నేను అందరివాడిని; నందమూరి బాలకృష్ణ
తాను రాయలసీమకే పరిమితమవుతానని అందరూ అనుకుంటారని.. కానీ నేను అందరివాడినని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఒంగోలులో జరిగిన ‘వీరసింహారెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ ఒంగోలు గిత్త గోపీచంద్ అద్భుత దర్శకుడు. నటులు, టెక్నీషియన్ల నుంచి టాలెంట్ వెలికితీసే సత్తా అతనికి ఉంది. నా తర్వాతి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడిది కూడా ఒంగోలే. నాకు జన్మనిచ్చి, మీ అందరి గుండెల్లో స్థానం కల్పించినందుకు ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు.’’ అంటూ పేర్కొన్నారు.