నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి, రావు రమేష్, వెన్నెల కిషోర్
డైరెక్టర్: B.V. నందిని రెడ్డి
సంగీతం: మిక్కీ J. మేయర్
నిర్మాత : ప్రియాంక దత్
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా చేసిన తాజా చిత్రం ‘అన్ని మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేశాయి. భారీ అంచనాల మధ్య ఇవాళ (మే 18) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? నందిని రెడ్డి మరో హిట్ కొట్టారా? లేదా? శోభన్ తన నటనతో ఆకట్టుకున్నాడా? వంటి అంశాలు ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథ
సినిమా కథ మెటర్నిటీ ఆసుపత్రిలో ప్రారంభమవుతుంది. నరేష్, రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీరికి పుట్టిన హీరో, హీరోయిన్లు (ఆర్య, రిషి) పొరపాటున మారిపోతారు. వైద్యులు ఒకరిబిడ్డను మరొకరికి అప్పగిస్తారు. అయితే నరేష్, రాజేంద్ర ప్రసాద్‌లకు వారి తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తులకు సంబంధించి వివాదం నడుస్తుంటుంది. ఆర్య, రిషిలు పెరిగి పెద్దవారైనట్లే వారి ఆస్తులకు సంబంధించిన సమస్యలు కూడా పెరిగిపోతాయి. ఆ వివాదాన్ని వారు ఎలా పరిష్కరించుకున్నారు? పిల్లలు మారిపోయిన విషయాన్ని వారు ఎలా తెలుకున్నారు? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
హీరో సంతోష్ శోభన్ తన కామెడీ టైమింగ్ అదరగొట్టాడని చెప్పొచ్చు. జీవితాన్ని సరదాగా గడిపే యువకుడి పాత్రలో శోభన్ చక్కగా ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటనలో శోభన్ చాలా మెరుగైనట్లు కనిపించాడు. హీరోయిన్ మాళవిక సైతం తన పరిధి మేరకు నటించి ఆకట్టుకుంది. మాళవిక, శోభన్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ జంట స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఇక సినిమాకు ప్రధాన బలం ఇతర తారాగణం అని చెప్పొచ్చు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి వంటి అనుభవజ్ఞులైన నటులు తమ యాక్టింగ్‌తో అదరగొట్టారు. ఎమోషనల్ సీన్స్‌లో తమ నటన పాఠవాలను చాటుకున్నారు.
సాంకేతికంగా…
ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాకు నందిని రెడ్డి పెట్టింది పేరు. అన్నీ మంచి శకునములే సినిమా ద్వారా సింపుల్ ఫ్యామిలీ డ్రామాను ప్రజెంట్ చేయాలని భావించి నందిని రెడ్డి తడబడింది.
అనుకున్న కథను తెరపై చూపించడంతో డైరెక్టర్ విఫలమయ్యారు. కొన్ని సీన్లు మరీ నత్తనడకన సాగినట్లు అనిపిస్తాయి. ఎమోషనల్, కామెడీ సీన్స్ మినహా సినిమా అంతా బోరింగ్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకుడిని ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది. ఇక మిక్కీ J. మేయర్ అందించిన పాటలు కూడా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కూడా పేలవంగానే అనిపిస్తుంది. అయితే సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సీన్ రిచ్ లుక్‌లో కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
- సంతోష్ శోభన్ నటన
- కామెడీ
- ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
- సాగదీత
- బోరింగ్ సీన్స్
- పాటలు
- నేపథ్య సంగీతం
రేటింగ్: 2.5/5
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి