సూది అవసరం లేకుండా ఇన్సులిన్
ఓ వ్యక్తి ఇన్సులిన్ తీసుకోవాలంటే సూది ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. అయితే హైదరాబాద్‌కు చెందిన నీడిల్‌ఫ్రీ టెక్నాలజీస్ ‘సూది అవసరం లేని, నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్ స్ప్రే ‘ఓజులిన్’ను’ అభివృద్ధి చేసింది. దీని ద్వారా మధుమేహ చికిత్సలో సూది నొప్పిలేండా ఉపశమనం పొందవచ్చు. ఇప్పటికే 40కి పైగా దేశాల్లో ఓజులిన్‌కు అంతర్జాతీయ పేటెంట్లను సంపాదించింది. ఇపుడు ఓజులిన్‌పై భద్రతా పరీక్షలను నిర్వహించడానికి సీడీఎస్‌సీఓకు కంపెనీ దరఖాస్తు చేసింది.