సూర్య- దుల్కర్ కాంబో ఫిక్స్
హీరోలు సూర్య, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్‌లో ఓ మూవీ ఖరారైంది. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం దర్శకుడు సుధా కొంగర, హీరో సూర్యతో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో దుల్కర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. సోషల్ మీడియా వేదికగా సుధా కొంగర, సూర్య తమ కొత్త ప్రాజెక్టు వివరాలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.