ఆమిగోస్‌గా భయపెడుతున్న కళ్యాణ్ రామ్
మరో వినూత్నమైన కథాంశంతో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఆమిగోస్ నుంచి టీజర్ రిలీజైంది. ఎలాంటి బయోలాజికల్ కనెక్షన్ లేకుండా ఒకే రూపంలో ఉండే ముగ్గురి పాత్రల్లో కళ్యాణ్ రామ్ నటించారు. ఇలా ముగ్గురు వ్యక్తులు కలవడం వెనుక ఓ సిక్రెట్ ఆపరేషన్ ఉందని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. కాగా ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఆశిఖ రంగానాథన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమిగోస్ ఫిబ్రవరి 10న విడుదల కానుంది.