అత్తను కాల్చిచంపిన అల్లుడు
TS: హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓవ్యక్తి అత్తను అల్లుడు కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళ్తే గుండ్ల సింగారానికి చెందిన రమాదేవికి, ప్రసాద్‌తో 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో మూడేళ్లుగా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్.. తుపాకీని తీసుకుని అత్తగారి ఇంటికి వెళ్లాడు. అక్కడ అత్త కమలమ్మ(53)కు ప్రసాద్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపంతో ప్రసాద్ తుపాకీతో కమలమ్మను కాల్చిచంపాడు.