అంకిత కారాట్‌ ఆకట్టుకున్నారు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateCleo Season 2SeriesEnglishNetflixJuly 25The DecameronSeriesEnglishNetflixJuly 25Tokyo SwindlersSeriesEnglish/JapaneseNetflixJuly 25Elite Season 8SeriesEnglishNetflixJuly 26GhostbustersMovieEnglishNetflixJuly 26The Dragon Prince Season 6SeriesEnglishNetflixJuly 26The Ministry of Ungentlemanly WarfareMovieEnglishAmazon&nbsp;July 25Bloody IshqMovieHindiHotstarJuly 26Chutney SambarSeriesTamil&nbsp;HotstarJuly 26Bhaiyyaji&nbsp;MovieHindiZee 5July 26Chalte Rahe ZindagiMovieHindiZee 5July 26KalMovieTamil&nbsp;AhaJuly 23Grand MaaMovieTamil&nbsp;AhaJuly 24Which Brings To Meet YouMovieEnglishJio CinemaJuly 26
    జూలై 22 , 2024
    New OTT Releases Telugu: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే! ప్రతీ శుక్రవారం టాలీవుడ్‌లో కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే గత కొన్ని వారాలుగా పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ వారం కూడా అదే రిపీట్‌ కానుంది. ఈ వీకెండ్‌ కూడా ప్రేక్షకులను అలరించేందుకు చిన్న చిత్రాలు, తమిళ డబ్బింగ్‌ మూవీస్‌ రాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త చిత్రాలు, సిరీస్‌లు మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు హరోం హర సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌, రవి కాలే, కేశవ్‌ దీపక్, రాజశేఖర్‌ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. 1989 నేపథ్యంలో జరిగే కథ ఇదని, అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రెజెంట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. రాయణ్‌&nbsp; తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (New OTT Releases Telugu) నటించిన లేటెస్ట్‌ చిత్ర 'రాయణ్‌' (Raayan). ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దుషారా విజయన్‌ హీరోయిన్‌గా చేసింది. సందీప్‌ కిషన్‌, ఎస్‌.జే. సూర్య, అపర్ణ బాలమురళి, నిత్యా మీనన్‌, కాళిదాస్‌ జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.  ఇంద్రాణి&nbsp; యానీయా, అంకిత, అజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంద్రాణి' (Indrani). ఈ చిత్రం స్టీఫెన్‌ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందింది. జూన్‌ 14న ఈ చిత్రం ధియేటర్లలో రిలీజ్‌ కాబోతోంది. టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. వందేళ్ల తర్వాత టెక్నాలజీ పరంగా వచ్చే మార్పులేంటి? అన్నది ఇందులో చూడవచ్చని చెప్పింది.&nbsp; మ్యూజిక్‌ షాప్‌ మూర్తి టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్, క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. జూన్ 14న (New OTT Releases Telugu) గ్రాండ్‌ ఈ సినిమా విడుదల కానుంది. 'ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు' అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది. మహారాజా (తెలుగు డబ్‌) తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి నటించిన 'మహా రాజా' (Maha Raja).. ఈ వారమే విడుదల కానుంది. నిథిలాన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్‌ దాస్‌, అనురాగ్‌ కశ్యప్‌, మునీశ్‌ కాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం సమకూర్చారు. జూన్‌ 14న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్‌ కానుంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జూన్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ (OTT Releases This Week Telugu) పోస్టర్‌ విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 31 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.  పారిజాత పర్వం చైతన్య రావు, శ్రద్ధా దాస్ నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam) ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజై.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని రెండు నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. జూన్ 12 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు 'ఆహా' (OTT Releases This Week Telugu) అధికారికంగా ప్రకటించింది. కంభంపాటి సంతోష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్‌, హర్ష కీలక పాత్రలు చేశారు.  TitleCategoryLanguagePlatformRelease DateTour Day France Unchained S2SeriesEnglishNetflixJune 11My Next Guest S2SeriesEnglishNetflixJune 12Mysteries Of The Terracotta WarriorsMovieEnglishNetflixJune 12Doctor ClimaxSeriesEnglishNetflixJune 13Gangs Of GodavariMovieTeluguNetflixJune 14Maha RajMovieHindiNetflixJune 14Protecting ParadiseMovieEnglishDisney + HotstarJune 10The Colour Of VictorySeriesEnglishDisney + HotstarJune 10Not Dead At S2SeriesEnglishDisney + HotstarJune 12Gaanth Chapter 1SeriesHindiJio CinemaJune 11GroundMovieTeluguAmazonJune 10The Boys Season 4SeriesTeluguAmazonJune 13Paarijatha ParvamMovieTeluguAhaJune 12Kurangu PedalSeriesTamilAhaJune 14Love Ki Arrange MarriageMovieHindiZee 5June 14ParuvuSeriesTeluguZee 5June 14
    జూన్ 10 , 2024
    రవికిరణ్ కోలా వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రవికిరణ్ కోలా కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree