• TFIDB EN
  • సంగీత్ శోభన్
    జననం : జూన్ 22 , 1996
    ప్రదేశం: హైదరాబాద్, తెలంగాణ.
    సంగీత్ శోభన్.. టాలీవుడ్‌ యువ నటుడు. అతను పిట్ట కథలు (2021), ప్రేమ విమానం (2023), మ్యాడ్‌ (2023) చిత్రాలలో నటించారు.

    సంగీత్ శోభన్ వయసు ఎంత?

    సంగీత్‌ శోభన్ వయసు 29 సంవత్సరాలు

    సంగీత్ శోభన్ ఎత్తు ఎంత?

    5' 8'' (177cm)

    సంగీత్ శోభన్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, క్రికెట్‌ ఆడటం

    సంగీత్ శోభన్ ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేషన్‌

    సంగీత్ శోభన్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    సంగీత్ శోభన్ తన డేటింగ్ లైఫ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. తన వ్యక్తిగత జీవితంపై గోప్యత పాటిస్తున్నాడు.

    సంగీత్ శోభన్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    2024 వరకూ తెలుగులో 8 చిత్రాల్లో సంగీత్‌ శోభన్‌ నటించాడు.

    సంగీత్ శోభన్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    సంగీత్ శోభన్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Sangeeth Shobhan

    Viral Videos

    View post on X

    Sangeeth Shoban Viral Video

    View post on X

    Hero Sangeeth Shoban Viral Video

    MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!
    MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా! నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: కల్యాణ్‌ శంకర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫ్రీ: శ్యామ్ దత్ -దినేష్ క్రిష్ణన్ బి నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య విడుదల తేదీ: 06-10-2023 ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ సినిమా హవా బాగా పెరిగిపోయింది. యువతను ఆకట్టుకునే అంశాలను కథాంశంగా చేసుకొని పలు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం మ్యాడ్‌ (MAD) తెరకెక్కింది. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‌అలాగే యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత మంది నూతన నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్‌ పదే పదే చెబుతూ వచ్చింది. మరి సినిమా నిజంగా నవ్వులు పూయించిందా? మంచి హిట్‌ సొంతం చేసుకుందా? అసలు మూవీ కథేంటి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం.  కథ మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. వారు  రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. భగవాన్ క్యాంటిన్ విషయంలో జరిగిన బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి వారు బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారతారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్‌, అశోక్‌, దామోదర్‌ తమ ప్రేమను గెలిపించుకున్నారా? వంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎలా సాగిందంటే ప్రథమార్ధం ప్రధాన పాత్రల పరిచయం, క్యాంపస్ కబుర్లు, ప్రేమ కబుర్లతో సాగిపోతుంది. ద్వితీయార్ధంలో వెన్నెల కోసం డీడీ వెతుకులాట, మనోజ్, అశోక్ ప్రేమ జంటల ఊసులు, లేడీస్ హాస్టల్‌లో డీడీ గ్యాంగ్ హంగామా కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. కథగా చూసుకుంటే పెద్దగా చెప్పడానికి లేకపోయినా కథనంలో పాత్రలు ప్రవర్తించే తీరు, వారి మధ్య సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశం వినోదాన్ని పంచుతూ సాగుతుంది. ప్రేక్షకులకు రెండు గంటలపాటు ఇంజనీరింగ్ కాలేజిలో ఉన్నామనే భావన కలుగుతుంది. ఎవరెలా చేశారంటే తారక్‌ బావమరిది నార్నె నితిన్.. అశోక్ పాత్రలో లీనమై నటించాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సీరియస్ లుక్‌లో కనిపించినా పతాక సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఎలివేషన్ సీన్స్ మెప్పించాడు. ఇక సంగీత్ శోభన్ , విష్ణుల పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత్ శోభన్ వేగంగా చెప్పే సంభాషణలు, తన నటన తీరుతో మంచి మార్కులు కొట్టేశాడు. లడ్డూగా విష్ణు తన కామెడి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ లవ్లీ బాయ్‌గా కనిపించి సందడి చేశాడు. అమ్మాయిలు గౌరి, అనంతిక చక్కటి నటన ప్రదర్శించారు. రఘుబాబు, మురళీధర్ గౌడ్‌లు తమ పాత్రల పరిధి మేర నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అతిథి పాత్రలో మెరిసి కేకలు పుట్టించాడు. ఇతర పాత్రల్లో కనిపించిన నూతన నటీనటులంతా బాగా చేశారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే కాలేజి క్యాంపస్‌లో చదువులు, విద్యార్థుల మనస్తత్వాలు, పోటీ ప్రపంచంలో విద్యార్థులు నలిగిపోయే తీరు ఎప్పటికీ కథా వస్తువులే. అయితే ‘మ్యాడ్‌’ సినిమాలో వాటిని దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. కథను తీర్చిదిద్దన విధానం బాగుంది. గతంలో వచ్చిన సినిమాల తాలుకు ఛాయలు కనిపించకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టర్‌ చాలా సులభంగా చెప్పేశారు. చదువులు, ర్యాగింగ్ , ర్యాంకులు జోలికి పోకుండా విద్యార్థులు ప్రవర్తించే తీరు, వారి మాటలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. కాలేజిలో దొరికే స్నేహం ఎంత మధురంగా, స్వచ్ఛంగా ఉంటుందనే విషయాన్ని మ్యాడ్ రూపంలో చక్కగా వివరించారు. డైరెక్టర్‌ కల్యాణ్‌ రాసిన మాటలు ప్రతి సన్నివేశంలో నవ్వులు పంచాయి..  టెక్నికల్‌గా పాటల విషయంలో సంగీత దర్శకుడు భీమ్స్ మరింత శ్రద్ధ పెట్టాల్సింది. శ్యామ్ దత్ - దినేష్ క్రిష్ణన్‌ల సినిమాటోగ్రఫి సినిమాను మరో మెట్టు ఎక్కించింది. వారు క్యాంపస్ వాతావరణాన్ని, పాత్రలను అందంగా చూపించింది. నిర్మాణం పరంగా సినిమా ఉన్నతంగా అనిపించింది. నిర్మాతగా అడుగుపెట్టిన హారిక సూర్యదేవరకు మొదటి ప్రయత్నం బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు.  ప్లస్‌ పాయింట్స్‌ నటీనటుల నటనకామెడీ సీన్స్‌సంభాషణలుసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ పాటలుకథ పెద్దగా లేకపోవడం రేటింగ్‌: 3.5/5
