• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’… తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!

    నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు

    దర్శకత్వం: కల్యాణ్‌ శంకర్

    సంగీతం: భీమ్స్ సిసిరోలియో

    సినిమాటోగ్రఫ్రీ: శ్యామ్ దత్ -దినేష్ క్రిష్ణన్ బి

    నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య

    విడుదల తేదీ: 06-10-2023

    ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ సినిమా హవా బాగా పెరిగిపోయింది. యువతను ఆకట్టుకునే అంశాలను కథాంశంగా చేసుకొని పలు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం మ్యాడ్‌ (MAD) తెరకెక్కింది. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‌అలాగే యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత మంది నూతన నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్‌ పదే పదే చెబుతూ వచ్చింది. మరి సినిమా నిజంగా నవ్వులు పూయించిందా? మంచి హిట్‌ సొంతం చేసుకుందా? అసలు మూవీ కథేంటి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం. 

    కథ

    మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. వారు  రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. భగవాన్ క్యాంటిన్ విషయంలో జరిగిన బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి వారు బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారతారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్‌, అశోక్‌, దామోదర్‌ తమ ప్రేమను గెలిపించుకున్నారా? వంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎలా సాగిందంటే

    ప్రథమార్ధం ప్రధాన పాత్రల పరిచయం, క్యాంపస్ కబుర్లు, ప్రేమ కబుర్లతో సాగిపోతుంది. ద్వితీయార్ధంలో వెన్నెల కోసం డీడీ వెతుకులాట, మనోజ్, అశోక్ ప్రేమ జంటల ఊసులు, లేడీస్ హాస్టల్‌లో డీడీ గ్యాంగ్ హంగామా కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. కథగా చూసుకుంటే పెద్దగా చెప్పడానికి లేకపోయినా కథనంలో పాత్రలు ప్రవర్తించే తీరు, వారి మధ్య సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశం వినోదాన్ని పంచుతూ సాగుతుంది. ప్రేక్షకులకు రెండు గంటలపాటు ఇంజనీరింగ్ కాలేజిలో ఉన్నామనే భావన కలుగుతుంది.

    ఎవరెలా చేశారంటే

    తారక్‌ బావమరిది నార్నె నితిన్.. అశోక్ పాత్రలో లీనమై నటించాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సీరియస్ లుక్‌లో కనిపించినా పతాక సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఎలివేషన్ సీన్స్ మెప్పించాడు. ఇక సంగీత్ శోభన్ , విష్ణుల పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత్ శోభన్ వేగంగా చెప్పే సంభాషణలు, తన నటన తీరుతో మంచి మార్కులు కొట్టేశాడు. లడ్డూగా విష్ణు తన కామెడి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ లవ్లీ బాయ్‌గా కనిపించి సందడి చేశాడు. అమ్మాయిలు గౌరి, అనంతిక చక్కటి నటన ప్రదర్శించారు. రఘుబాబు, మురళీధర్ గౌడ్‌లు తమ పాత్రల పరిధి మేర నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అతిథి పాత్రలో మెరిసి కేకలు పుట్టించాడు. ఇతర పాత్రల్లో కనిపించిన నూతన నటీనటులంతా బాగా చేశారు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    కాలేజి క్యాంపస్‌లో చదువులు, విద్యార్థుల మనస్తత్వాలు, పోటీ ప్రపంచంలో విద్యార్థులు నలిగిపోయే తీరు ఎప్పటికీ కథా వస్తువులే. అయితే ‘మ్యాడ్‌’ సినిమాలో వాటిని దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. కథను తీర్చిదిద్దన విధానం బాగుంది. గతంలో వచ్చిన సినిమాల తాలుకు ఛాయలు కనిపించకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టర్‌ చాలా సులభంగా చెప్పేశారు. చదువులు, ర్యాగింగ్ , ర్యాంకులు జోలికి పోకుండా విద్యార్థులు ప్రవర్తించే తీరు, వారి మాటలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. కాలేజిలో దొరికే స్నేహం ఎంత మధురంగా, స్వచ్ఛంగా ఉంటుందనే విషయాన్ని మ్యాడ్ రూపంలో చక్కగా వివరించారు. డైరెక్టర్‌ కల్యాణ్‌ రాసిన మాటలు ప్రతి సన్నివేశంలో నవ్వులు పంచాయి.. 

    టెక్నికల్‌గా

    పాటల విషయంలో సంగీత దర్శకుడు భీమ్స్ మరింత శ్రద్ధ పెట్టాల్సింది. శ్యామ్ దత్ – దినేష్ క్రిష్ణన్‌ల సినిమాటోగ్రఫి సినిమాను మరో మెట్టు ఎక్కించింది. వారు క్యాంపస్ వాతావరణాన్ని, పాత్రలను అందంగా చూపించింది. నిర్మాణం పరంగా సినిమా ఉన్నతంగా అనిపించింది. నిర్మాతగా అడుగుపెట్టిన హారిక సూర్యదేవరకు మొదటి ప్రయత్నం బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు. 

    ప్లస్‌ పాయింట్స్‌
    • నటీనటుల నటన
    • కామెడీ సీన్స్‌
    • సంభాషణలు
    • సినిమాటోగ్రఫీ
    మైనస్‌ పాయింట్స్‌
    • పాటలు
    • కథ పెద్దగా లేకపోవడం
    రేటింగ్‌: 3.5/5
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv