వెంకటేష్ కుమార్తెతో చైతూ వంట కబుర్లు
నటుడు వెంకటేశ్ కుమార్తె అశ్రిత తన యూట్యూబ్ ఛానల్ ‘ఇన్ఫినిటీ ఫ్లాటర్’లో కొత్త వంటలను పరిచయం చేస్తుంటారు. ఈ క్రమంలో తన బావ, యంగ్ హీరో నాగచైతన్యకు చెందిన క్లౌడ్ కిచెన్‌లో ఆమె సందడి చేశారు. అక్కడ తయారయ్యే ఫుడ్ గురించి చైతూను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అశ్రితకు చైతూ అక్కడి ఫుడ్ టేస్ట్ చూపించాడు. అక్కడి వంటకాలకు అశ్రిత ఫిదా అయిపోయారు. కాగా వీడియోలో ‘మై బావ’ అంటూ చైతూను పిలవడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.