    అక్టోబర్ 06 , 2023
    Bench Life Series Review: నిహారిక నిర్మించిన ‘బెంచ్ లైఫ్‌’ సిరీస్‌ మెప్పించిందా? నటీనటులు: వైభవ్‌ రెడ్డి, రితికా సింగ్‌, చరణ్‌, ఆకాంక్ష సింగ్‌, నయన్‌ సారిక, రాజేంద్ర ప్రసాద్‌, తనికెళ్ల భరణి, వెంకటేష్‌ కాకుమాను తదితరులు రచన, దర్శకత్వం : మానస శర్మ సినిమాటోగ్రఫీ : ధనుష్‌ భాస్కర్‌ సంగీతం : పి.కె. దండి నిర్మాత : నిహారిక కొణిదెల నిర్మాణ సంస్థ: పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఓటీటీ వేదిక: సోనీలివ్‌ విడుదల తేదీ : సెప్టెంబర్‌ 12, 2024 మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కొత్త నటీనటులతో సరికొత్త కథాంశాన్ని తెరెకెక్కించి నిహారిక ప్రశంసలు అందుకున్నారు. దీంతో తాజాగా ఆమె నిర్మించిన వెబ్‌సిరీస్‌ 'బెంచ్‌ లైఫ్‌'పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కష్టాల నేపథ్యంలో ఈ సిరీస్‌ రూపొందడం, ఐటీ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న మానస శర్మ అనే మహిళ డైరెక్షన్‌ చేయడంతో మరింత హైప్ ఏర్పడింది. ఇందులో వైభవ్‌ రెడ్డి, చరణ్‌ పెరి, రితికా సింగ్‌, ఆకాంక్ష సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. సోనీలివ్‌లో సెప్టెంబర్‌ 12 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? నిహారిక ఖాతాలో మరో సక్సెస్‌ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి బాలు (వైభవ్ రెడ్డి), రవి (చరణ్ పెరి), మీనాక్షి (రితికా సింగ్) ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులు. మంచి స్నేహితులు కూడా. అదే ఆఫీసులో పని చేసే ఇషా (ఆకాంక్ష సింగ్)ను తొమ్మిదేళ్లుగా బాలు ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెకు చెప్పడు. మరోవైపు మీనాక్షి డైరెక్టర్‌ కావాలని కలలుకంటుంది. కథలు రాసుకొని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటుంది. ఈ క్రమంలోనే భార్య (నయన్‌ సారిక), ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి రవి గోవా వెళ్లాలని ప్లాన్‌ చేస్తాడు. అందుకు ముగ్గురు ఫ్రెండ్స్‌ బెంచ్‌ అడుగుతారు. బెంచ్‌ వచ్చిన తర్వాత ఏమైంది? కంపెనీలో ప్రసాద్‌ వశిష్ఠ (రాజేంద్ర ప్రసాద్‌) రోల్ ఏంటి? భార్యతో రవికి మనస్ఫర్థలు రావడానికి కారణం ఏంటి? రవి తన ప్రేమను ఇషాకు చెప్పాడా? లేదా? డైరెక్టర్‌ కావాలన్న ఇషా కల ఏమైంది? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే బాలు పాత్రకు నటుడు వైభవ్‌ పూర్తిగా న్యాయం చేశాడు. తన కామెడీ టైమింగ్‌తో ఫన్‌ జనరేట్‌ చేశాడు. ఆయన ప్రేమించే అమ్మాయిగా ఆకాంక్ష సింగ్‌ చక్కగా నటించింది. మనసులోని భావాలను బయటకు చెప్పలేని సెటిల్డ్‌ యువతిగా ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో హైలెట్‌ అంటే చరణ్‌ పెరి, నయన్‌ సారిక అని చెప్పవచ్చు. వాళ్లిద్దరి నటనతో పాటు వారి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. మీనాక్షి పాత్రలో రితిక చక్కగా ఒదిగిపోయింది. ఇష్టంలేని జాబ్‌ చేయలేక డైరెక్టర్‌ అయ్యేందుకు కష్టపడే యువతి పాత్రలో ఆమె మెప్పించింది. తులసి ఎప్పటిలా తన పాత్రకు న్యాయం చేశారు. రాజేంద్ర ప్రసాద్ మరోసారి కామెడీ టైమింగ్, ఎమోషన్స్ పరంగా మెప్పించారు. తనికెళ్ల భరణి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ కథలో కీలమైన సందర్భంలో హుందాగా నటించారు. నిహారిక కొణిదెల, సంగీత్ శోభన్, వెంకట్ అతిథి పాత్రల్లో మెరిశారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకురాలు మానస శర్మ యువతరానికి ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప్రతి పాత్రను ఒక అర్థం ఉండేలా రూపొందించారు. ముఖ్యంగా చరణ్ పెరి-నయన్ సారిక జంటకు ఇచ్చిన ముగింపు బాగుంది. అయితే రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ పాత్రలకు ఇచ్చిన ఎండింగ్‌ మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. సహజత్వం కనిపించదు. రాజేంద్రప్రసాద్-వైభవ్ రెడ్డి కామెడీ ట్రాక్ బాగా ప్లస్‌ అయ్యింది. అలాగే రాజేంద్రప్రసాద్ & నయన్ సారిక పాత్రలతో పండించిన సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా డైరెక్టర్‌ మానస శర్మ మంచి మార్కులే సంపాదించుకుంది. అయితే వైభవ్‌ నోటి నుంచి వచ్చే బూతులు, ఐటీ ఉద్యోగులకు మాత్రమే కనెక్ట్‌ అయ్యేలా సిరీస్‌ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.  