బీజేపీ నేత కుంజా సత్యవతి మృతి
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన సత్యవతి.. భద్రాచలంలోని ఆమె నివాసం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఆమె మృతిపట్ల టీబీజేపీ చీఫ్ కిషన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ సహా ఇతర బీజేపీ నేతలు సత్యవతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.