‘కొవిడ్ రోగులు ఎక్కువగా శ్రమించొద్దు’
దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలపై కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19 నుంచి కోలుకున్నవారు రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. దీనివల్ల కార్డియాక్ అరెస్ట్ ముప్పు నుంచి బయటపడొచ్చని సూచించారు. ఈ మేరకు ICMR అధ్యయనం పేర్కొందని తెలిపారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారు ఒత్తిడితో కూడిన పనులు, పరిగెత్తడం, కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలని అని మాండవీయ సూచించారు.