టెక్నికల్‌గా..  సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి పనితీరు కనబరిచాడు. సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌ వాతావరణాన్ని చక్కగా ప్రజెంట్‌ చేశాడు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఆర్ట్‌ వర్క్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ వంటి ఇతర విభాగాలు కూడా మంచి పనితీరు కనబరిచాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్ ప్రధాన తారాగణం నటనడైరెక్షన్‌ స్కిల్స్‌కామెడీ మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడా బోల్డ్‌ డైలాగ్స్‌ఐటీ ఉద్యోగులకు మాత్రమే కనెక్ట్‌ కావడం Telugu.yousay.tv Rating : 3/5 
    సెప్టెంబర్ 12 , 2024
    Anni Manchi Sakunamule Review: కామెడీ, ఏమోషనల్‌ సీన్స్‌ ఓకే.. కానీ! నటీనటులు: సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి, రావు రమేష్, వెన్నెల కిషోర్ డైరెక్టర్‌: B.V. నందిని రెడ్డి సంగీతం: మిక్కీ J. మేయర్ నిర్మాత : ప్రియాంక దత్‌ సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా చేసిన తాజా చిత్రం ‘అన్ని మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు పాటలు, ట్రైలర్‌ సినిమాపై హైప్ పెంచేశాయి. భారీ అంచనాల మధ్య ఇవాళ (మే 18) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? నందిని రెడ్డి మరో హిట్‌ కొట్టారా? లేదా? శోభన్‌ తన నటనతో ఆకట్టుకున్నాడా? వంటి అంశాలు ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.  కథ సినిమా కథ మెటర్నిటీ ఆసుపత్రిలో ప్రారంభమవుతుంది. నరేష్, రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీరికి పుట్టిన హీరో, హీరోయిన్లు (ఆర్య, రిషి) పొరపాటున మారిపోతారు. వైద్యులు ఒకరిబిడ్డను మరొకరికి అప్పగిస్తారు. అయితే నరేష్‌, రాజేంద్ర ప్రసాద్‌లకు వారి తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తులకు సంబంధించి వివాదం నడుస్తుంటుంది. ఆర్య, రిషిలు పెరిగి పెద్దవారైనట్లే వారి ఆస్తులకు సంబంధించిన సమస్యలు కూడా పెరిగిపోతాయి. ఆ వివాదాన్ని వారు ఎలా పరిష్కరించుకున్నారు? పిల్లలు మారిపోయిన విషయాన్ని వారు ఎలా తెలుకున్నారు? అనేది మిగిలిన కథ.  ఎవరెలా చేశారంటే హీరో సంతోష్‌ శోభన్‌ తన కామెడీ టైమింగ్‌ అదరగొట్టాడని చెప్పొచ్చు. జీవితాన్ని సరదాగా గడిపే యువకుడి పాత్రలో శోభన్ చక్కగా ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటనలో శోభన్ చాలా మెరుగైనట్లు కనిపించాడు. హీరోయిన్‌ మాళవిక సైతం తన పరిధి మేరకు నటించి ఆకట్టుకుంది. మాళవిక, శోభన్‌ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ జంట స్క్రీన్‌ ప్రజెన్స్‌ బాగుంది. ఇక సినిమాకు ప్రధాన బలం ఇతర తారాగణం అని చెప్పొచ్చు. రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేష్, నరేష్‌, గౌతమి, షావుకారు జానకి వంటి అనుభవజ్ఞులైన నటులు తమ యాక్టింగ్‌తో అదరగొట్టారు. ఎమోషనల్ సీన్స్‌లో తమ నటన పాఠవాలను చాటుకున్నారు.  సాంకేతికంగా… ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాకు నందిని రెడ్డి పెట్టింది పేరు. అన్నీ మంచి శకునములే సినిమా ద్వారా సింపుల్‌ ఫ్యామిలీ డ్రామాను ప్రజెంట్‌ చేయాలని భావించి నందిని రెడ్డి తడబడింది.  అనుకున్న కథను తెరపై చూపించడంతో డైరెక్టర్ విఫలమయ్యారు. కొన్ని సీన్లు మరీ నత్తనడకన సాగినట్లు అనిపిస్తాయి.  ఎమోషనల్‌, కామెడీ సీన్స్‌ మినహా సినిమా అంతా బోరింగ్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకుడిని ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది. ఇక మిక్కీ J. మేయర్ అందించిన పాటలు కూడా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కూడా పేలవంగానే అనిపిస్తుంది. అయితే సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సీన్‌ రిచ్‌ లుక్‌లో కనిపిస్తుంది.  ప్లస్‌ పాయింట్స్‌ సంతోష్ శోభన్ నటనకామెడీఎమోషనల్‌ సీన్స్‌ మైనస్ పాయింట్స్‌ సాగదీతబోరింగ్‌ సీన్స్‌పాటలునేపథ్య సంగీతం రేటింగ్‌: 2.5/5
