గాంధీలో సంతాన సాఫల్య కేంద్రం
HYD: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా అధునాతన సంతాన సాఫల్య కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఐదో అంతస్తులోని తల్లీపిల్లల విభాగంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. దీంతో ఇకపై గాంధీ ఆస్పత్రిలో పైసా ఖర్చు లేకుండానే ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం పొందే అవకాశముంది. దీని కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు చేసింది. వాస్తవానికి 2018లోనే గాంధీలో సంతాన సాఫల్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఐయూఐ పద్ధతిలో సంతానం పొందేలా ప్రయత్నం చేసేవారు.