LIVE: సీఎం జగన్ ఇంట సంక్రాంతి సంబురాలు
సీఎం జగన్ ఇంట సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సీఎం జగన్ దంపతులు ముందుగా జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాల్ని ప్రారంభించారు. అనంతరం గోశాలలో గోపూజ చేసి… భోగి మంటను వెలిగించారు. హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.