    మే 18 , 2023
    Kavya Thapar Hot Pics: కసి అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న కావ్యా థాపర్‌  కావ్య థాపర్‌ హీరోయిన్‌గా రూపొందిన 'విశ్వం' చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈ అమ్మడి పర్‌ఫార్మెన్స్‌ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.  గోపీచంద్‌ హీరో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నటన పరంగా కావ్యాకు పెద్దగా స్కోప్‌ లభించలేదు. కానీ, గ్లామర్‌ పరంగా ఆమె పెద్ద మ్యాజిక్‌ చేసిందని చెప్పవచ్చు.  తన అందచందాలతో మరోమారు యూత్‌ను కట్టిపడేసింది. ఈ నేపథ్యంలోనే #KavyaThapar హ్యాష్‌ట్యాగ్‌ నెట్టింద తెగ ట్రెండ్ అవుతోంది.  ముఖ్యంగా 'గుంగురు గుంగురు పార్టీ' అంటూ సాగే మాస్‌ సాంగ్‌లో కావ్యా దుమ్మురేపిందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. తన అందం, డ్యాన్స్‌తో లుక్స్‌ తిప్పుకోనివ్వకుండా చేసిందని పోస్టులు పెడుతున్నారు.  https://twitter.com/i/status/1844650013252825352 సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్‌ను కాదని మరో సంగీత దర్శకుడు భీమ్స్‌కు స్పెషల్‌గా పాట బాధ్యతను అప్పగించారు. భీమ్స్‌ పాడిన ఈ పాటకు గోపీచంద్‌, కావ్యా థాపర్‌ మాస్‌ స్టెప్పులు వేసి ఊర్రూతలూగించారు.  https://twitter.com/actressspecial/status/1844644160881426905 ఇటీవల వచ్చిన డబుల్‌ ఇస్మార్ట్‌లోనూ కావ్యా థాపర్‌ గ్లామర్‌ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. రామ్‌కు పోటీగా చిందులేసి సాంగ్స్‌లో రచ్చ రచ్చ చేసింది.  మహారాష్ట్రకు చెందిన కావ్యా థాపర్‌ 2013లో వచ్చిన ‘తత్కాల్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా నటన కెరీర్‌ ప్రారంభించింది. 2018లో తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ (Ee Maaya Peremito) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. 2019లో 'మార్కెట్‌ రాజా ఎంబీబీఎస్‌' (Market Raja MBBS) తమిళ చిత్రం చేసినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.  2021లో యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ పక్కన ‘ఏక్‌ మినీ కథ’లో నటించి హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. అమృతగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.  2022లో 'మిడిల్‌ క్లాస్‌ లవ్‌' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సైషా ఒబరాయ్‌ పాత్రలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ సినిమా ఆడకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు.  గతేడాది విజయ్‌ ఆంటోని సరసన 'బిచ్చగాడు 2'లో కావ్య నటించింది. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో కావ్యాకు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కాయి. ఈ ఏడాది రవితేజ సరసన ఈగిల్‌ సినిమాలో నటించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా సక్సెస్‌ కాకపోవడంతో కావ్యకు నిరాశే మిగిలింది. ఆ తర్వాత వచ్చిన ఊరు పేరు భైరవకోన, డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రాలు హిట్‌ కాకపోవడంతో కావ్యా థాపర్‌ మళ్లీ ఢీలా పడిపోయింది. తాజాగా వచ్చిన ‘విశ్వం’ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించడంతో కావ్యా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లలో సైతం కావ్యా నటించింది. క్యాట్‌ (పంజాబీ), ఫర్జీ (హిందీ) సిరీస్‌లలో ముఖ్య పాత్రలు పోషించింది.  ఇదిలా ఉంటే తను సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కావ్యా తెలిపారు. విశ్వం సినిమా హిట్‌ కావాలని నవరాత్రుల సందర్భంగా ఉపవాసం కూడా ఉంటున్నట్లు చెప్పారు.  తెలుగులో భాషలో స్పష్టంగా మాట్లాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు కావ్య చెప్పింది. షూటింగ్‌ సమయంలో గోపిచంద్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు వివరించింది.  ఓవైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను పంచుకుంటూ అభిమానులకు హాట్ ట్రీట్‌ ఇస్తోంది.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఖాతా నుంచి ఏ ఫొటో వచ్చిన వెంటనే ట్రెండ్ చేస్తున్నారు. 
    అక్టోబర్ 11 , 2024

    సంగీత్ శోభన్ తల్లిదండ్రులు ఎవరు?

    శోభన్(తండ్రి), సౌజన్య

    సంగీత్ శోభన్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    సంగీత్ శోభన్ తండ్రి దివంగత శోభన్ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆయన ప్రభాస్‌తోవర్షంసినిమా తీశాడు. అలాగే మహేష్ బాబుతో బాబీచిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

    సంగీత్ శోభన్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    సంగీత్‌ శోభన్‌కు సంతోష్‌ శోభన్ అనే అన్న ఉన్నాడు. అతను కూడా సినిమాల్లో హీరోగా రాణిస్తున్నాడు.

    సంగీత్ శోభన్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    మ్యాడ్‌సినిమా ద్వారా సంగీత్‌ శోభన్‌ పాపులర్‌ అయ్యారు.

    సంగీత్ శోభన్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    గోల్కొండ స్కూల్‌' చిత్రం ద్వారా బాల నటుడిగా సంగీత్ తెరంగేట్రం చేశాడు. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' సిరీస్‌తో హీరోగా మారాడు.

    తెలుగులో సంగీత్ శోభన్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    సంగీత్ శోభన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    మ్యాడ్‌చిత్రంలో డీడీ పాత్ర

    సంగీత్ శోభన్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    సంగీత్ శోభన్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    సంగీత్ శోభన్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.20 లక్షల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం.

    సంగీత్ శోభన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చికెన్‌ బిర్యాని

    సంగీత్ శోభన్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    సంగీత్ శోభన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    సంగీత్ శోభన్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    సంగీత్ శోభన్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    రెడ్‌, బ్లూ

    సంగీత్ శోభన్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    సంగీత్ శోభన్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    సంగీత్ శోభన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    91.1K ఫాలోవర్లు ఉన్నారు.

    సంగీత్ శోభన్ సోషల్‌ మీడియా లింక్స్‌

    సంగీత్ శోభన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సంగీత్ శోభన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree