యూట్యూబ్‌లో కొత్త ఫీచర్
యూట్యూబ్ మొబైల్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ‘వాచ్ పేజ్’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. యూట్యూబ్‌లో వస్తున్న ఫేక్ న్యూస్‌ను అరికట్టి విశ్వసనీయ వార్తలను యూజర్లకు అందించాలని యూట్యూట్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల యూట్యూబ్‌లో ఫేక్ ఛానెళ్లను అరికట్టాలని సూచించింది. ఈ క్రమంలో యూట్యూబ్ ఈ ప్రకటనను వెలువరించింది.