విజయవంతంగా అగ్ని-V ప్రయోగం
భారత్ అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ మిసైల్ అగ్ని-V ను విజయవంతంగా పరీక్షించింది. 5000 కి.మీ.ల దూరమున్న లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణి భారత రక్షణ వ్యవస్థను మరింత బలంగా మార్చనుంది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి క్షిపణిని పరీక్షించారు. ప్రస్తుతమున్న అగ్నిIV 4000 కి.మీల దూరమున్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అగ్ని-III రేంజ్ 3,000 కి.మీలు.