లోక్ సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కేంద్రమంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టారు. ‘నారీశక్తి వందన్’ పేరుతో బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లు కాపీలు ఇవ్వకపోవడంపై విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. బిల్లును డిజిటల్ ఫార్మట్లో అప్‌లోడ్ చేశామని మంత్రి వివరించారు. ఎల్లుండి రాజ్యసభలో బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. మహిళా బిల్లు ఇప్పుడు చట్టంగా మారినా.. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి తెస్తామని అర్జున్ రామ్ ప్రకటించారు. అందుకు 2026 వరకు టైం ఉంది. https://x.com/ANI/status/1704054293320610051?s=20