• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Raayan Day 1 Collection: ‘రాయన్‌’ను దెబ్బతీసిన హాలీవుడ్‌ చిత్రం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

    కోలివుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘రాయన్‌’ (Rayaan). ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తెలుగు హీరో సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) ముఖ్య పాత్ర పోషించాడు. ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj), ఎస్‌.జే. సూర్య (S.J Surya), అపర్ణ బాలమురళి (Aparna Balamurali) ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. కాగా, ఈ చిత్రం జులై 26న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది. రొటిన్ రివేంజ్‌ డ్రామా అని నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చినప్పటికీ ధనుష్‌ యాక్టింగ్‌, డైరెక్షన్‌ స్కిల్స్‌పై ప్రశంసలు కురిశాయి. సినిమా తమకు బాగా నచ్చిందని మెజారిటీ ప్రేక్షకులు నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాయన్‌ తొలి రోజు ఏ మేరకు వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

    తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

    ధనుష్‌ కెరీర్‌లో 50వ చిత్రంగా ‘రాయన్‌’ రూపొందింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన (జులై 26) ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.20.7 కోట్లు (GROSS) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా రూ.15.7 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.5 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఇక రాష్ట్రాల వారీగా తీసుకుంటే ‘రాయన్‌’కు తమిళనాడులో అత్యధికంగా  రూ.10.6 కోట్లు వచ్చాయి. ఏపీ & తెలంగాణలో రూ. 2 కోట్లు, కర్ణాటకలో రూ.1.8 కోట్లు, కేరళలో రూ.90 లక్షలు, రెస్ ఆఫ్‌ ఇండియా రూ.40 లక్షలు వసూలైనట్లు వివరించాయి. శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    డెడ్‌పూల్‌ వోల్వరైన్‌ డామినేషన్‌

    మార్వెల్‌ సూపర్ హీరో సిరీస్‌లో భాగంగా రూపొందిన ‘డెడ్‌పూల్‌ & వోల్వరైన్‌’ చిత్రం శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా విడుదలై సర్వత్రా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో ‘రాయన్‌’కు ఈ హాలీవుడ్‌ చిత్రం నుంచి గట్టిపోటీ ఎదురైంది. దేశంలోని సినీ ఆడియన్స్‌ ఈ మార్వెల్‌ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. బుక్‌మైషోలో రాయన్‌కు 2 లక్షల 73 వేల టికెట్లు బుక్‌ అయితే ‘డెడ్‌పూల్‌ & వోల్వరైన్‌’కు 3 లక్షల 25 వేల బుకింగ్స్‌ వచ్చాయి. ఈ హాలీవుడ్‌ చిత్రానికి దేశంలో తొలి రోజు రూ. 21.5 కోట్లు (NET) వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లీష్‌ వెర్షన్‌లో రూ.11.7 కోట్లు, హిందీలో రూ.7.5 కోట్లు, తెలుగులో రూ.1.2 కోట్లు, తమిళంలో రూ.1.1 కోట్లు వసూలైనట్లు వివరించాయి. దీన్ని బట్టి చూస్తే ‘రాయన్‌’ వసూళ్లను ఈ హాలీవుడ్‌ చిత్రం ఏ స్థాయిలో దెబ్బతీసిందో అర్థమవుతుంది. 

    ‘రాయన్‌’లో హైలెట్స్‌ ఇవే!

    గ్లోబల్‌ స్టార్‌ ధనుష్‌ ‘రాయన్‌’ సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. న‌ట‌నే కాదు త‌న‌లో ఎంత మంచి ద‌ర్శ‌కుడు ఉన్నాడో కూడా ఈ చిత్రం ద్వారా చాటి చెప్పాడు. కథగా చూస్తే ‘రాయన్‌’లో కొత్త‌ద‌న‌ం ఏమీ కనిపించదు. అయితే కొన్ని మ‌లుపులు, కుటుంబ డ్రామా, క‌థా నేప‌థ్యం ఈ సినిమాను ప్ర‌త్యేకంగా మార్చేశాయి. ఒక మామూలు క‌థ‌ని ధ‌నుష్ త‌న అండ‌ర్ ప్లే న‌ట‌న‌తో, వైవిధ్య‌మైన కొన్ని మాస్ ఘ‌ట్టాల‌తో ర‌క్తి క‌ట్టించాడు. ఎ.ఆర్‌.రెహమాన్ నేప‌థ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ఆయన ఈ సినిమాకు సెకండ్‌ హీరో అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్‌ కూడా వచ్చాయి.

    ‘రాయన్‌’ కథ ఏంటంటే

    రాయన్‌ (ధనుష్‌) తన ఇద్దరు తమ్ముళ్లు ముత్తువేల్ (సందీప్ కిషన్), మాణిక్యం(కాళిదాస్ జయరామ్), చెల్లి దుర్గ (దుషారా విజయన్) దుర్గతో కలిసి జీవిస్తుంటాడు. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటుంటే ముత్తువేల్‌ మాత్రం ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక అదే ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(ఎస్‌.జే. సూర్య)లు రౌడీలుగా ఒకరికొకరు వేరువేరు గ్యాంగ్స్ తో ఉంటారు. ఆ ఊరికి పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్) అక్కడున్న రౌడీలని అంతం చేయడానికి పగతో వస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా దొరై చనిపోతాడు. దీంతో రాయన్‌ను సీతారం టార్గెట్‌ చేస్తాడు. దొరైని ఎవరు చంపారు? రాయన్‌ను సీతారాం ఎందుకు టార్గెట్‌ చేశాడు? పోలీసాఫీసర్ ఏం చేసాడు? రాయన్‌ తమ్ముళ్లు ఏం అయ్యారు? అన్నది స్టోరీ. 

    ‘డెడ్‌పూల్‌ & వోల్వరైన్‌’ స్టోరీ ఇదే

    డెడ్‌పూల్‌ అలియాస్‌ వేడ్‌ విల్సన్‌ (ర్యాన్‌ రేనాల్డ్స్‌) సెకండ్‌ హ్యాండ్‌ కార్ల సేల్స్‌ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. గర్ల్ ఫ్రెండ్ వెనేసాతో బ్రేకప్ తర్వాత డెడ్‌పూల్ తన డ్రస్‌ తీసేసి తీసేస్తాడు. ఈ క్రమంలో ఓ రోజున టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు డెడ్‌పూల్‌ను ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616లో జాయిన్ అవ్వమంటారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వోల్వరైన్‌ (హ్యూ జాక్‌మన్‌) సాయం అవసరం అవుతుంది. ఈ క్రమంలో వోల్వరైన్‌తో కలిసి డెడ్‌పూల్‌ ఏం చేశాడు? మల్టీవెర్స్‌లో వీరిద్దరూ ఎలాంటి సాహసాలు చేశారు? పారాడాక్స్‌ను ఎలా ఎదిరించారు? అతడి ఎత్తులను ఎలా చిత్తు చేశారు? టైమ్ వేరియెన్స్ అథారిటీలో చివరకు ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv