• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week Movies: ‘రాయన్‌’ వచ్చేస్తున్నాడు.. ఒక్క వారంలో 18 చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు!

    కల్కి 2898 ఏడీ’ తర్వాత వచ్చిన ఏ చిత్రాలు ఆ స్థాయి సక్సెస్‌ అందుకోలేక బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడ్డాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘భారతీయుడు 2’ కూడా ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలో జులై చివరి వారంలో ఆడియన్స్‌ను పలకరించేందుకు ఓ బడా చిత్రంతో పాటు రెండు చిన్న సినిమాలు రెడీ అయ్యాయి. అటు ఓటీటీలోనూ మిమల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు

    రాయన్‌

    ధనుష్‌ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాయన్‌’ (Raayan Movie). ఇందులో దుషారా విజయన్, సందీప్‌ కిషన్, కాళిదాస్‌ జయరామ్, అపర్ణ బాలమురళి కీలక పాత్రలు పోషించారు. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాలపై సినిమాపై భారీగా అంచనాలు పెంచింది.

    పురుషోత్తముడు

    రాజ్‌ తరుణ్ కథానాయకుడిగా రామ్‌ భీమన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu). హాసిని సుధీర్‌ కథానాయిక. రమేశ్‌ తేజావత్, ప్రకాశ్‌ తేజావత్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై  26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని వర్గాలకు నచ్చే పండగ లాంటి సినిమా ఇదని చిత్ర బృందం తెలిపింది.  

    ఆపరేషన్‌ రావణ్‌

    రక్షిత్‌ అట్లూరి హీరోగా రూపొందిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’ (Operation Raavan). వెంకట సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంకీర్తన విపిన్‌ హీరోయిన్‌గా చేసింది. జులై 26న ఈ థియేటర్లలో విడుదల కానుంది. సీనియర్‌ నటి రాధిక ఇందులో కీలక పాత్ర పోషించారు. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు. ఇది ప్రతీ ఒక్కరికీ తప్పక నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

    ఓటీటీ విడులయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు

    రాజు యాదవ్‌

    గెటప్‌ శ్రీను కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘రాజు యాదవ్‌’ (Raju Yadav). మేలో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా జులై 24న ఓటీటీలోకి రాబోతోంది. ‘ఆహా’ (Aha) ఈ సినిమాను వీక్షించవచ్చు. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీను.. ఓ సమస్య ఉన్న వ్యక్తిగా నటించి, నవ్వులు పంచారు. హీరోయిన్‌గా అంకిత కారాట్‌ ఆకట్టుకున్నారు.

    మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    https://telugu.yousay.tv/tfidb/ott

    TitleCategoryLanguagePlatformRelease Date
    Cleo Season 2SeriesEnglishNetflixJuly 25
    The DecameronSeriesEnglishNetflixJuly 25
    Tokyo SwindlersSeriesEnglish/JapaneseNetflixJuly 25
    Elite Season 8SeriesEnglishNetflixJuly 26
    GhostbustersMovieEnglishNetflixJuly 26
    The Dragon Prince Season 6SeriesEnglishNetflixJuly 26
    The Ministry of Ungentlemanly WarfareMovieEnglishAmazon July 25
    Bloody IshqMovieHindiHotstarJuly 26
    Chutney SambarSeriesTamil HotstarJuly 26
    Bhaiyyaji MovieHindiZee 5July 26
    Chalte Rahe ZindagiMovieHindiZee 5July 26
    KalMovieTamil AhaJuly 23
    Grand MaaMovieTamil AhaJuly 24
    Which Brings To Meet YouMovieEnglishJio CinemaJuly 26
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv